Search
  • Follow NativePlanet
Share
» »చారిత్రాత్మకమైన న‌గ‌రమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!

చారిత్రాత్మకమైన న‌గ‌రమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!

మధ్యప్రదేశ్ రాష్ట్రం గొప్ప సంస్కృతి సంప్ర‌దాయాల‌ను క‌లిగి ఉంది. ఎక్కువ‌మంది పర్యాట‌కులు సంద‌ర్శించే గ‌మ్య‌స్థానం ఇదే. 'హార్ట్ ఆఫ్ ఇండియా' అనే మారుపేరుతో ఉన్న ఈ రాష్ట్రం అనేక చారిత్రక కట్టడాలను కలిగి ఉంది. ఇక్క‌డ అనేక సహజ సౌంద‌ర్య ప్ర‌దేశాలు కూడా క‌ల‌వు. అంతేకాదు, ఇక్క‌డ పురాతన దేవాలయాలు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలు సంద‌ర్శ‌కులకు స్వాగ‌తం ప‌లుకుతాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్‌లో కూడా ప‌ర్యాట‌కులు సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి.

గ్వాలియ‌ర్ ఒక చారిత్రాత్మకమైన న‌గ‌రం. ఇది 1857 తిరుగుబాటులో పాల్గొనడానికి ప్రసిద్ధి చెందింది. ఇక్క‌డి అనేక చారిత్రక కట్టడాలు మరియు ఆధునిక భవనాలు పర్యాటకులను ఎంత‌గానో ఆకర్షిస్తాయి. గ్వాలియర్ కళ, చరిత్ర మరియు సంస్కృతికి పేరుగాంచింది. ఇక్క‌డ సంద‌ర్శించేందుకు ఎన్నో అనువైన ప్ర‌దేశాలు ఉన్నాయి. అందులో గ్వాలియర్ ఫోర్ట్, టాన్సెన్స్ సమాధి, మాన్సింగ్ ప్యాలెస్, గోపాచల్ పర్వత్, టైగర్ డ్యామ్, జై విలాస్ ప్యాలెస్, సన్ టెంపుల్, సాస్ బాహు టెంపుల్స్, మాధవ్ నేషనల్ పార్క్ మరియు సింధియా మ్యూజియం. ఇందులో ముఖ్య‌మైన ప్ర‌దేశాల గురించి ఓసారి తెలుసుకుందాం ప‌దండి.

surajkund

సూరజ్ కుండ్

సూరజ్ కుండ్ గ్వాలియర్ కోటకు సమీపంలో ఉంటుంది. ఇది ఒక అందమైన కొలనుగా (Suraj Kund) ప్రసిద్ధి చెందింది. సూరజ్ సేన్ మహారాజు తన కుష్టు వ్యాధిని నయం చేసుకోవడానికి ఈ నీటిని తాగ‌డానికి స్థానికులు చెబుతుంటారు. సూరజ్ సేన్ రాజు పేరు మీదుగా ఈ కొలనుకు సూరజ్ కుండ్ అనే పేరు వచ్చింది. ఈ కొలను అందమైన ప్రకృతి అందాలతో పర్యాటకులను ఎంత‌గానో ఆకట్టుకుంటుంది.

శివపురి

శివపురి మధ్యప్రదేశ్‌లోని ఉత్తమ ప్రదేశాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ ప్రాంతాన్ని భారతీయులు మాత్రమే కాకుండా విదేశీ పర్యాటకులు కూడా సందర్శిస్తుంటారు. గ్వాలియర్‌కు స‌మీపంలోనే ఈ ప్ర‌దేశం ఉంది. ఈ ప్ర‌దేశం ప్రకృతి ప్రేమికులకు స్వర్గం కంటే తక్కువేమీ కాదు.

madhavnationalpark1

మాధవ్ నేషనల్ పార్క్

మాధవ్ నేషనల్ పార్క్ గ్వాలియర్‌లో సందర్శించడానికి గొప్ప ప్రదేశమ‌నే చెప్పుకోవాలి. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉద్యానవనంగా పేరుగాంచింది. ఈ ప్ర‌దేశాన్ని మొఘల్ చక్రవర్తులు మరియు మహారాజుల వేటాడే ప్రదేశంగా చెబుతుంటారు. ఈ పార్క్ మధ్యప్రదేశ్‌లోని పురాతన పార్కులలో ఒకటి. ఇక్కడ చెట్లు మరియు అనేక మొక్కలను కూడా చూడవచ్చు. ప‌ర్యాట‌కులు ఇక్కడ జీప్ సఫారీ కూడా చేయవచ్చు.

ఝాన్సీ

ఝాన్సీ ఒక చారిత్ర‌క ప్ర‌దేశం. ఇది గ్వాలియర్ నగరం చుట్టూ ఉంటుంది. ఝాన్సీ రాణి నివసించిన ప్రదేశంగా ఈ ప్ర‌దేశానికి ఝాన్సీ అనే పేరు వ‌చ్చింది. ఇక్క‌డ ప‌ర్యాట‌కులు ఝాన్సీ కోట, రాణి మహల్, ఝాన్సీ మ్యూజియం, రాజా గంగాధర్ రావు యొక్క ఛత్రి వంటి ప్రదేశాలను వీక్షించ‌వ‌చ్చు.

jaivilasmahal1

జై విలాస్ మహల్

గ్వాలియ‌ర్‌లోని మ‌రో ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశం జై విలాస్ మ‌హ‌ల్‌. సింధియా వంశస్థుల నివాసంగా జై విలాస్ మహల్ (Jai Vilas Mahal) ఉండేది. ఈ మహల్ ను 1809లో జియాజి రావు సిందియా నిర్మించారు. ఈ భవనం అద్భుతమైన శిల్పకళను కలిగి ఉంటుంది. ఇది పర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ మహల్ సందర్శన సింధియా వంశస్థుల నాగరికతను తెలియజేస్తుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+