Search
  • Follow NativePlanet
Share
» »భార‌త్‌లో అత్యంత ధ‌నిక రైల్వేస్టేష‌న్‌గా న్యూఢిల్లీ.. రిచ్చెస్ట్ రైల్వేస్టేష‌న్ల జాబితా ఇదే..!

భార‌త్‌లో అత్యంత ధ‌నిక రైల్వేస్టేష‌న్‌గా న్యూఢిల్లీ.. రిచ్చెస్ట్ రైల్వేస్టేష‌న్ల జాబితా ఇదే..!

భారత‌దేశంలో రైలు మార్గాల‌కు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరుంది. ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ క‌లిగిన దేశంగా భార‌త్ రికార్డు సాధించింది. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌లో ఎక్కువ శాతం మంది రైల్వే ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే రైలు ప్ర‌యాణాలు అత్యంత చౌకైన‌వి మ‌రియు సౌక‌ర్య‌వంత‌మైన‌వి. ప్రతి సంవత్సరం రైల్వేస్టేషన్ల ఆదాయాన్ని రైల్వేశాఖ ప్రకటిస్తుంది. ఇక‌, ఈ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఎక్కువ ఆదాయం పొందిన 100 రైల్వే స్టేషన్లలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్​ మొద‌టి స్థానంలో నిలిచింది. ఇక‌, రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ లోని హౌరా స్టేషన్ ఉండ‌గా, చెన్నైలోని ఎంజీఆర్ సెంట్రల్ రైల్వేస్టేష‌న్ మూడో స్థానంలో ఉంది. ఇక నాలుగో స్థానంలో సికింద్రాబాద్​ స్టేషన్​ ఉందని రైల్వేశాఖ వివ‌రించింది.

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం భారతీయ రైల్వేకు రూ.3,337 కోట్ల ఆదాయం వస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. సంపాదన విషయంలో ఈ రైల్వే స్టేషన్ నంబర్ వన్ స్థానంలో ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక‌, క‌ల‌క‌త్తా హౌరా రైల్వే స్టేషన్ కు రూ.1,692 కోట్ల వార్షిక ఆదాయం వ‌చ్చింది. మూడోస్థానంలో నిలిచిన చెన్నై సెంట్రల్ రూ.1,299 కోట్ల ఆదాయం వ‌చ్చింది. నాలుగోస్థానంలో వ‌చ్చిన సికింద్రాబాద్​ స్టేషన్‌ రూ. 1,276 కోట్ల ఆదాయం సంపాదించింది. వీటితోపాటు మ‌రికొన్ని రైల్వేస్టేష‌న్ల జాబితాను కూడా ప్ర‌క‌టించారు. అందులో 500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తున్న రైల్వే స్లేషన్లు నాన్ సబర్బన్ గ్రూప్ 1 కేటగిరీ కింద చేర్చారు. ఈ జాబితాలో దేశంలోని 28 రైల్వే స్టేషన్లు స్థానం దక్కించుకున్నాయి. ఆ జాబితా ఏంటో ఓసారి చూసేద్దాం..

irctc railways

సంఖ్య ప‌రంగా చూస్తే...

అధికశాతం ప్రయాణికులు వ‌చ్చే రైల్వేస్టేష‌న్ల‌ను ప‌రిశీలిస్టే.. అందులో సంఖ్య పరంగా ముంబైలోని థానే రైల్వే స్టేషన్ మొద‌టిస్థానంలో నిలిచింది. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను 93.06 కోట్ల మంది ప్రయాణికులు ఈ రైల్వేస్టేషన్ గుండా ప్ర‌యాణం సాగించారు. రెండోస్థానంలో ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ నిలిచింది. ప్ర‌తి సంవ‌త్స‌రం ఈ రైల్వేస్టేష‌న్ నుండి సుమారు 83.79 కోట్ల మంది ప్రయాణం చేస్తున్న‌ట్లు అధికారుల జాబితాలో తెలిసింది.

న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్ నుంచి సుమారు 39.36 కోట్ల మంది ప్ర‌యాణిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకుంది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ త‌ర్వాత‌ ఎన్ఎస్‌జీ 1 హోదా విజయవాడ రైల్వేస్టేష‌న్‌కు మాత్ర‌మే ద‌క్కింది. ఇప్ప‌డు సాధించిన ఈ గుర్తింపుల‌తో కేంద్రం ఈ స్టేషన్లకు మరిన్ని నిధులు కేటాయించనున్న‌ట్లు స‌మాచాం. వీటితోపాటు ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు రైల్వే అధికారి పేర్కొన్నారు.

irctc railways1

2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రైల్వేశాఖ‌ ప్రకటించిన ఆదాయం వివరాలివే..

న్యూఢిల్లీ - రూ. 3,337 కోట్లు

హౌరా ( వెస్ట్​ బెంగాల్​) - రూ. 1,692 కోట్లు

చెన్నై సెంట్రల్​(తమిళనాడు) - రూ. 1,299కోట్లు

సికింద్రాబాద్( తెలంగాణ) - రూ. 1,276 కోట్లు

హజరత్​ నిజాముద్దీన్​( ఢిల్లీ) - రూ. 1,227 కోట్లు

లోకమాన్య తిలక్​ టెర్నినల్(ముంబై)​- రూ. 1,036 కోట్లు

అహ్మదాబాద్​ ( గుజరాత్​) - రూ. 1,010 కోట్లు

ముంబై సీఎస్​టీ (మహారాష్ట్ర) - రూ. 982 కోట్లు

irctc railways2

ప్రయాణికుల సంఖ్య ప‌రంగా ప‌రిశీలిస్తే..

న్యూఢిల్లీ - 39,362, 272 మంది

హౌరా ( వెస్ట్​ బెంగాల్​) - 61,329,319 మంది

చెన్నై సెంట్రల్​(తమిళనాడు) - 30,599,837 మంది

సికింద్రాబాద్( తెలంగాణ)- 27,776,937 మంది

హజరత్​ నిజాముద్దీన్​( ఢిల్లీ)- 14,537,686 మంది

లోకమాన్య తిలక్​ టెర్నినల్(ముంబై)​-14,680,379 మంది

అహ్మదాబాద్​ ( గుజరాత్​) - 18,260,021 మంది

ముంబై సీఎస్​టీ (మహారాష్ట్ర) - 51, 652,230 మంది

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+