Search
  • Follow NativePlanet
Share
» »గిర్ నేషనల్ పార్క్ - ఆసియా సింహాల ఏకైక అభయారణ్యం !

గిర్ నేషనల్ పార్క్ - ఆసియా సింహాల ఏకైక అభయారణ్యం !

By Mohammad

ప్రపంచంలో సింహాలు ఆఫ్రికాలో తప్ప మరెక్కడా కనపడవు అనుకొనేవారికి గిర్ నేషనల్ పార్క్ ఒక చక్కటి సమాధానం. ఇదెక్కడో ఉందనుకొంటె పొరబడినట్లే ..! మన దేశంలోనే గుజరాత్ రాష్ట్రంలోని జూనాఘడ్ పట్టణానికి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ పార్క్ సింహాల అభయారణ్యం. ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేనటివంటి ఆసియా సింహాలకు గిర్ పార్క్ స్థావరంగా ఉన్నది.

ఇది కూడా చదవండి : జూనాఘడ్ - అరుదైన సంస్కృతి !

గిర్ అభయారణ్యం విస్తీర్ణం 1412 చ. కి. మీ. దానికి తోడు మరో 1153 చ. కి. మీ. స్యాంక్చురీ కూడా ఉన్నది. 1920 వ సంవత్సరంలో 20 సింహాలు ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం 400 పై చిలుకు సింహాలు ఉన్నాయి. జింకలు, చిరుతలు, సరీశృుపాలు, పక్షి జాతులు మరియు అనేక జంతు జాతులు గిర్ నేషనల్ పార్క్ లో సందడి చేస్తుంటాయి.

ఆసియా సింహాలు

ఆసియా సింహాలు

ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఆసియా సింహాలు గిర్ నేషనల్ పార్క్ లో సంచరిస్తుంటాయి. ఒకప్పుడు కేవలం వేళ్ళ మీద లెక్క పెట్టె విధంగా ఆసియా సింహాలు కనిపించేవి. ప్రస్తుతం వందల సంఖ్యలో ఆసియా సింహాలు సంరక్షించబడుతున్నాయి.

చిత్ర కృప : Tarak shah

మితియాల వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

మితియాల వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

గిర్ నేషనల్ పార్క్ అనుకోని సమీపాన మరో వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ ఉన్నది. అదే మితియాల వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ. ఈ స్యాంక్చురీ లో కనుమరుగవుతున్న మచ్చల జింకలు, నీలగి వంటివి రక్షించబడుతున్నాయి.

చిత్ర కృప : Tarak shah

మితియాల వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

మితియాల వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

అడవి జంతువులు, అడవి ప్రకృతి మీద ఆసక్తి ఉన్న వారు మితియాల వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ ని సందర్శించవచ్చు. సింహాలు, చిరుతలు ఎటువైపు నుండి వస్తాయో, ఎప్పుడు వస్తాయో చెప్పలేని విధంగా ఉత్తేజకరమైన రీతిలో ఉంటుంది. సాహసికులకు ఈ అడవిలో పర్యటన ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

చిత్ర కృప : Jagadip Singh

గిర్ నేషనల్ పార్క్ లో ఇతర జంతువులు

గిర్ నేషనల్ పార్క్ లో ఇతర జంతువులు

గిర్ నేషనల్ పార్క్ కేవలం ఆసియా సింహాలకు మాత్రమే పుట్టినిల్లు కాదు ఇక్కడ అనేక జంతువులకు ఆవాసంగా ఉన్నది. సరీశృుపాలు, చిరుతలు, ఎలుగు బంట్లు, జింకలు, ముంగీస, అడవి కుందేళ్ళు ఇలా ఎన్నో జాతులకు చెందిన జంతువులు ఉన్నాయి.

చిత్ర కృప : Nehal Shaikh

పనియా వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

పనియా వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

పనియా వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ గిర్ నేషనల్ పార్క్ కు అనుసంధానం(ఎక్స్‌టెన్షన్). నేషనల్ పార్క్ నుండి వచ్చే సింహాలు, చిరుత లను ఈ స్యాంక్చురీ లో గమనించవచ్చు.

చిత్ర కృప : Adyksa Consultants

గిర్ అభయారణ్యంలో గల వన్య సంపద

గిర్ అభయారణ్యంలో గల వన్య సంపద

ఆసియా సింహాలు : 400 పైచిలుకు
జింకలు : 32 వేలు
చిరుతలు : 300 కి పైగా
సరీశృుపాలు : 40 కి పైగా
పక్షి జాతులు : 250 కి పైగా

వీటితో పాటు నక్షత్ర తాబేళ్ళు, కొండచిలువ, అడవి నక్కలు, ఖడ్గ మృగాలు, దున్నలు, గద్దలు మొదలైన వన్య జంతువులు కూడా ఉన్నాయి.

చిత్ర కృప : Ambarish deshmukh

గిర్ నేషనల్ పార్క్ ఎలా చేరుకోవాలి ?

గిర్ నేషనల్ పార్క్ ఎలా చేరుకోవాలి ?

గిర్ నేషనల్ పార్క్ చేరుకోవటానికి రోడ్డు, రైలు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి

విమాన మార్గం

గిర్ నేషనల్ పార్క్ సమీపాన ఉన్న విమానాశ్రయం కేశోడ్ లో కలదు. ఇది 90 కిలోమీటర్ల దూరంలో కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ లను అద్దెకు తీసుకొని గిర్ నేషనల్ పార్క్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

గిర్ నేషనల్ పార్క్ సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ జూనాఘడ్ లో కలదు. ఈ రైల్వే స్టేషన్ 65 కిలోమీటర్ల దూరంలో కలదు. ప్రభుత్వ/ ప్రవేట్ బస్సుల్లో ప్రయాణించి గిర్ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

నేషనల్ పార్క్ కు సమీప సిటీ జునాగడ్. ఇది ఇక్కడ నుండి 65 కి. మీ.ల దూరం లో వుంటుంది. జునాగడ్ నుండి పార్క్ కు తరచుగా బస్సులు కలవు. అలాగే అహ్మదాబాద్, రాజ్‌కోట్ నుండి కూడా బస్సులు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : mradimasinh

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+