Search
  • Follow NativePlanet
Share
» »నల్గొండ ప‌ట్ట‌ణంలో నిత్యం జాతీయ‌గీతం ఆలాప‌న‌..!

నల్గొండ ప‌ట్ట‌ణంలో నిత్యం జాతీయ‌గీతం ఆలాప‌న‌..!

నల్గొండ ప‌ట్ట‌ణంలో నిత్యం జాతీయ‌గీతం ఆలాప‌న‌..!

జీవితం ఎప్పటికీ ఆగదు. జీవితానికి మ‌రోపేరు నడక అని అంటారు. నిత్యం దాని ప్ర‌యాణం అది కొన‌సాగిస్తూనే ఉంటుంది. కానీ భారతదేశంలో ఒక ప‌ట్ట‌ణంలోని ప్ర‌జ‌లు మాత్రం ప్రతిరోజూ 52 సెకన్ల పాటు ఒక్క అడుగు కూడా కదలకుండా నిలబడి ఉంటారు. అవును, భారతదేశంలోని ఒక నగరం అకస్మాత్తుగా 52 సెకన్ల పాటు ఆగిపోతుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు, స్త్రీ నుంచి పురుషుని వరకు ఎవరూ ఒక్క అడుగు కూడా ఆ స‌మ‌యంలో క‌ద‌ల‌రంటే న‌మ్మండి. ఇది మ‌రెక్క‌డో కాదండి. తెలంగాణ‌లోని న‌ల్గొండ ప‌ట్ట‌ణంలో ఈ వింత జ‌రుగుతుంది.

ఇక్కడ ప్రతిరోజూ ఉదయం ఒక నిర్దిష్ట సమయంలో జాతీయ గీతం ప్లే చేయబడుతుంది. ఆ స‌మ‌యంలో ఆ ప‌ట్ట‌ణంలోని ప్ర‌జ‌లు ఏ ప‌నిలో ఉన్నా స‌రే, అంద‌రూ జాతీయ‌గీతం ఆల‌పిస్తారు. ప్రతిరోజు ఉదయం 8.30 గంటలకు లౌడ్‌స్పీకర్‌లో జాతీయ గీతం ప్లే చేస్తారు. ఆ స‌మ‌యంలో నగరం మొత్తం 52 సెకన్ల పాటు ఆగిపోతుంది. జాతీయ గీతం కోసం ఈ న‌గరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేశారు. దాంతో ఏ ప‌ని చేస్తున్న వారైనా స‌రి అక్క‌డే ఆగి జాతీయ‌గీతం పాడ‌తారు.

ఈ నగరం దేశభక్తికి ఉదాహరణ..

భార‌త జాతీయ‌గీతం జ‌న‌గ‌ణ‌మ‌న‌ను నిత్యం పాఠ‌శాల‌ల్లో ఆల‌పిస్తుంటారు. ఆగ‌స్టు 15, జ‌న‌వ‌రి 26 వంటి సందర్భాల్లో ప్ర‌భుత్వ కార్య‌కలాపాల్ల‌లో జాతీయ‌గీతం పాడుతుంటారు. కానీ, న‌ల్గొండ జిల్లాలోని తిప్ప‌ర్తి ప‌ట్ట‌ణంలో మాత్రం ప్ర‌తిరోజూ పొద్దున్నే ఎనిమిదిన్న‌ర గంట‌ల‌కు జెండావంద‌నం నిర్వ‌హిస్తారు. అటుగా వెళ్లే ప్ర‌తి ఒక్క‌రూ ఆ కార్య్ర‌క‌మంలో శ్ర‌ద్ద‌గా పాల్గొంటారు. కాలిన‌డ‌కన వెళ్లేవారు, బైక్‌ల మీద వెళ్లేవారు ఆ జంక్ష‌న్ ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి త‌ప్ప‌కుండా అక్క‌డ ఆగుతారు.

1

బండిని ఆపి మ‌రీ త్రివ‌ర్ణ‌ప‌తాకాన్నిసెల్యూట్ చేసి జాతీయ‌గీతాన్ని ఆల‌పిస్తారు. ఆ విధంగా జాతీయ‌గీతాన్ని గౌర‌విస్తూ త‌మ దేశ‌భ‌క్తిని చాటుకుంటున్నారు. స‌రిగ్గా ఎనిమిదిన్న‌ర‌కు జాతీయ గీతాలాప‌న ప్రారంభ‌మ‌వుతుందంటూ అనౌన్స్‌మెంట్ వ‌స్తుంది. ప్ర‌జ‌ల్లో జాతీయ స్పూర్తిని ఇనుమ‌డింప‌జేసేందుకు ఈ కార్య‌క్ర‌మాన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా కొన‌సాగిస్తున్నారు. తిప్ప‌ర్తి టౌన్ హైద‌రాబాద్ విజ‌య‌వాడ హైవేలో ఉంటుంది. భాగ్య‌న‌గ‌రం నుండి ఈ టౌన్ 118 కిలోమీట‌ర్లు ఉంటుంది.

మొద‌ట‌గా ఇక్క‌డే ప్రారంభం..

నల్లొంగ టౌన్‌కంటే ముందుగా ఇది క‌రీంన‌గ‌ర్‌లోని జ‌మ్మికుంట‌లో ప్రారంభ‌మ‌య్యింది. అక్క‌డ 2017 ఆగస్టు 15 నుంచి ప్ర‌తిరోజూ ఉదయం ఎనిమిదిన్న‌ర‌కు జాతీయ‌గీతం ఆల‌పించేవారు. దీని స్ఫూర్తితోనే నల్గొండలోని జన-గణ-మన ఉత్సవ సమితి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలిసారిగా 2021 జనవరి 23న నగరంలో ఈ ప్రయోగం జరిగింది. జాతీయ గీతం ఆలపించే సమయంలో కమిటీలోని కార్యకర్తలందరూ తమ చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని నగరంలోని వివిధ ప్రాంతాలలో నిలబడి జాతీయ‌గీతలాప‌న చేస్తారు. ప్రస్తుతం న‌ల్లొండ టూటౌన్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని మొత్తం 12 కూడ‌ళ్ల‌లో నిత్యం జాతీయ‌గీలాప‌న జ‌రుగుతుంది.

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాల్లోని కొల‌నూర్ అనే చిన్న‌గ్రామంలో కూడా గ‌త నాలుగేళ్లుగా నిత్యం జ‌న‌గ‌ణ‌మ‌న ఆల‌పిస్తున్నారు. కొల‌నూర్ గ్రామ‌పంచాయితీ కార్యాల‌యంలో ప్ర‌తిరోజూ ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు స్థానికులు లౌడ్‌స్పీక‌ర్ల‌లో జాతీయ‌గీతాన్ని ప్లే చేస్తూ ఆల‌పిస్తుంటారు. ఈ కార్య్ర‌క‌మంలో గ్రామ‌స్థులే కాకుండా అటుగా వెళ్లే స్థానికులు కూడా పాల్గొంటారు.

స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఇవన్నీ ఎక్కడ చూసినా స‌ర్వ‌సాధార‌ణంగా క‌నిపిస్తాయి. కానీ, ప్రతిరోజూ ఇలా జాతీయ‌గీతాల‌ప‌న చేయ‌డం అనేది గర్వించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని సోషల్ మీడియాలో సైతం పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, మ‌రెందుకాల‌స్యం ఈ పంద్రాగ‌ష్టు పండుగ‌కు త‌ప్ప‌కుండా న‌ల్గొండ ప‌ట్ట‌ణాన్ని సంద‌ర్శించేయండి మ‌రి..

More News

    Read more about: nalgonda district telangana
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+