Search
  • Follow NativePlanet
Share
» »‘బంగారు మైదానం’ చూశారా?

‘బంగారు మైదానం’ చూశారా?

జమ్ము కాశ్మీర్ లోని అందమైన లోయ ప్రాంతం సోనామార్గ్ కు సంబంధించిన కథనం.

By Gayatri Devupalli

సోనామార్గ్, జమ్మూ మరియు కాశ్మీర్ లో ఆల్పైన్ వృక్షాలతో నిండి ఉన్న ఒక పచ్చని లోయ. సోనామార్గ్ అంటే 'బంగారు మైదానం' అని అర్ధం. ఇది పువ్వుల పరచుకుని ఉన్న పచ్చిక భూములు, మంచుతో కప్పబడిన శిఖరాలు, హిమానీనదాలు మరియు సహజమైన సరస్సులతో కూడిన ప్రకృతి అందాలతో పర్యాటకులను మంత్రముగ్ధులను చెస్తుంది. సమీపంలో ఉన్న ఫిర్, పైన్ మరియు సిల్వర్ బిర్చ్ వంటి వృక్షజాలం మరియు దట్టమైన అడవులతో నిండి ఉన్న లోయల నడుమ, కొండలను ఒరుసుకుని పారే ఇండస్ లేదా సింధూ నదిని చూడటానికి రెండు కళ్ళు చాలవు.

ఎక్కడ ఉంది.

ఎక్కడ ఉంది.

P.C: You Tube

గంభీరమైన హిమాలయ పర్వత సానువులలో 2800 మీటర్ల ఎత్తు ఉన్న, ఈ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం శ్రీనగర్ నుండి 90 కి.మీ.ల దూరంలో ఉంది. ఉన్న లడఖ్ కు సింహద్వారం మరియు ఎత్తైన పర్వత మార్గాల్లో ఒకటైన జోజి-లా పాస్, సోనామార్గ్ కు తూర్పున, 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అనువైన సమయం

అనువైన సమయం

P.C: You Tube

డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే శీతాకాలంలో సోనామార్గ్ లో భారీగా హిమపాతం కురుస్తుంది కనుక దుర్భేద్యంగా ఉంటుంది. వసంతరుతువుతో, మంచు ద్రవీభవనము మొదలయ్యి, ఏప్రిల్ లో వేసవి మొదలయ్యే సమయానికి, రహదారులు కనిపించడం మొదలుపెడతాయి. ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య కాలం, సోనామార్గ్ సందర్శించడానికి అనువైన సమయం. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

సోనామార్గ్ చేరుకునే మార్గం:

సోనామార్గ్ చేరుకునే మార్గం:

P.C: You Tube

సోనామార్గ్ నుండి శ్రీనగర్ విమానాశ్రయం, 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గరి రైల్వే స్టేషన్ జమ్మూ తావి (జమ్మూ)లో ఉంది. ఇక్కడి నుండి శ్రీనగర్ చేరుకోవడానికి, NH1 రహదారి మార్గం ద్వారా ప్రయాణించాలి.

10 నుంచి 12 గంటల ప్రయాణం

10 నుంచి 12 గంటల ప్రయాణం

P.C: You Tube

దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కాశ్మీర్ లోయను కలిపే ప్రసిద్ధ జవహర్ టన్నెల్ను దాటుతూ, ఈ మార్గంలో ప్రయాణించి, శ్రీనగర్ చేరుకోవడానికి దాదాపుగా 10-12 గంటలు పడుతుంది. శ్రీనగర్ చేరుకున్నాక క్యాబ్ ద్వారా, సోనామార్గ్ చేరుకోవచ్చు.

నీలాగ్రద్

నీలాగ్రద్

P.C: You Tube

సోనామార్గ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలాగ్రద్, పర్వత నది, సింధునదిని కలిసే సంగమ స్థలంలో ఉన్న ఒక సుందర మైదానం. ఎర్రని రంగులో ఉండే నీలాగ్రద్ నది, వ్యాధి నివారణ శక్తులకు చాలా ప్రసిద్ధి చెందింది. పలువురు ఈ నదిలో మునకలేస్తూ ఉండటాన్ని మీరు చూడవచ్చు. ఇది కూడా ఒక ప్రముఖ వారాంత పిక్నిక్ స్పాట్.

ఖీర్ భవానీ ఆలయం:

ఖీర్ భవానీ ఆలయం:

P.C: You Tube

బూడిదరంగు రాతితో నిర్మింపబడిన, ఈ చిన్న అందమైన ఆలయం, ఖీర్ భవాని దేవతకి అంకితం చేయబడింది. ఈ ఆలయం రంగులు మారే సహజ నీటిచెలమపై నిర్మించబడింది. స్థానికుల నమ్మకం ప్రకారం, ఏదైనా ఊహించని వైపరీత్యం సంభవించబోయే ముందు హెచ్చరికగా నీరు నలుపు రంగులోకి మారుతుందని అంటారు.

కృష్ణసర్ సరస్సు:

కృష్ణసర్ సరస్సు:

P.C: You Tube

అందమైన మంచు పర్వతాలు మరియు దట్టమైన అడవుల చుట్టూ పరచుకున్న ఈ సరస్సు, సోనామార్గ్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరస్సు శీతాకాలంలో ఘనీభవిస్తుంది. 3800 మీటర్ల ఎత్తులో ఉండే ఈ సుందర సరస్సు, గోధుమ రంగు ట్రౌట్ చేపలకు నెలవు. ఇది ఫిషింగ్ చేసే ఔత్సాహికులకు స్వర్గం వంటిది.

బాల్తాల్

బాల్తాల్

P.C: You Tube

సోనామార్గ్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోజి-లా పాదాల వద్ద బాల్తాల్ ఉంది. ప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర సమయంలో యాత్రికులకు, ఈ మైదాన ప్రదేశం వద్దనే బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడి సువిశాల గడ్డి భూములు, సుదూర మంచు పర్వతాలు చూపరుల కళ్ళ ముందు అద్భుతాలను ఆవిష్కరిస్తాయి. బాల్తాల్, శాంతిని అన్వేషిస్తూ పోయే వారికి స్వర్గం.

విషంసార్ సరస్సు:

విషంసార్ సరస్సు:

P.C: You Tube

సోనామార్గ్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో మరొక ఎత్తైన విషంసార్ సరస్సు ఉన్నది. దీనికి 'విష్ణు సరస్సు', అని అర్ధం. 3710 మీటర్ల ఎత్తులో ఉండే ఈ సరస్సు, శీతాకాలంలో ఘనీభవిస్తుంది. అనేక హిమానీనదాల వల్ల జీవం పోసుకున్న ఈ సరస్సుకు, చుట్టూ పరచుకుని ఉన్న పూవులతో కూడిన పచ్చిక భూములు మరీంత అందాన్ని చేకూరుస్తాయి.

గంగాబల్ సరస్సు:

గంగాబల్ సరస్సు:

P.C: You Tube

హర్ముఖ్ పర్వత పాద ప్రాంతంలో ఉన్న గంగాబల్ సరస్సుకు, కాశ్మీరి పండిట్లలో మతపరమైన ప్రాముఖ్యత ఉంది. 3600 మీటర్ల ఎత్తులో మరియు వెనుకగా హర్ముఖ్ పర్వత దృశ్యాన్ని కలిగి ఉన్న ఈ ప్రశాంతమైన సరస్సు, ప్రకృతి ప్రేమికులకు మరియు ఫోటోగ్రాఫర్లకు ఒక స్వర్గధామం.

తజివాస్ హిమానీనదం:

తజివాస్ హిమానీనదం:

P.C: You Tube

అద్భుతమైన తజివాస్ హిమానీనదం సోనామార్గ్ నుండి 5 కి.మీ.ల దూరంలో ఉంది. ఇది 9100 అడుగుల ఎత్తులో ఉంది. ఈ వెండి కొండను చూడాలంటే, గుర్రాల మీద లేదా 30 నిమిషాల లోపు పూర్తయ్యే ట్రెక్కింగు ద్వారా చేరవచ్చు. ఒక రోజు పాటు ఈ ప్రదేశం వద్ద ట్రెక్ చేపడితే, ఈ హిమానీనదాల చుట్టూ ఉన్న అనేక జలపాతాలు, ఘనీభవించిన సరస్సులు మరియు పచ్చని మైదానాలను చూడవచ్చు.

నిచ్నయ్ పాస్:

నిచ్నయ్ పాస్:

P.C: You Tube

సోనామార్గ్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో, 4139 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత మార్గం, కాశ్మీర్ లోయలో ఉంది. నిచ్నయ్ మార్గం ద్వారా, అన్ని ప్రముఖ సరస్సులకు పర్వతారోహకులు ట్రెక్ నిర్వహిస్తారు. ఈ ఎగుడుదిగుడు పర్వతాల ద్వారా ట్రెక్కింగ్ చేస్తే, గంభీరమైన పర్వతాలు, లోతైన గోర్జెస్ మరియు లోయలను, అత్యంత అద్భుతంగా వీక్షించే చూసే అవకాశం దొరుకుతుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+