Search
  • Follow NativePlanet
Share
» »సొంత ఇంటిని తలపించే హోంస్టే : పుష్పాంజలి !!

సొంత ఇంటిని తలపించే హోంస్టే : పుష్పాంజలి !!

సెలవులు వస్తే మీరేం చేస్తారంటే ఠక్కున వచ్చే సమాధానం ఏదైనా విహార యాత్రకో లేదా పిక్నిక్ కో వెళతామని. ఒకవేళ ఎక్కువ రోజులు సెలవులు వస్తే ... ఏదైన సుదూర ప్రాంతానికి వెళ్ళటానికి ఇష్టపడతారు అంతే కదా ..!

ఈసారి సెలవులు గనక వస్తే కూర్గ్ వెళ్ళటానికి రెడీ అవ్వండి. సరే .. రెడీ అయ్యారు మరి అక్కడ ఉండటానికి ... ఏదైనా హోటళ్లు బుక్ చేసుకుంటారా లేదా రిసార్ట్ లను బుక్ చేసుకుంటారా ?? అయితే మీరు పప్పులో కాలేసినట్లే ..! ఇంకా పాత కాలపు అలవాట్లు పోలేదు మనకి. ఇప్పుడంతా యాత్రికులు హోంస్టే ల జపం చేస్తున్నారండి. సాధారణంగా హోటళ్లు/రిసార్ట్ లు మన ఇళ్ళ మాదిరి ఉండవు అయినా కూడా అవి రొటీనే..! కనుక చాలా మంది హోంస్టే ల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇది కూడా చదవండి : కొత్త జంటల విహార కేంద్రం ... కూర్గ్ !!

మరి కూర్గ్ లో అలాంటి హోంస్టే ఏదైనా ఉందా అంటే .. భేషుగ్గా ఉందనే చెప్పాలి. ఆ హోంస్టే పేరే పుష్పాంజలి. పేరుకు తగ్గట్టు ఉంటుంది ఈ హోంస్టే. మరి ఈ హోంస్టే ఎలా ఉంటుంది ?? రేట్లు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలిస్తే ..

పుష్పాంజలి ఎక్కడ ఉంది ??

పుష్పాంజలి ఎక్కడ ఉంది ??

పుష్పాంజలి హోంస్టే కూర్గ్ - మడికెరి ప్రాంతంలోని గల పర్వత ప్రాంతంలో కలదు. చుట్టూ అందమైన ప్రకృతితో ఈ హోంస్టే యాత్రికులను ఆకర్షిస్తున్నది. పుష్పాంజలి అంటే పువ్వుల ను ఇవ్వటం లేదా సమర్పించడం అని అర్థం.

చిత్ర కృప : ఓర్చ్రె మూన్ హాలిడేస్ కూర్గ్

కాలుష్యరహిత ప్రదేశంలో ..

కాలుష్యరహిత ప్రదేశంలో ..

పూర్తిగా కాలుష్యరహిత ప్రదేశంలో అందమైన తేయాకు తోటల పరిసరాల్లో నిర్మించిన ఈ హోంస్టే ఇటు వ్యాపారవేత్తలకి, అటు పర్యాటకులకి సమానంగా సౌకర్యాలను మరియు సదుపాయాలను అందిస్తున్నది. దీనిని 2 నక్షత్రాల హోటల్ గా పరిగణించవచ్చు.

చిత్ర కృప : ఓర్చ్రె మూన్ హాలిడేస్ కూర్గ్

ఇక్కడ గల సౌకార్యాలు

ఇక్కడ గల సౌకార్యాలు

అందమైన ఈ హోంస్టే లో గదులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటేమో సూట్ రూమ్, మరొకటేమో విశాలమైన గదులు. ఏసీ, నాన్ ఏసీ రూములు కూడా ఉన్నాయి. గదుల్లో పడక మంచాలు, కూర్చోవడానికి సోఫాలు, బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్ లు ఇంకా అనేక రకాల సదుపాయాలు ఉండి ఇంటిని తలపించే విధంగా ఉంటుంది.

చిత్ర కృప : ఓర్చ్రె మూన్ హాలిడేస్ కూర్గ్

ఇక్కడ గల సౌకార్యాలు

ఇక్కడ గల సౌకార్యాలు

కూర్చొని టీవీ చూడటానికి, కాసింత విశ్రాంతి పొందటానికి గదులు ఉన్నాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఇండోర్ గేమ్స్ లు కూడా ఉన్నాయి. పెద్దవారు ఇక్కడున్న విశాల మైదానంలో క్రీడలు ఆడవచ్చు.

చిత్ర కృప : ఓర్చ్రె మూన్ హాలిడేస్ కూర్గ్

ఇక్కడ గల సౌకార్యాలు

ఇక్కడ గల సౌకార్యాలు

ఇక్కడికి వచ్చే ఉమ్మడి కుటుంబం వారికీ ఏ మాత్రం తీసిపోకుండా సదుపాయాలు ఉన్నాయి. ఒకేసారి పదుల సంఖ్యలో కోర్చొని భోజనం చేసే విధంగా డైనింగ్ రూము లు సైతం ఉన్నాయి.

చిత్ర కృప : ఓర్చ్రె మూన్ హాలిడేస్ కూర్గ్

ఇక్కడ గల సౌకార్యాలు

ఇక్కడ గల సౌకార్యాలు

ఎంతసేపు లోపలేనా కాస్త బయటికి వచ్చి చూద్దాం ..! ఆరుబయట విషయానికి వస్తే ... విశాల మైదానాలు, పార్కులు, తోటలు కనిపిస్తాయి. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేసే వారికి, పిల్లలు ఆడుకోవడానికి ఈ ప్రదేశాలు అనువైనవి.

చిత్ర కృప : ఓర్చ్రె మూన్ హాలిడేస్ కూర్గ్

బడ్జెట్

బడ్జెట్

ఎవ్వరికీ తీసిపోని విధంగా అందరికీ అందుబాటు ధరల్లోనే ఇక్కడి రూములు లభిస్తాయి. పర్యాటకుల టెస్ట్ లకు తగినట్టు ఇక్కడి రూములు ఉన్నాయి. ఎవ్వరినైనా ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటుంది ఈ అందమైన హోంస్టే.

చిత్ర కృప : ఓర్చ్రె మూన్ హాలిడేస్ కూర్గ్

త్వరగా బుక్ చేసుకోండి

త్వరగా బుక్ చేసుకోండి

ఇక ఆలస్యం ఎందుకు త్వరగా పుష్పాంజలి హోంస్టే బుక్ చేసుకోండి. మీ ఇంటిల్లపాది ఆనందంతో ఇంట్లో ఉన్నట్టే కూర్గ్ పర్యటనలో మునిగితేలండి.

చిత్ర కృప : ఓర్చ్రె మూన్ హాలిడేస్ కూర్గ్

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+