Search
  • Follow NativePlanet
Share
» »కొల్లాం : జీడిపప్పుల నగరానికి ప్రయాణం !

కొల్లాం : జీడిపప్పుల నగరానికి ప్రయాణం !

By Mohammad

వ్యాపారానికి, సంస్కృతికి పేరెన్నిక గలది కొల్లాం. ప్రాచీన కాలం నుండి ఈ ప్రాంతం ప్రపంచంలోని వివిధ దేశాలతో వాణిజ్య సంబంధాల చురుకుగా కొనసాగిస్తూ వస్తున్నది. అది ఇప్పటికీ కొనసాగుతున్నది. అంతర్గతంగా భారతదేశంలో కూడా వివిధ ప్రాంతాలతో వ్యాపారంలో భాగస్వామ్యం పంచుకుంటున్నది.

కొల్లాం కేరళ రాష్ట్రంలోని ప్రముఖ తీర ప్రాంతం మరియు జిల్లా కూడా. ఇక్కడ జీడిపప్పు ను అధికంగా పండిస్తారు, ఎగుమతీ చేస్తారు. అందుకే స్థానికులు కొల్లాం బదులు 'జీడిపప్పు నగరం' అని పిలుస్తారు. నార పరిశ్రమ కూడా ఈ జిల్లాలో బాగా ప్రాచూర్యంలో ఉన్నది. కొల్లాం ప్రముఖ బీచ్ పట్టణమైన వర్కాల నుండి 23 కి. మీ. దూరంలో, తిరువనంతపురం నుండి 60 కి. మీ. దూరంలో కలదు.

ఇది కూడా చదవండి : వర్కాల - ఒక ప్రసిద్ధ బీచ్ పట్టణం !

బీచ్ లు, పార్కులు, ద్వీపాలు, సరస్సులు, ఆలయాలు మరియు చారిత్రక సంబంధిత కట్టడాలు, మత కేంద్రాలు కొల్లాం ఆకర్షణ లు గా నిలిచాయి. రుచికరమైన సముద్ర ఆహారాలు యాత్రికులను ఆకట్టుకుంటాయి. భిన్నమైన పర్యాటక అనుభవం కోరుకోనే వారికి కొల్లాం చక్కటి ఎంపిక. ఇక్కడున్న కొన్ని సందర్శనీయ ప్రదేశాలు గమనిస్తే ..!

అష్టముడి సరస్సు

అష్టముడి సరస్సు

కొల్లాం ను సందర్శించే ప్రతి పర్యాటకుడు తప్పకుండా అష్టముడి సరస్సు ను చూడవలసిందే ..! సరస్సులోని విహారం, ఊగిసలాడే కొబ్బరి చెట్ల మధ్య, ఏపైన తాటి చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ఉంటుంది.

చిత్ర కృప : Vishnu R

హౌస్ బోట్ ప్రయాణం

హౌస్ బోట్ ప్రయాణం

అష్టముడి సరస్సులో పడవ ప్రయాణం బహుశా ఏ పర్యాటకుడు వదులుకోడు. పర్యాటకుడు తన బడ్జెట్ బట్టి, అనుకూలత ను బట్టి హౌస్ బోట్ ల ను ఎంపిక చేసుకోవచ్చు. హౌస్ బోట్ పడక గదులు, కిచెన్, బాల్కని వంటి వసతులు కలిగి ఉంటుంది.

చిత్ర కృప : Martin Thomas

తేవల్లి ప్యాలెస్

తేవల్లి ప్యాలెస్

కొల్లాం పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేవల్లి ప్యాలెస్ ఒక వారసత్వ భవనం అని చెప్పవచ్చు. దీని నిర్మాణం బ్రిటీష్, పోర్చుగీస్, డచ్ నిర్మాణ శైలిని పోలి ఉండి యాత్రికులను ఆకట్టుకుంటున్నది. అష్టముడి సరస్సు నుండి హౌస్ బోట్ పడవల్లో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.

చిత్ర కృప : Arunvrparavur

మన్రో ద్వీపం

మన్రో ద్వీపం

కొల్లాం పట్టణానికి 27 కి. మీ. దూరంలో ఉన్న మన్రో ద్వీపం 8 చిన్న చిన్న ద్వీపాల సమూహం. ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. బర్డ్ వాచింగ్, చేపలు పట్టడం వంటివి ఇక్కడ చేయవచ్చు. ద్వీపంలో ఆలయాలు, చర్చిలకు పడవల్లో ఎక్కి చూసి రావచ్చు.

చిత్ర కృప : Ben Beiske

సస్తంకొట్ట సరస్సు

సస్తంకొట్ట సరస్సు

కొల్లాంకి 25 కి. మి. దూరం లో ఉన్న సస్తంకొట్ట సరస్సు దృశ్య పరమైన సౌందర్యం వల్లా ... పడవ ప్రయాణ సౌకర్యాల వల్లా పర్యాటకులని ఆకర్షిస్తోంది. దీనికాపేరు సరస్సు ఒడ్డున ఉన్న "సాస్థ" దేవుడి గుడి నుండి వచ్చింది. సరస్సు చుట్టూ ఉన్న అద్భుతమైన కొండల వల్ల ఈ ప్రాంతం మరింత అందంగా చూపరులను కనువిందు చేస్తున్నది.

చిత్ర కృప : Roshen Alex Jacob

కొల్లాం బీచ్

కొల్లాం బీచ్

కొల్లాం కు 2 కిమీ. దూరం ఉన్న ఈ బీచ్ కు మరోపేరు మహాత్మా గాంధీ బీచ్. ఈ బీచ్ లో ఇసుక తీరాలు తప్పక చూడాలి. సందర్శకులు సాయంత్రంవేళ ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా, నిర్మలంగా ఉండే బీచ్ పరిసరాల్లో తిరుగుతూ పునరుత్తేజం పొందుతారు. బీచ్ ఒడ్డున బడ్జెట్ లోపే హోటళ్లు, రిశార్ట్ లు లభించవచ్చు ..!

చిత్ర కృప : Pradeep S

తిరుముల్లవరం బీచ్

తిరుముల్లవరం బీచ్

కొల్లాం కు 6 కి. మీ. దూరంలో ఉన్న తిరుముల్లపురం బీచ్ లో సముద్రపు అలల శబ్ధం తప్పనిచ్చి వేరే ఏ ఇతర శబ్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. బీచ్ లో నీళ్ళు అంత లోతు లేని కారణంగా స్విమ్మింగ్ చేయటానికి, కుటుంబ విహార యాత్రలకి అనువైనది గా చెప్పుకోవచ్చు. బీచ్ సమీపంలో విష్ణువు గుడి చూడదగ్గది.

చిత్ర కృప : Roshan Rajendran

తంగస్సేరి బీచ్

తంగస్సేరి బీచ్

కొల్లాం కి 5 కి.మీ. దూరం లో ఇన్న తంగస్సేరి బీచ్ సేదతీరడానికి, రిలాక్స్ అవటానికి సరైన స్పాట్. 144 అడుగుల ఎత్తు గల పాత లైట్ హౌస్ ఈ బీచ్ యొక్క ప్రధాన ఆకర్షణ. ఈ లైట్ హౌస్ లోకి మధ్యాహ్నం 3 : 30 నుండి సాయంత్రం 5 : 30 వరకు సందర్శకులని అనుమతిస్తారు. బీచ్ సమీపంలో పోర్చుగీసు కోట శిథిలాలు, అనేక చర్చీలు ఉన్నాయి.

చిత్ర కృప : ruben alexander

అడ్వేంచర్ పార్క్

అడ్వేంచర్ పార్క్

కొల్లాం పట్టణానికి 3 కి. మీ. దూరంలో, అష్టముడి సరస్సుకు ఒడ్డున ఉన్న అడ్వేంచర్ పార్క్ పిల్లలకే కాదు, పెద్దలకు కూడా వివిధ రకాల క్రీడలను అందిస్తుంది. వివిధ రకాల బోట్ లు అద్దెకు తీసుకొని 48 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న ఈ పార్క్ లో తిరుగుతూ ఆనందించవచ్చు. పెయింటింగ్ లతో కూడిన మ్యూజియం కూడా చూడవచ్చు.

చిత్ర కృప : Arunvrparavur

అచెంకాయిల్

అచెంకాయిల్

దట్టమైన అడవులు, గుడులు, జలపాతాలు ఉండే ప్రదేశం కొ ల్లాం కు 60 కి. మీ. దూరంలో కలదు. ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయం ప్రధాన ఆకర్షణ. పండగ లు, ఉత్సవాల సమయాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆలయానికి దగ్గరిలోని కుభవురుట్టి జలపాతం, మనలార్ జలపాతం రెండూ సందర్శకులను కనువిందు చేస్తాయి.

చిత్ర కృప : brijin

ఓచిర

ఓచిర

ఓచిర, కొల్లాం కు 55 కి. మీ. దూరంలో ఉన్న ఒక మత పరమైన స్థలం. ఎన్నో ప్రాచీన గుళ్ళు, చారిత్రక స్థూపాలు ఇక్కడ ఉన్నాయి. ఓచిర గుడి లేదా పరబ్రహ్మ గుడి ని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు.

చిత్ర కృప : Lois Bridenback

రామేశ్వర గుడి

రామేశ్వర గుడి

కొల్లాం నగరానికి 10 కి.మి. దూరం లో ఉన్న రామేశ్వర గుడి అద్భుతమైన నిర్మాణం, మంత్రముగ్ధుల్ని చేసే శిల్పాలతో వందలాది మంది సందర్శకుల్ని ఆకర్షిస్తోంది. ఆలయ ముఖ్య ఆకర్షణ పౌరాణిక రాక్షసుడు వ్యాల యొక్క పెద్ద పెద్ద శిల్పాలు. ఈ పెద్ద పెద్ద శిల్పాలు గుడికి ఒక ప్రాచీనత్వాన్ని ఇస్తున్నాయి.

చిత్ర కృప : CK

కురునాగప్పల్లి

కురునాగప్పల్లి

కొల్లాం కి 25 కి.మి. దూరం లో ఉన్న చిన్న పట్టణం కురునాగప్పల్లి. ఇక్కడి ప్రధాన మతకేంద్రమైన పదనయర్కులంగర గుడి లో శివుణ్ణి, కృష్ణుణ్ణి ఇద్దరినీ కొలుస్తారు. దగ్గర్లో పోర్చుగీస్ పల్లీ గా పేర్గన్న ప్రాచీన పండరతురుత్ చర్చి ని వీలుంటే సందర్శించండి.

చిత్ర కృప : മലയാളം

అమృతపురి

అమృతపురి

కొల్లాం కు 30 కి. మీ. దూరంలో ఉన్న వల్లికావు ప్రాంతంలో ఏర్పడ్డ ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం అమృతపురి. మాతా అమృతానందమయి జన్మస్థానమైన ఈ ప్రాంతంలో ఆశ్రమాలు, విద్యాసంస్థలు, రీసర్చ్ కేంద్రాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. కొల్లాం నుండి పడవల్లో అమృతపురి చేరుకోవచ్చు.

చిత్ర కృప : Saranjith S

మయ్యనాడ్

మయ్యనాడ్

మయ్యనాడ్ గ్రామం కొ ల్లాం కు 10 కి. మీ. దూరంలో ఉన్నది. సుబ్రమణ్య స్వామి గుడి ఇక్కడి ప్రధాన మత కేంద్రం గా ఉన్నది. అరేబియా సముద్రంలో చేపలు పట్టే తీరు పర్యాటకులను వావ్ అనిపిస్తుంది.

చిత్ర కృప : Chichu Sagar V

పండగలు, ఉత్సవాలు

పండగలు, ఉత్సవాలు

ఏటా లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించే కొ ల్లాం లో హస్త కళా ఉత్సవాలు, పడవ రేసులు, ఏనుగు ఉత్సవాలు, అష్టమి రోహిణి, ఓనం లు జరుపుకుంటారు. కంచె పోరాటం, ఎద్దుల పోటీలు, పారిప్పల్లి గజమేళా లు సైతం ఆకర్షణీయంగా నిలిచాయి.

చిత్ర కృప : Arun S Pillai

సముద్రపు రుచులు

సముద్రపు రుచులు

కొల్లాం సముద్ర తీర ప్రాంతం. ఇక సీ ఫుడ్ లకు కొదువేం ఉంటుంది .. ! చేపలు, రొయ్యలు, పీతలు ఇలా వివిధ రకాల సముద్ర ఆహారాలతో, కేరళ స్థానిక రుచులతో ఇక్కడి వంటకాలు గొప్పగా ఉంటాయి.

చిత్ర కృప : Self Drive Trips

కొల్లాం ఎలా చేరుకోవాలి ?

కొల్లాం ఎలా చేరుకోవాలి ?

కొల్లాం చేరుకోవటానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు సులభంగా లభిస్తాయి.

వాయు మార్గం

కొల్లాం కు 70 కి. మీ. దూరంలో తిరువనంతపురం విమానాశ్రయం కలదు. ఇక్కడికి దేశ, విదేశాల నుండి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ట్యాక్సీ, క్యాబ్ ల ద్వారా కొ ల్లాం చేరుకోవచ్చు.

రైలు మార్గం

కొల్లాం రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో కలుపబడి ఉన్నది. చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, కొచ్చిన్, కన్యాకుమారి తదితర నగరాల నుండి రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం

కొల్లాం గుండా 3 జాతీయ రహదారులు వెళుతాయి. చెన్నై, తిరువనంతపురం, కొచ్చిన్, కన్యాకుమారి, కోయంబత్తూర్, పాండిచ్చేరి, కొట్టాయం, ఎర్నాకులం నుండి బస్సులు నిత్యం నడుస్తుంటాయి.

చిత్ర కృప : PlaneMad

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+