Search
  • Follow NativePlanet
Share
» »ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరిచే ఆలయాన్ని దర్శిస్తే ఏలాంటి సర్పదోశమైనా నివారణ

ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరిచే ఆలయాన్ని దర్శిస్తే ఏలాంటి సర్పదోశమైనా నివారణ

మన హిందు ధర్మంలో సర్పాలను(పాములను) ఆరాధించే సంస్కృతి అనాది కాలం నుండి వస్తోంది. హిందూ ధర్మంలో సర్పాలను దేవతల ఆభరణంగా భావిస్తారు. మన దేశంలో ఎన్నో నాగ దేవతల ఆలయాలున్నాయి. అందులో ప్రముఖమైనది, ఇతర ఆలయాల కంటే భిన్నమైంది ఉజ్జయినిలోని నాగ చంద్రేశ్వరాలయం . ఉజ్జయినిలోని మహాకాల్ మందిరంలో మూడో అంతస్తులో నాగచంద్రేశ్వరాలయం కొలువై ఉంది. ఆ ఆలయం సంవత్సరంలో ఒక రోజు మాత్రమే, అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆరోజున మాత్రమే భక్తులకు నాగచంద్రేశ్వరస్వామి వారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. మరి ఈ ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో 11వ శతాబ్ధానికి చెందిన అద్భుతమైన ప్రతిమ

నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో 11వ శతాబ్ధానికి చెందిన అద్భుతమైన ప్రతిమ

నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో 11వ శతాబ్ధానికి చెందిన అద్భుతమైన ప్రతిమ ఉంటుంది. ఇందులో పడగ విప్పి ఉండే పామునే ఆసనంగా చేసుకుని కూర్చొన్న శివపార్వతులుంటారు. ఈ ప్రతిమను నేపాల నుండి తెప్పించారని చెబుతుంటారు. ఉజ్జయినిలో తప్ప ఇలాంటి ప్రతిమ ప్రపంచంలో మరెక్కడా ఉండదట.

 సర్పంపైన విష్ణు భగవానుడు మాత్రమే శయనిస్తాడు

సర్పంపైన విష్ణు భగవానుడు మాత్రమే శయనిస్తాడు

సాధారణంగా అయితే సర్పంపైన విష్ణు భగవానుడు మాత్రమే శయనిస్తాడు. కానీ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఉజ్జయిని లోని నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో భోళాశంకరుడు శయనించి ఉండటం విశేషం.

ఈ ప్రతిమలో శివపార్వతులతో పాటు వారి ముద్దుల తనయుడు

ఈ ప్రతిమలో శివపార్వతులతో పాటు వారి ముద్దుల తనయుడు

ఈ ప్రతిమలో శివపార్వతులతో పాటు వారి ముద్దుల తనయుడు వినాయకుడు కూడా కొలువై ఉన్నఅద్భుత దృశ్యం చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు. నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో సర్పంపైన పరమశివుడు శయనించి ఉండడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది.

సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే తెరిచే ఈ ఆలయంలో

సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే తెరిచే ఈ ఆలయంలో

సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే తెరిచే ఈ ఆలయంలో ఆ ఒక్క రోజున మాత్రమే సర్పరాజుగా భావించే తక్షకుడు ఆలయంలోనే ఉంటాడట. ఈ ఆలయంలో సర్పంపైన పరమశివుడు శయనించి ఎందుకు ఉన్నాడంటే సర్పరాజు తక్షకుడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్పు చేశాడట.

ప్రసన్నమైన శివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదించాడట.

ప్రసన్నమైన శివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదించాడట.

ప్రసన్నమైన శివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదించాడట. ఇక అప్పటి నుండి తక్షకుడు శివుడు సాన్నిధ్యంలోనే ఉండిపోయాడని చెబుతారు. ఆ ఒక్కరోజున అయితే పరమేశ్వరడు తనకు అప్పటికే నంది వాహనంగా ఉందని చెబుతాడు.

పరమేశ్వరుడు తక్షకుడి పై కూర్చొన్న స్థితిలో కనిపిస్తాడు.

పరమేశ్వరుడు తక్షకుడి పై కూర్చొన్న స్థితిలో కనిపిస్తాడు.

అయితే నాగపంచమి రోజున అంటే శ్రవణ శుక్ల పంచమి రోజు నీ పై కొర్చోవడమే కాకుండ శయనిస్తానని చెబుతాడు. అందువల్లే ఈ దేవాలయంలో పరమేశ్వరుడు తక్షకుడి పై కూర్చొన్న స్థితిలో కనిపిస్తాడు.

నాగచంద్రేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర

నాగచంద్రేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర

నాగచంద్రేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 1050లో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడు. ఆయన తర్వాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మహరాజ్ 1732లో ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టాడు.

ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు

ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు

ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు సర్పదోషాలన్నీ తొలగిపోతాయట. ఈ దైవ దర్శనం వల్ల మన జీవితంలో అప్పటి వరకూ ఎదుర్కొన్న సర్పదోశ నివారణతో పాటు భవిష్యత్తులో కలిగే సర్ప సంబంధ దోషాలన్నీ సమిసిపోతాయని భక్తులు నమ్మకం.

నాగపంచమి రోజు ఆలయానికి

నాగపంచమి రోజు ఆలయానికి

అందుకే నాగపంచమి రోజు ఆలయానికి పోటెత్తుతుంటారు. నాగచంద్రేశ్వరుడి దర్శించుకుని పునీతులవుతారు. ఈ ఒక్కరోజే దాదాపు మూడు లక్షల మంది భక్తులు దర్శించుకోవడం విశేషం.

ఇందులో విదేశీ భక్తులు

ఇందులో విదేశీ భక్తులు

ఇందులో విదేశీ భక్తులు కూడా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో ఆ దేవాలయంతో పాటు ఆ పురాణ ప్రాధాన్యత కలిగిన పట్ణణంలోని మరికొన్ని దేవాలయల గురించిన వివరాలు మీ కోసం...

ద్వాదశ జ్యతిర్లింగాలలో ఒకటి

ద్వాదశ జ్యతిర్లింగాలలో ఒకటి

భారత దేశంలో శివుడు ద్వాదశ జ్యతిర్లింగాల రూపంలో కొలువై ఉన్నాడని హిందువుల నమ్మకం. ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటే ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగం. ఈ దేవాలయం ప్రాంగణంలో ఉన్న శివలింగాలకకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

కొన్ని లక్షల ఏళ్ల నుంచి పూజల అందుకొంటున్న ఈ లింగం స్వయంభువు

కొన్ని లక్షల ఏళ్ల నుంచి పూజల అందుకొంటున్న ఈ లింగం స్వయంభువు


ఇక్కడి జ్యోతిర్లింగాన్ని మహాకాళేశ్వర లింగం అని అంటారు. కొన్ని లక్షల ఏళ్ల నుంచి పూజల అందుకొంటున్న ఈ లింగం స్వయంభువు అని భక్తుల కథనం. ఇక్కడి దేవాలయాన్ని ఎవరు నిర్మించారన్న దానికి సరైన ఆధారాలు లేవు.

దక్షిణా మూర్తి అని కూడా ఇక్కడి

దక్షిణా మూర్తి అని కూడా ఇక్కడి

మహాకాళేశ్వరుడిని దక్షిణా మూర్తి అని కూడా పిలుస్తారు. ఈ శివలింగం యోక్క ముఖం దక్షిణ దిశలో ఉండటమే ఇందుకు కారణం. దక్షిణ దిశలో శివలింగం ఉండటం చాలా అరుదైన విషయం. అందుకే జ్యోతిర్లింగాల్లో ఈ శివలింగానికి విశిష్ట శక్తులు ఉన్నాయని నమ్ముతారు.

రెండు దేవాలయాలు

రెండు దేవాలయాలు

ఈ గర్భగుడిలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర దిశల్లోని గోడల పై పార్వతీదేవి, వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు ఉంటాయి. దక్షిణ దిశలో మాత్రం నంది ఉంటాడు. మహాకాళేశ్వర లింగంతో ఈ దేవాలయంలో మరో రెండు దేవాలయాలను ఉన్నాయి.

మూడో అంతస్తులో నాగ చంద్రేశ్వరుడు

మూడో అంతస్తులో నాగ చంద్రేశ్వరుడు

మహాకాళేశ్వర లింగం పై భాగంలో అంటే మొదటి అంతస్తులో ఓంకార లింగేశ్వరుడు లింగం రూపంలో మనకు దర్శనమిస్తాడు. ఈ దేవాలయం పై భాగంలో అంటే మూడో అంతస్తులో నాగ చంద్రేశ్వరుడు మనకు కనిపిస్తాడు.

ఎలా వెళ్లాలి

ఎలా వెళ్లాలి

ఉజ్జయినికి దగ్గరగా దేవీ అహల్యాభాయ్ హోల్కర్ ఎయిర్ పోర్టు ఉంది. దేశంలోని వివిధ నగరాల నుంచి ఇక్కడికి విమాన సర్వీసులు ఉన్నాయి. ఈ ఎయిర్ పోర్టు నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జయిని చేరుకోవడానికి ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. రైలు, బస్సు మార్గాలు
ఉజ్జయినిలో ప్రధాన రైల్వే స్టేషన్ ఉంది. దేశంలోని వివిధ చోట్ల నుంచి ఇక్కడకు రైలు సదుపాయం ఉంది. అదేవిధంగా గ్వాలియర్, భోపాల్ నుంచి కూడా ఉజ్జయినికి నేరుగా బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+