Search
  • Follow NativePlanet
Share
» »తిరుప‌తి ప్రసాదమే కాదు.. దేశంలోని ఈ ఆల‌యాల‌ ప్ర‌సాదాలు కూడా అమృత‌మే..

తిరుప‌తి ప్రసాదమే కాదు.. దేశంలోని ఈ ఆల‌యాల‌ ప్ర‌సాదాలు కూడా అమృత‌మే..

భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన పుణ్య‌క్షేత్రాలు చాలానే ఉన్నాయి. అందుకే భారత్‌ను దేవభూమిగా కొనియాడ‌తారు. భారత్‌లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడానికి ప్రపంచం నులమూలల నుంచి ప‌ర్యాట‌కులు ఇక్క‌డికి వ‌స్తుంటారు. ఇక దేశంలో ప్రముఖ ఆలయాల్లో తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం అగ్ర‌స్థానంలో ఉంటుంది. వీటితోపాటు ప్ర‌సిద్ధిచెందిన ఆల‌యాలు మ‌రెన్నో ఉన్నాయి. అయితే, ప్రస్తుతం తిరుపతి బాలాజీ దేవాలయంలోని ప్ర‌సాదం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ప్ర‌సాదం ఇప్ప‌డు దేశ వ్యాప్తంగా ముఖ్యాంశాల్లో నిలిచింది. నిజానికి ఇక్కడ లడ్డూ ప్రసాదంపై కల్తీ జరుగుతోందని ఓ నివేదిక వచ్చింది.

దీంతో ప్ర‌స్తుతం ఈ వార్త దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఏపీలోని తిరుమ‌ల ఆలయం ఎప్పటి నుంచో ప్రసాదాలకు ప్రసిద్ధి చెందింది. కేవ‌లం తిరుమ‌ల ప్ర‌సాదం మాత్రమే కాదు, దేశంలోని అనేక ఇతర దేవాలయాలలో కూడా రుచికరమైన ప్రసాదం పంపిణీ చేయబడుతుంది. ఏపీలోని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆల‌యంతో పాటు ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం, కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం, అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం, కాణిపాకం సిద్ధి వినాయక ఆలయం, కేరళలోని గురువాయూర్, అయప్ప స్వామి ఆలయాలు, షిర్డీ సాయినాథుని ఆలయం ప్రపంచ వ్యాప్తంగా వాటి ప్ర‌సాదాల‌కు ఎంతో పేరుగాంచింది. వాటి పూర్తివివ‌రాలు ఇప్ప‌డు చూసేద్దాం..

పూరి జగన్నాథ దేవాలయం, ఒడిశా

ఒడిశాలోని పూరి జగన్నాథ దేవాలయం అనేక కారణాలతో ప్ర‌ఖ్యాతిగాంచింది. ఇక్క‌డ ల‌భించే ప్ర‌సాదం అందులో ఓ ముఖ్య‌మైన కార‌ణ‌మ‌ని చెప్పుకోవాలి. ఎందుకంటే, ఈ ఆల‌య ప్ర‌సాదంలో ఖిచ్డీ, పప్పులు, కూరగాయలు, స్వీట్లను చేరుస్తారు. ఇక్క‌డ‌ ప్రసాదం ఆలయ వంటగదిలో వండుతారు. ఈ ప్ర‌సాదాన్ని భ‌క్తులు ఎంతో పవిత్రమైనదిగా, రుచికరమైనదిగా భావిస్తారు. ఈ ఆలయంలో ప్రతిరోజు సుమారు 80 వేల మందికి అన్నం వండి పెడుతుంటారు.

guruvayurp1

శ్రీవైష్ణో దేవి ఆలయం, కత్రా, జమ్మూ

జమ్మూలోని అందమైన లోయలలో ఉన్న మాతా వైష్ణో దేవి ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచింది. ఇది హిందువుల కోసం ఒక ముఖ్యమైన తీర్థయాత్ర వంటిదికూడా. ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలనుకుంటున్నారు. ఈ ఆలయ ప్రసాదం కూడా భక్తులలో చాలా ప్ర‌ఖ్యాతి గాంచింది. ఇక్కడ లభించే ప్రసాదంలో పఫ్డ్ రైస్, వైట్ షుగర్ బాల్స్, చిరోంజి, సుఖ్ యాపిల్, కొబ్బరి మొదలైనవన్నీ ఉంటాయి. ఈ ఆలయంలో లభించే ప్రసాదాన్ని భ‌క్తులు మహాప్రసాదంగా స్వీకరిస్తారు.

గోల్డెన్ టెంపుల్, అమృత్సర్, పంజాబ్

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయం దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్ర‌ఖ్యాతిగాంచింది. ఇక్కడ లభించే లంగర్ ప్రసాదానికి దాని సొంత ప్ర‌త్యేక‌త ఉంది. అత్యంత సరళంగా తయారుచేసిన ఈ పోషకమైన ప్రసాదం తినేందుకు ఎంతో రుచిగా ఉంటుంది. ఇక్క‌డికి వ‌చ్చిన‌వారు ఈ ప్ర‌సాదాన్ని మ‌హాప్ర‌సాదంగా భావిస్తారు.

siddivinayaktemple1

సిద్ధివినాయక దేవాలయం, ముంబై, మహారాష్ట్ర

మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న ఈ గణేశ దేవాలయం హిందువుల ప్రధాన దేవాలయాలలో ఒకటి. దర్శనం కోసం ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ లభించే మోదక్ ప్రసాదం ఎంతో ప‌విత్ర‌త‌మైన‌ది, రుచిక‌ర‌మైన‌ది. ప్రజలు దీనిని ప్రసాదంగా సమర్పించి స్వయంగా తినడానికి కారణం ఇదే.

గురువాయూర్ ఆలయం, కేరళ

కేరళలో ఉన్న గురువాయూర్ దేవాలయం ప్రసాదం కూడా దేశంలో ప్ర‌సిద్ధిచెందింది. ఈ ఆల‌యంలో పాల పాయసాన్ని నైవేద్యంగా భావిస్తారు. ఈ ప్ర‌సాదం అన్నం, పాలు మరియు పంచదారతో చేసిన తీపి అన్నం. దీనిని స్వామికి సమర్పించిన తర్వాత భక్తులకు పంచుతారు.

షిర్డీ సాయిబాబా ఆలయం, మహారాష్ట్ర

మహారాష్ట్రలోని షిర్డీలో ఉన్న సాయిబాబా ఆలయం దేశ విదేశాల్లో ప్ర‌ఖ్యాతిగాంచ‌డంతోపాటు ఇక్క‌డ ప్ర‌సాదం కూడా ఎంతో ప్ర‌సిద్ధిచెందింది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు త‌ర‌లి వస్తుంటారు. ఇక్కడ ఊదీ ప్రసాదంగా భ‌క్తుల‌కు పంపిణీ చేయబడుతుంది. ఇది ఒక రకమైన పవిత్రమైన బూడిద. అలాగే, ఈ ఆలయంలో పప్పు, రోటీ, అన్నం, కూరగాయలు, స్వీట్‌లతో సహా ఉచిత ఆహారాన్ని కూడా భ‌క్తుల‌కు వడ్డిస్తారు.

తిరుప‌తి ఆల‌యం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

ఏపీలోని తిరుమల ఆలయంలో లడ్డూ ప్రసాదం ఎంతో ప్రసిద్ధి చెందింది. గత 308 సంవత్సరాలుగా ఈ ఆలయంలో లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఏటా ఆలయ నిర్వాహకులు లడ్డూ ప్రసాదాలను ఇక్క‌డ లక్షల్లో విక్రయిస్తుంటారు. ఈ లడ్డూని శ్రీవారి లడ్డూ అని కూడా పిలుస్తారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+