Search
  • Follow NativePlanet
Share
» »మంగళసూత్రం కానుకగా ఇస్తే పెళ్లి అయినట్టే

మంగళసూత్రం కానుకగా ఇస్తే పెళ్లి అయినట్టే

పడగలింగస్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

వివాహమన్నది జీవితంలో ప్రధానఘట్టం. అయితే చాలామందికి వివిధ రకాల కారణాల వల్ల ఈ వివాహ సమయం కలిసిరావడం లేదు. పెళ్లిచూపులు, లేదా పెళ్లి సమయంలో ఏదో ఒక అడ్డంకి రావడంతో వారి వివాహం వాయిదాపడుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో ఆ వధూవరుల తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఇలా వివాహానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించే దేవాలయం తమిళనాడులో బాగా ప్రాచూర్యం చెందింది. ఆ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

P.C: You Tube

పడగలింగస్వామీ దేవాలయం తమిళనాడులోని తిరునెల్వీలోని మలయంకులంలో ఉంది. ఈ దేవాలయంలో రెండు శివలింగాలు ఉన్నాయి. వాటిని మహాలింగం, పడగలింగం అని పిలుస్తారు. ఇవి రూపంలో చిన్నగా ఉంటాయి.

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

P.C: You Tube

అదే విధంగా ఇక్కడ ఉన్న నంది విగ్రహం కూడా చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఇక్కడ తమిళ నెల అవని ఓణం లో జరిగే ఉత్సవానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ దేవాలయాన్ని బుధ, శనివారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకూ తెరిచి ఉంచుతారు.

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

P.C: You Tube

అదేవిధంగా మిగిలిన రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే తెరిచి ఉంటారు. మిగిలిన సమయల్లో ఈ దేవాలయాన్ని సందర్శించాలనుకొనేవారు ఫోన్ ద్వారా అర్చకులను పిలిపించుకోవాల్సి ఉంటుంది.

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

P.C: You Tube

ఇక ఆలయ గర్భగుడి ముందు ఏనుగు, గుర్రం ప్రతిమలు చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఇక్కడ శివుడిని పడగలింగస్వామి అని పిలిస్తే గణేషుడిని పడగపిల్లయార్ అని పిలుస్తారు. ఈ దేవాలయంలో బుధ, శనివారాల్లో విశేష పూజలు జరుగుతాయి.

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

P.C: You Tube

ముఖ్యంగా ఎవరికైతే తమ ఇంటిదేవుడు ఎవరన్న విషయం పై సరైన సమాచారం ఉండదో అలాంటివారు ఈ దేవాలయానికి వచ్చి దైవ దర్శనం చేసుకొంటూ ఉంటారు. ఇక్కడ సగిలి భూతనాథ్, తలై మదన్, తలవై మదతి, వాన పెచ్చి, అమ్మన్, బ్రహ్మ, గంగాదేవి, విధు మదన్, తక్కరాజన్, సుధాలిమదన్, చిన్నతంబి మొదలైన దేవతా మూర్తుల విగ్రహాలను కూడా మనం చూడొచ్చు.

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

P.C: You Tube

ముఖ్యంగా వివాహం కాని వారు లేదా వివాహ సంబంధ విషయాల్లో సమస్యలు ఎదుర్కొనేవారు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. వారు పొంగలిని నైవేద్యంగా పెట్టి మంగళసూత్రాన్ని కానుకగా సమర్పిస్తుంటారు. దీని వల్ల వారి సమస్యలు త్వరగా తీరిపోయి వివాహం త్వరగా అవుతుందని నమ్ముతారు.

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

P.C: You Tube

స్థానిక కథనం ప్రకారం ఒకప్పుడు ఏడు మంది అన్నదమ్ములకు ఒక సోదరి ఉండేది. ఆమె ఇతర కులస్తుడిని వివాహం చేసుకోవాలని భావిస్తుంది. అయితే సోదరులు ఇందుకు ఒప్పుకోరు. దీంతో ఆమె కోపంతో వారికి శాపం పెట్టడం వల్ల వారు శిలలుగా మారిపోతారు.

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

P.C: You Tube

ఈ శిలలను మనం ఇప్పటికీ చూడవచ్చు. ఇక ఇక్కడి ఉన్న రెండు శివలింగాలకు సంబంధించిన కథనం కూడా ప్రచారంలో ఉంది. దాని ప్రకారం పూర్వం స్థానిక రాజు, భార్యతో పాటు ఒకసారి ఈ ప్రాంతానికి వనవిహారానికి వస్తాడు.

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

పడగలింగస్వామీ దేవాలయం, తమిళనాడు

P.C: You Tube

ఆ సమయంలో రాణికి, రాజుకు దప్పిక వేస్తుంది. దగ్గర్లో ఉన్న ఒక తటాకం వద్దకు నీరు తాగడానికి వెలుతారు. అప్పుడు ఒక మర్రిచెట్టు తొర్రలో రెండు శివలింగాలు కనబడుతాయి. అంతేకాకుండా అశరీరవాణి నుంచి సందేశం కూడా వస్తుంది. దీంతో రాజు, రాణి అక్కడ దేవాలయాన్ని నిర్మించి ఆ శివలింగాల సేవలోనే ప్రాణాలు వదులుతారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+