Search
  • Follow NativePlanet
Share
» »దంతా - ఆశ్చర్యాల మిశ్రమం !!

దంతా - ఆశ్చర్యాల మిశ్రమం !!

దంతా ఒకప్పుడు అగ్నిపుత్రుల రాజవంశ రాజుల యొక్క రాచరిక రాష్ట్రం. గుజరాత్ రాష్ట్రానికి ఉత్తరంవైపు, కాస్త అటూఇటూ రాజస్థాన్ కు దగ్గరగా ఉంటుంది ఈ ప్రాంతం. దంతా పరిసరాలలో సందర్శించటానికి అనేక ప్రదేశాలు కలవు.

By Mohammad

దంతా ఒకప్పుడు అగ్నిపుత్రుల రాజవంశ రాజుల యొక్క రాచరిక రాష్ట్రం. గుజరాత్ రాష్ట్రానికి ఉత్తరంవైపు, కాస్త అటూఇటూ రాజస్థాన్ కు దగ్గరగా ఉంటుంది ఈ ప్రాంతం. భారత స్వాతంత్య్రం అనంతరం, ఈ ప్రాంతం గుజరాత్ రాష్ట్రంలో విలీనమైపోయింది. ఇప్పటికీ ఇక్కడ రాజపుత్రులు నివసిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో !! వారి చేతుల మీదుగానే నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు.

దంతా అహ్మదాబాద్ కు 160 కి.మీ ల దూరంలో కలదు. ఇది బనస్కంట జిల్లాలో ప్రసిద్ధిచెందిన పట్టణం. దంతా పరిసరాలలో సందర్శించటానికి అనేక ప్రదేశాలు కలవు. వాటిలో అంబాజీ గుడి, రాణీ కి వావ్, జైన దేవాలయాలు, స్మారకాలు మరియు ఇతర మందిరాలు ముఖ్యమైనవి.

మోదేరా సూర్యదేవాలయం

మోదేరా సూర్యదేవాలయం

చిత్రకృప : Uday Parmar

బలరాం అంబాజీ అభయారణ్యం

బలరాం అంబాజీ అభయారణ్యం దంతా లో మరో ముఖ్యమైన ప్రదేశం. నీలం ఎద్దులు, అడవి కోళ్ళు, అడవి పందులు, గుంట నక్కలు, అడవి పిల్లులు, దుమ్ములగొండి, చిరుత, ఎలుగు బంట్లు, జింకలు వంటివి, పక్షులు, సరీసృపాలు మొదలుగునవి ఈ అభయారణ్యంలో చూడవచ్చు.

మోదేరా సూర్యదేవాలయం

సోలంకీ పాలకుడైన భీమసేన - 1 మొధేరా సూర్యదేవాలయాన్ని నిర్మించాడు. ఇది భారత దేవాలయ నిర్మాణ అందాన్ని ప్రతిబింబించే అత్యద్భుతమైన కట్టడం. దీనికి సుమారు 900 సంవత్సరాల చరిత్ర ఉన్నది. మెహ్సనా నుండి దేవాలయం 20 -30 కిలోమీటల దూరంలో ఉన్నది. భీమసేన - 1 భార్య ఉదయమతీ దేవి రానికి వావ్ ను నిర్మించింది.

వాద్నగర్ వద్ద స్మారకాలు

వాద్నగర్ వద్ద స్మారకాలు

చిత్రకృప : telugu native planet

వాద్నగర్ వద్ద స్మారకాలు

వాద్నగర్ మరో ఆసక్తికరమైన స్థలం. ఇక్కడ ప్రాచీన బౌద్ధ విహారాలు, వస్తువులు ఇటీవలి తవ్వకాలలో కనుగొన్నారు. ఇవి క్రీ.శ 2 - క్రీ.శ. 7 వ శతాబ్దం మధ్య కాలానికి చెందినవిగా గుర్తించారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఈ మతంలో రెండు పురావస్తు స్థూపాలు, చుట్టూ తొమ్మిది గదులతో ఉన్న బహిరంగ మండువా ఉన్నాయి.

చూడవలసినవి : శర్మిష్ఠ సరస్సు, హఠకేశ్వర మహాదేవ్ ఆలయం, జైన దేవాలయం, తానా రీరి తోట, గౌరీ కుండ్, నాగ్ టెంపుల్ మొదలైనవి.

తరంగ మరియు కుంభారియా జైన దేవాలయాలు

తరంగ మరియు కుంభారియా జైన దేవాలయాలు

చిత్రకృప : gunarat tourism

తరంగ మరియు కుంభారియా జైన దేవాలయాలు

పాలరాతి తో ఎంతో కళాత్మకంగా నిర్మించిన ఈ జైన దేవాలయాలలో వర్ధమాన, పార్శ్వనాథ, నేమినాథ్, సంభవ్ నాథ్, శాంతి నాథ్ అనే ఐదుగురు జైన తీర్థాంకులు ఉన్నారు. వీటిని భీమసేన - 1 మంత్రి విమల్ షా నిర్మించాడు. దేవుళ్ళు, దేవతలు, దేవదూతలు, గుర్రపు రౌతులు మరియు సంగీతకారుల విస్తృతమైన కళాత్మక చెక్కడాలు ఇక్కడ చూడవచ్చు. దేవాలయాలు రొజూ ఉదయం 6.30 మరియు సాయంత్రం 7.30 మధ్య తెరిచి ఉంటాయి.

పోషినా

అంబాజీ నుండి 29 కి. మీ ల దూరంలో ఉన్న పోషినా ఒక ఆదర్శవంతమైన ప్రదేశం. ఈ రాజభవనం పురాతన మరియు ఆధునిక సంప్రదాయాల మిశ్రమం. ఇక్కడ సంప్రదాయ వంటలు సైతం అందుబాటులో ఉన్నాయి. 'చిత్ర - విచిత్ర' మేళా ఈ గ్రామము యొక్క ప్రత్యేకత.

కోటేశ్వర దేవాలయం

కోటేశ్వర దేవాలయం

చిత్రకృప : KartikMistry

మెహ్సానా

ఇక్కడ చూడవలసినవి : మొట్టమొదటి జల ఉద్యానవనం, ముల్ నాయక్ ఆలయం, హింగ్ లాజ్ మాతా ఆలయం, నారాయణ్ గుడి, తాల్ వన్య ప్రాణుల అభయారణ్యం, మల్టిప్లెక్స్ లు, వైడ్ యాంగిల్ థియేటర్, ఉక్కు మరియు ఇనుము మార్కెట్లు. ధరోయ్ గ్రామంలో సబర్మతి నది మీద నిర్మించిన ఆనకట్ట కూడా సందర్శించదగినదే !!

దంతా ఎలా చేరుకోవాలి ?

అహ్మదాబాద్ నుండి దంతా చేరుకోవటానికి నేరుగా ప్రభుత్వ బస్సులు కలవు. పాలన్పూర్ దంతా కు సమీప రైల్వే స్టేషన్ మరియు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్ సమీప విమానాశ్రయం.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+