Search
  • Follow NativePlanet
Share
» »గాంధీధాం - గాంధీజీ కనుగొన్న ప్రదేశం !

గాంధీధాం - గాంధీజీ కనుగొన్న ప్రదేశం !

By Mohammad

అది 1947 వ సంవత్సరం ... భారత ఉపఖండం రెండుగా చీలిన తర్వాత (భారతదేశం, పాకిస్థాన్) పాకిస్థాన్ శరణార్ధుల కోసం పునరావాసం కల్పించటానికి గాంధీజీ సరిహద్దు భూభాగానికి సమీపాన ఉన్న ఒక పెద్ద ప్రదేశాన్ని గమనించాడు. ఆ ప్రదేశం మహారావు శ్రీ విజయ్ రాయ్ జీ ఖెన్ ఘర్ జీ జడేజాది. గాంధీజీ వేడుకోలు మేరకు మహారావు 15, 000 ఎకరాల సువిశాల భూమిని విరాళంగా ఇచ్చాడు. వారు ఎక్కడి నుంచి వచ్చారో, వారి మాతృభూమిని తలపించేటట్టు ఈ ప్రదేశాన్ని తీర్చిదిద్దారు. అలా ఈ పట్టణం ఏర్పడింది. గాంధీజీ ప్రేరణతో ఈ పట్టణం ఏర్పడింది కనుక దీనికి 'గాంధీధాం' అని పేరుపెట్టారు.

కాండ్ల ఓడరేవు

కాండ్ల ఓడరేవు

చిత్ర కృప : Mukund

కాండ్ల ఓడరేవు

గాంధీధాం లో అతిపెద్ద ఆకర్షణ కాండ్ల సముద్రపు ఓడరేవు. గాంధీధాం లో అతిపెద్ద ఆకర్షణ కాండ్ల సముద్రపు ఓడరేవు. ఈ పోర్ట్ గాంధీధాం నుండి 12 కిలోమీటర్ల దూరంలో కలదు. భారతదేశ పశ్చిమ తీరంలో ఉన్న అతిపెద్ద నౌకాశ్రయాలలో ఇది ఒకటి. దేశ, విదేశీ వర్తక, వాణిజ్య సంబంధిత కార్యకలాపాలు ఇక్కడ నిత్యం జరుగుతుంటాయి. పోర్ట్ యొక్క అధికారుల అనుమతితో కాండ్ల సందర్శించవచ్చు.

భద్రేశ్వర్ దేవాలయాలు

భద్రేశ్వర్ దేవాలయాలు

చిత్ర కృప : Nizil Shah

భద్రేశ్వర్ దేవాలయాలు

గాంధీధాం నుండి భద్రేశ్వర్ 33 కిలోమీటర్ల దూరములో కలదు. భద్రేశ్వర్ లో ఉన్న ఈ ఆలయాలు భారత దేశంలో ఉన్న జైనుల ఆలయాలలో అతిపురాతనమైన ఆలయాలు మరియు కొన్ని యోగాల క్రితం జైన్ సన్యాసి దేవచంద్ర ఈ దేవాలయ పునాది రాయి వేశారు. ఇది జైనుల యొక్క ముఖ్యమైన ప్రార్థనా స్థలం. భద్రేశ్వర్ గర్భ గుడి చుట్టూ 53 జైనాలయాలు ఉన్నాయి.

పూర్నేశ్వర్ ఆలయం

పూర్నేశ్వర్ ఆలయం

చిత్ర కృప : RameshSharma1

పూర్నేశ్వర్ ఆలయం

ఇది గాంధీధాం సమీపంలో ఉన్నది మరియు ఇది 9 మరియు 10 వ శతాబ్దంలో కట్టబడింది. ఈ ఆలయం దేవుడైన శివునికి అంకితం చేయబడింది మరియు ఈ ఆలయం అందమైన కట్టడానికి మరియు నిర్మాణ కళకు ప్రసిద్ధి చెందింది.

ముంద్రా

ముంద్రా ఓడరేవు కు 60 కిలోమీటర్ల దూరములో కలదు. ఇదొక ప్రవేట్ ఓడరేవు. కచ్ జిల్లాలో దక్షిణ తీరంలో ఉన్నది. ఈ ఓడరేవు ఒకప్పుడు ఉప్పు మరియు కారం వ్యాపారానికి ప్రసిద్ధిచెందినప్పటికీ, ప్రస్తుతం టై - డై మరియు బ్లాక్ ప్రింట్ వస్తువులకు ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది.

బుఖారి పీర్ దర్గా

బుఖారి పీర్ దర్గా

చిత్ర కృప : Nizil Shah

ముంద్రా లో చూడవలసిన ఆకర్షణలు : ముంద్రా ఫోర్ట్, బుఖారి పీర్ దర్గా, శాంతినాధ్ మహాదేవ్ ఆలయం లు ప్రధానంగా చూడదగ్గవి.

గాంధీధాం ఎలా చేరుకోవాలి ?

రోడ్ మార్గం ద్వారా: గాంధీధాం రోడ్ మార్గం ద్వారా NH 8A గుండా ముఖ్యమైన ప్రదేశాలయిన ఢిల్లీ మరియు ముంబై లకు జత చేయబడింది.

రైల్ మార్గం ద్వారా: గాంధీధాం రైల్ మార్గం ద్వారా గుజరాత్ లోని పెద్ద నగరాలకు గాంధీధాం రైల్వే స్టేషన్ గుండా జత చేయబడింది.

విమాన మార్గం ద్వారా: ప్రతి రోజు ముంబై నుండి నగరం కేంద్రం నుండి 6 కి. మీ. దూరంలో ఉన్న కాండ్ల విమానాశ్రయానికి విమానం ఉన్నది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+