Search
  • Follow NativePlanet
Share
» »గొండాల్ లో తప్పక చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !!

గొండాల్ లో తప్పక చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !!

By Mohammad

కారు ... ఒక రవాణా సాధనం. అప్పట్లో అంతగా ప్రాచూర్యంలో లేకపోయినా ప్రస్తుత సమాజానికి కారు ఉంటే అదో పెద్ద స్టేటస్. స్వతంత్ర్యం రాక ముందు కార్లు అతి కొద్ది మంది దగ్గర మాత్రమే ఉండేవి. ఉన్న వారిని అబ్బో ఎంత పెద్ద సౌకారో అనే వాళ్ళు. ఇప్పుడా లోన్లు తీయటం ... కారు కోనేయటం.

నేను చిన్నగున్నప్పుడు అంబాసిడర్ కారు చూసే వాడిని. ఆది మావూరి ప్రెసిడెంట్(సర్పంచు) కారు. మా ఉర్లో ఆ ప్రెసిడెంట్, ఎం ఎల్ ఏ వద్ద అంబాసిడర్ కారు ఉండేది. ఈ ఇద్దరి వద్ద తప్ప ఊరి మొత్తం మీద వేరెవరి వద్ద కార్లు ఉండేవి కావు. మరి ఇప్పుడు ప్రతి ఇంటి ముందర కార్లు పెట్టుకొని లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారు.

మన భారత దేశంలో ఒక రాజుకి కార్లంటే అమితమైన ప్రేమ. అప్పట్లో కంటికి కనిపించిన కొత్త రకం కార్లన్నీ తన భవనం లో ఉండాల్సిందే. వీటికోసం ఆ రాజు ఒక భవనాన్నే నిర్మించాడంటే ఆశ్చర్యం కలిగించక మానదు. ఇంతకు ఆ రాజు ఎవరు ? ఎక్కడ ఉంది ఆ భవనం ??

గుజరాత్ రాష్ట్రంలో గొండాల్ అనే పట్టణం ఉంది. స్వతంత్ర్యం రాక ముందు గొండాల్ రాజుల ఆధీనంలో ఉండేది. క్రీ.శ. 1643 వ సంవత్సరం లో గొండాల్ పట్టణాన్ని తకోరే శ్రీ కుమ్భోజిల్, మెరమంజి లు స్థాపించారు. తరువాత సర్ భగవత్ సిన్ఘ్జి కాలంలో గొండాల్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈయన గారి రాచ కుటుంబం వింటేజ్ కార్ల మీద ఇష్టాన్ని, ఆసక్తిని కనబరుస్తుండేది. ఆ కార్ల సేకరణే నేడు ఆ ప్రాంతానికి గుర్తింపుతో పాటు, పర్యాటక ఆకర్షణ ను తెచ్చిపెట్టింది. మరి గొండాల్ లో తప్పక చూడవలసిన పర్యాటక ప్రదేశాలు ఒకసారి గమనిస్తే ...

ఇది కూడా చదవండి : గుజరాత్ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు !

అక్షర్ మందిర్, గొండాల్

అక్షర్ మందిర్, గొండాల్

అక్షర్ మందిర్ గొండాల్ లో ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం. ఈ ఆలయం స్వామి గునతితనంద్ కి అంకితం ఇవ్వబడింది. ఈయన భగవాన్ స్వామి నారాయణ్ యొక్క ప్రధమ వారసుడు. అక్షర్ దేరి, స్వామి వారి సమాధులు లోపల ఉన్నాయి. ఇక్కడ పూజలు చేయటానికి ప్రతి సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

చిత్ర కృప : Frans Devriese

నవలోఖ ప్యాలెస్, గొండాల్

నవలోఖ ప్యాలెస్, గొండాల్

క్రీ.శ. 17 వ శతాబ్ధంలో గొండాల్ లో నిర్మితమైన పురాతన ప్యాలెస్ ఈ నవలోఖ ప్యాలెస్. చేయి తిరిగిన కళాకారులతో నిర్మించిన కట్టడాలను చూస్తే నిజంగా వారి పనితానాన్ని మెచ్చుకోక తప్పదు. వెలుపల బాల్కానీ, తోటలు, అందమైన పచ్చటి గడ్డి మైదానాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఈ ప్యాలెస్ ను కట్టడానికి అప్పట్లో 9 లక్షలు ఖర్చయ్యింది.

చిత్ర కృప : Bernard Gagnon

రివర్సైడ్ ప్యాలెస్, గొండాల్

రివర్సైడ్ ప్యాలెస్, గొండాల్

క్రీ.శ. 1875 వ సంవత్సరంలో రివర్ సైడ్ ప్యాలెస్ ను స్థాపించారు. దీనిని భగవత్ సిన్హ్ జి రాజు, తన కుమారుడు యువరాజ్ భోజ్రాజి కోసం నిర్మించారు. అద్భుతమైన సీటింగ్ అమరికతో చుట్టూ ఒక అందమైన తోట తో ఉన్న ప్యాలెస్ ఇప్పుడు ఒక డీలక్స్ వారసత్వ హోటల్ గా మార్చబడింది.

చిత్ర కృప : rkm vakkalagadda

దాసి జీవన్ మందిర్, గొండాల్

దాసి జీవన్ మందిర్, గొండాల్

దాసి జీవన్ మందిర్ ఘోఘవదర్ లో ఉన్నది. గొండాల్ కి 6 కి.మీ. ల దూరంలో ఉన్న పవిత్రమైన ప్రదేశం సాధువు దాసి జీవన్ యొక్క జన్మస్థలం. ప్రతి సంవత్సరం జరిగే దాసి జీవన్ పుట్టినరోజు వార్షికోత్సవాన్ని జరుపుకోవటానికి గుజరాతీ న్యూ ఇయర్స్ డే రోజున ప్రజలు ఇక్కడికి వస్తారు.

చిత్ర కృప : chiragkpatel

రాయల్ గ్యారేజీలు, గొండాల్

రాయల్ గ్యారేజీలు, గొండాల్

రాయల్ గ్యారేజీ లో రాయల్స్ వింటేజ్ కార్ల మనోహరమైన సేకరణ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. గొండాల్ పాలకుల ఉత్సాహాన్ని నేడు రివర్సైడ్ ప్యాలెస్ ప్రాంగణంలో ప్రదర్శించబడుతుంది. ఈ పూర్తి మ్యూజియం ఫలితంగా అప్పట్లో వాడిన కార్ల ను చూస్ భాగ్యం లభించింది.

చిత్ర కృప : rkm vakkalagadda

గొండాల్ కు ఎలా చేరుకోవాలి ?

గొండాల్ కు ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

గొండాల్ కు సమీపంలో రాజ్‌కోట్ విమానాశ్రయం కలదు. ఈ విమానాశ్రయం నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు. ఈ విమానాశ్రయం నుండి గొండాల్ కి క్యాబ్ ద్వారా చేరుకోవచ్చు.

రైలు మార్గం

గొండాల్ కు రాజ్‌కోట్ - జతల్సార్ మధ్య రైలు స్టేషన్ కలదు. రాజ్‌కోట్ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైలు సదుపాయం ఉన్నది.

రోడ్డు మార్గం

గొండాల్ కు సమీప పట్టణాల నుండి గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి. ఇవే కాక ప్రైవేట్ వాహనాలు, బస్సులు సైతం తిరుగుతుంటాయి.

చిత్ర కృప : sachindholakiya

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+