Search
  • Follow NativePlanet
Share
» »కాళరాత్రి ప్రతి రూపం ఈ అమ్మవారు

కాళరాత్రి ప్రతి రూపం ఈ అమ్మవారు

మహా ప్రత్యాంగిరి కాళికా దేవి ఆలయం గురించి కథనం

నవరాత్రి రోజుల్లో కాళరాత్రిని ఆరాధించడం సర్వసాధారణం. దీని వల్ల క్షుద్రదేవతల భయం ఉండదని చెబుతారు. అంతేకాకుండా ఏదైనా ఒక పనిలో విజయం కలగాలంటే ఈ దేవతను ఆరాధిస్తారని చెబుతారు. ఈ కాళరాత్రికి ప్రతిరూపమే ప్రత్యాంగరా దేవి. ప్రత్యాంగర దేవికి దేశంలో చాలా కొన్ని దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. అటువంటి కొన్ని దేవాలయాల్లో ఒకటి బెంగళూరుకు దగ్గర్లో ఉన్న హోసూరులోని ప్రత్యాంగరా దేవి దేవాలయం. ఈ నవరాత్రి సందర్భంగా కాళికా దేవి ప్రతి రూపమైన ఆ దేవత గురించిన పూర్తి వివరాలు మీ కోసం...

ప్రత్యాంగిరా దేవి ఆలయం

ప్రత్యాంగిరా దేవి ఆలయం

P.C: You Tube

హిరణ్యకసిపుడిని సంహరించిన తర్వాత ఉగ్రనరసింహుడిని శాంతపరిచినది చెంచులక్ష్మి అని చెబుతారు. దక్షిణాది ముఖ్యంగా తెలుగు కర్నాటక రాష్ట్రాల్లో ఇదే కథనం ప్రచారంలో ఉంది. అయితే శరభేశ్వరుడి రూపంలో ఉన్న పరమశివుడు ఉగ్రనరసింహుడిని శాంతపరిచాడని తమిళనాట చెప్పుకొంటారు.

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

P.C: You Tube

ఆయనకు కాళికాదేవి స్వరూపమైన ప్రత్యంగరా దేవి సహాయపడిందని చెబుతారు. రామాయణంలో ఈమె ప్రస్తావన ఉంది. రామ, రావణ యుద్ధంలో రావణాసురుడు ఇంద్రజిత్ తప్పితే తన కొడుకులనందరినీ పోగొట్టుకొంటాడు.

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

P.C: You Tube

ఇంద్రుణ్ని జయించిన ఇంద్రజిత్ యుద్ధ విద్యలో ఆరితేరిన వాడు. రామ రావణుల యుద్ధం సమయంలో ఇంద్రజిత్ రాముడిని జయించాలనే కోర్కెతో నికుంబళా యాగం చేయడానికి ప్రారంభించాడు. ఈవిడనే అధర్వణ కాళి అని కూడా అంటారు.

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

P.C: You Tube

అయితే ఈ ఆయాగాన్ని ఇంద్రజిత్తు పూర్తి చేయాలేక పోతాడు. అందువల్లే ఆ యుద్ధంలో అతను ఓడిపోయాడాని చెబుతారు. ఇలా పురాణ కాలంలో యుద్ధంలో విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యాంగర దేవిని పూజించేవారు.

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

P.C: You Tube

ఈ దేవత రూపం బహు విచిత్రంగా ఉంటుంది. నల్లని ఆకారంతో సింహం మొహంతో అమ్మవారు ఉంటారు. 18 చేతులతో 18 ఆయుధాలను కూడా కలిగి ఉంటారు. క్షుద్రపూజలకు విరుగుడుగా అమ్మవారిని పూజిస్తారు.

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

P.C: You Tube

అంతేకాకుండా బెంగళూరుకు దగ్గర్లో ఉన్న హోసూరులో కూడా ఈ ప్రత్యాంగిరా దేవికి ప్రత్యేక దేవాలయం ఉంది. ఇప్పుడిప్పుడే ఈ దేవాలయానికి ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. ఈ దేవాలయంలో కూడా నికుంబళా యాగం చేస్తారు.

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

P.C: You Tube

ఈ యాగంలో 96 రకాల వివిధ ద్రవ్యాలు, నవధాన్యాలు, పట్టుచీరె, నెయ్యి వంటి యాగ ద్రవ్యాలను యాగకుండంలో వేస్తారు. చివరకు పెద్ద ప్రమాణంలో ఎండు మిరపకాయలను వేస్తారు. అయితే ఎండు మిరపకాయల ఘాటు రాక పోవడం విశేషం.

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

P.C: You Tube

ఇక ఈ యాగం సమయంలో ప్రత్యంగరా దేవిని ఉత్తర దిక్కుగా ఉండేలా చూస్తారు. వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప, భైరవుడు, భరభేశ్వరుడు, శూలిని, వారాహి సుదర్శన చక్రం, మహాలక్ష్మీ మొదలైన దేవతలందరూ యాగ వేదిక చుట్టూ వేదాలను అనుసరించి వారి నిర్ణీత స్థానాల్లో ప్రతిష్టింపజేస్తారు.

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

P.C: You Tube

ఇక పురాతన కాలంనాటి ప్రత్యాంగిరా దేవి ఆలయం ఉన్న అయ్యవడి గ్రామం ప్రస్తావన మహాభారత కాలంలో కూడా ఉంది. పాండవుల అజ్జాత వాసం ప్రారంభ సమయంలో తమ ఆయుధాలను ఇక్కడ చెట్టు కింద ఉంచి ప్రత్యాంగర దేవిని పూజించినట్టు చెబుతారు.

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

ప్రత్యాంగిరా దేవి ఆలయం,

P.C: You Tube

మానసిక వికారంతో బాధపడుతున్నవారు, సమాజంలో తమ స్థానం కోల్పోయినవారు, రుణ విమోచనం, ఉద్యోగ, వివాహాది కార్యక్రమాల్లో తరుచుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, అమ్మవారిని దర్శించి యాగం జరిపిస్తే శుభం కలుగుతుందని చెబుతారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+