Search
  • Follow NativePlanet
Share

భుజ్ - ఫ్లమింగో (రాజహంసల) విశ్రాంతి ప్రదేశం!

70

భుజ్ గొప్ప చారిత్రాత్మక నేపథ్యం మరియు కచ్ జిల్లాకు ప్రధానకార్యాలయంగా ఉన్న ఒక నగరం.ఈ నగరం నకు తూర్పు వైపున ఉన్న భుజియా దుంగార్ అనే కొండ మీద భుజంగ్ అనే గొప్ప సర్ప దేవాలయం ఉండుటవల్ల ఈ నగరం నకు భుజ్ అనే పేరు వచ్చింది.

చరిత్ర

చరిత్ర పూర్వ రోజుల నుండి ప్రారంభిస్తే భారతదేశ చరిత్రలో భుజ్ కు బలమైన సంబంధాలు ఉన్నాయి. జడేజా రాజపుత్ర, గుజరాత్ సుల్తానేట్ మరియు బ్రిటిష్ పాలన, సింధు లోయ నాగరికత మరియు అలెగ్జాండర్ ది గ్రేట్ పరిపాలన అన్ని దశలలో భుజ్ చరిత్ర కనపడుతుంది. 18 వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం యొక్క క్షీణత కారణంగా తలెత్తిన రాజకీయ పరిస్థితి నుండి కచ్ రక్షించడానికి రావు గోడిజి భుజ్ కోటను నిర్మించెను. ఈ కోట 11 మీ. లు ఎత్తు ఉండి, నగరం చుట్టూ గోడలకు 51 తుపాకులను కలిగి ఉంది.

చారిత్రక ప్రాముఖ్యత కలిగిన స్థలాలు

భుజ్ లో సందర్శించడానికి పలు చారిత్రక స్థలాలు ఉన్నాయి. శరద్ బాగ్ ప్యాలెస్ 1991 వరకు కచ్ ఆఖరి రాజు అయిన మదన్ సింగ్ నివాసంగా ఉండేది. 1991 లో మదన్ సింగ్ చనిపోయారు. లఖ్పత్జి రాజు పాలనా కాలంలో రంసిన్ మాలం అనే చేతివృత్తుల నిపుణులచే ఐనా మహల్ లేదా అద్దాల హాల్ ను నిర్మించారు. ప్రగ్మల్జి పాలనా కాలంలో ఇటాలియన్ గోతిక్ శైలిలో ప్రాగ్ మహల్ లో బెల్ టవర్ ను రూపొందించారు. రామకుండ్ స్తేప్వేల్ రామాయణం మరియు రాయల్ ఖాళీ సమాధి లేదా ఛతర్దిస్కు చెందిన పాత్రల యొక్క అనేక శిల్పాలు ఉన్నాయి. అంతే కాకుండా కచ్ మ్యూజియం మరియు హమిర్సర్ లేక్ తో పాటుగా 2000 సంవత్సరాల క్షత్రాప శాసనాలు కూడా ఉన్నాయి. పైన పేర్కొన్న అన్ని స్మారక కట్టడాలు ఉన్నాయి. ఇక్కడ స్వామి నారాయణ్ గుడిలో చాలావరకు లార్డ్ కృష్ణ మరియు రాధా కథలు సూచిస్తూ, భవనం చుట్టూ ముదురు రంగు వుడ్ కార్వింగ్స్ ఉన్నాయి.

మతం

భుజ్ లో స్వామినారాయణ్ ఆలయం మొట్టమొదటి మరియు ప్రధాన ఆలయం. ఇది సంప్రదాయమునకు చాలా ప్రసిద్ధి చెందింది. భుజ్ లో ప్రధానమైన మతాలు వైష్ణవ హిందూ మతం, జైనమతం మరియు ఇస్లాం మతం. లఖ్పత్ లో సిక్కుల గురుద్వారా ఉన్నది. శ్రీ గురు నానక్ కచ్ ను సందర్శించినప్పుడు ఈ గురుద్వారా లో బస చేసారు.

సహజ పర్యావరణ వ్యవస్థ

ఖావ్డా భుజ్ సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ సహజ ఉద్యానవనం. ఖావ్డ భుజ్ నుండి ఉత్తర దిశలో 72 కిలోమీటర్ల దూరంలో ఉన్నది, మరియు ప్రపంచంలో అతిపెద్ద రాజహంస కాలనీ నిష్క్రమణ పాయింట్ గా ప్రసిద్ది చెందింది. ప్రతి సంవత్సరం వలస సమయంలో లక్షల రాజహంసలు ప్రయాణం మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ ఎడారిలో జమ్కున్దలియ అనే ఒక సరస్సు ఉంది. పర్యాటకులు ఒంటె ద్వారా రాజహంస కాలనీని చేరుకోవచ్చు, మరియు సందర్శించడానికి శీతాకాలంలో అక్టోబర్ నెల నుండి మార్చి వరకు ఉత్తమ సమయం.

భుజ్ కి 80 కిమీ దూరంలో ఉత్తర వెస్ట్ సమీపంలో చహరి ధన్ద్ అనే మరొక పర్యావరణ పర్యాటక కేంద్రంగా ఉంది.'చహరి' అనే పదమునకు అర్దము 'ఉప్పు ప్రభావితమైంది' మరియు 'ధన్ద్' అనే పదమునకు అర్దము 'గాధ తడి భూములు' గా చెప్పవచ్చు. ఇక్కడి ప్రదేశము ఉప్పగా,చిత్తడినేలగా ఉంటుంది. ఇక్కడ పర్యాటకులు ప్రత్యేకంగా వివిధ రకాల 370 పక్షుల జాతులు,రాపోర్త్స్ ,వాటర్ ఫ్లై, వాడెర్లు మరియు భరతపక్షులను చూసి అనందిచవచ్చు.

కచ్ అతి ఎత్తయిన ప్రదేశం ఖావ్డా కు 25 కిమీ దూరంలో ఉత్తరంగా బ్లాక్ హిల్స్, ఉంది. ఇక్కడ మొత్తం ఉత్తర హోరిజోన్ గ్రేట్ రాన్, ఎడారి మరియు ఆకాశం ఎక్కువ కాలం వేరు చేయడం సాధ్యం కాదు ఎందుకంటే లోనికి అదృశ్యమవుతుంది. ఈ ప్రదేశం పాకిస్తాన్ సరిహద్దుకు అతి దగ్గరలో ఉంటుంది.బ్లాక్ హిల్స్ ఎగువన ఒక సైనిక పోస్ట్ ఉంది. అక్కడకు వెళ్ళటానికి సైనిక సిబ్బందికి మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ కొండ పై దత్తాత్రేయ అంటే ఒక శరీరంలో లార్డ్ బ్రహ్మ, విష్ణు మరియు శివ మూడు తలల అవతారం 400 సంవత్సరాల పూర్వపు దేవాలయం ఉంది.

ఇతర పర్యాటక ఆకర్షణలు భుజ్ లో హస్తకళ వర్క్ అయిన కుట్చీ ఎంబ్రాయిడరీ బాగా ప్రసిద్ధి చెందింది.

భుజ్ పూర్వ చరిత్ర అనుబంధాలతో శతాబ్ద కాలంలో అభివృద్ధి చెందిన ప్రదేశము. ఈ ప్రదేశములో అనుభవాలను విస్తృతమైన శ్రేణిలో అందించటానికి ఖచ్చితంగా ఒక అనుకూలమైన పర్యాటక స్థానం.

భుజ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

భుజ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం భుజ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? భుజ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం రాష్ట్ర రవాణా మరియు ప్రైవేటు సంస్థలు రెండింటి నుండి బస్సులు సులభంగా మరియు సౌకర్యవంతంగా చేరుకోవచ్చు .ప్రైవేట్ స్లీపర్ బస్సులో ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది. అయితే ఎక్కువగా అహ్మదాబాద్ నుండి భుజ్ కు నడపబడుతున్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం భుజ్ ఎక్స్ ప్రెస్ మరియు కచ్ ఎక్స్ప్రెస్ భుజ్ మరియు అహ్మదాబాద్ కు మధ్య రోజువారీ నడపబడుతున్న రెండు రైళ్లు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం భుజ్ విమానాలు భుజ్ నుండి ముంబై కి మద్య రోజువారీ నడపబడుతున్నాయి. భుజ్ లో విమానాశ్రయం ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat