Search
  • Follow NativePlanet
Share
» »శీతాకాలంలో విహార‌యాత్ర‌కు ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ ప్ర‌దేశాలు బెస్ట్‌...

శీతాకాలంలో విహార‌యాత్ర‌కు ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ ప్ర‌దేశాలు బెస్ట్‌...

ఈ వింట‌ర్ సీజ‌న్‌లో వచ్చే నెలలో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలవులు ఉంటాయి. దీంతో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ సెల‌వుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ స‌య‌మంలో కొన్ని పాఠశాలలు, కళాశాలలతో పాటు పలు కార్యాలయాలకు కూడా సెలవులు ఉంటాయి. ఈ సమయంలో ఏదైనా మంచి ప్రదేశాన్ని సందర్శించాల‌ని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఈ వింట‌ర్ సెల‌వుల్లో ఆనందంగా ఎంజాయ్ చేసేందుకు భారతదేశంలో అనేక గమ్యస్థానాలున్నాయి. ఇక్కడ వీక్షణ శీతాకాలంలో మరింత అందంగా, అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇక్క‌డి ప్రదేశాలలో పండుగలు కూడా నిర్వహించబడతాయి. ఇవి మీ యాత్రను ఎంతో ఆహ్లాదపరుస్తాయి. కాబ‌ట్టి ఈ వింట‌ర్‌లో ఇండియాలోని ఈ ప్లేస్‌ల‌ను సంద‌ర్శించండి.

rannofkutch1

రాన్ ఆఫ్ కచ్

రాన్ ఆఫ్ కచ్ సంద‌ర్శించేందుకు ఉత్తమ సమయం చలికాలం. ఎందుకంటే ఈ సమయంలో రాన్ ఫెస్టివల్ కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించ‌డం ద్వారా రాన్ ఆఫ్ క‌చ్ అందమైన దృశ్యాన్ని చూడటంతోపాటు, ఇక్క‌డి సంస్కృతి సంప్ర‌దాయాల‌ను కూడా చూసేయొచ్చు. పండుగ సమయంలో, ఇక్కడ అనేక రకాల కార్యకలాపాలు కూడా నిర్వహించబడతాయి. రాన్ ఆఫ్ క‌చ్ గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్‌కి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం భారత్, పాకిస్థాన్ సరిహద్దులో ఉంది. అయితే, ఎక్కువ భాగం ఇండియాలోనే ఉంది. ఈ ప్ర‌దేశం పూర్తిగా ఉప్పుతో నిండి ఉంటుంది. రాన్ అంటే ఉప్పుతో కూడిన చిత్తడి నేల అని అర్థం. కచ్ అనేది సంస్కృత పదం. క‌చ్ అంటే తిరగబడిన తాబేలు అని అర్థం. ఇక్కడ ఎటు చూసినా తెల్లని ఎడారిలా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఒక చెట్టు అనేది మ‌న‌కు క‌నిపించ‌దు.

jaisalmer1

జైసల్మేర్

వింట‌ర్‌లో సంద‌ర్శించేందుకు జైసల్మేర్ ఎంతో అంద‌మైన ప్ర‌దేశం. జైస‌ల్మేర్ థార్ ఎడారి ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని గోల్డెన్ సిటీ అని కూడా అంటారు. ఇక్కడ సందర్శించేందుకు ఉత్తమ సీజన్ శీతాకాలమ‌నే చెప్పుకోవాలి. ముఖ్యంగా డిసెంబర్ సమయంలో ఇక్కడకు వచ్చి ఎడారి, ఒంటె సఫారీని ఆస్వాదించవచ్చు. అంతే కాకుండా, ఇక్క‌డ క్వాడ్ బైకింగ్, డూన్ బాషింగ్, పారాసెయిలింగ్ వంటి అనేక ఇతర కార్యకలాపాలు కూడా ఉన్నాయి. సాహ‌స‌ప్రియుల‌కు ఈ ప్ర‌దేశం ఎంతో ఉత్త‌మ‌మైన‌ది. జైసల్మేర్‌లో పర్యాటక ప్రదేశాలకు కొరతే లేదు. ఇక్క‌డ అనేక చారిత్రక కట్టడాలు, అంద‌మైన అతి పురాత‌న‌మైన ప్యాలెస్‌లను చూడటమే కాకుండా, షాపింగ్ చేసేందుకు కూడా అనువైన ప్ర‌దేశాలున్నాయి. ఇక్క‌డి కేఫ్‌లలో చిల్లింగ్ అనుభవాన్ని అస్స‌లు మిస్ అవ్వ‌కండి.

gulmarg3

గుల్మార్గ్

మారుతున్నకాలాల‌ను బట్టి కాశ్మీర్ ప్ర‌దేశ‌పు దృక్పథం కూడా మారుతూ ఉంటుంది. వేసవిలో చుట్టూ పచ్చదనం కనిపిస్తే, చలికాలంలో కాశ్మీర్ మంచు దుప్పటితో కప్పబడి ఉంటుంది. హిమపాతాన్ని చూడాలనుకునే ప‌ర్యాట‌కులు త‌ప్ప‌కుండా కాశ్మీర్‌లోని గుల్మార్గ్‌ను సంద‌ర్శించాల్సిందే. పిల్లలు కూడా ఇక్కడికి రావడం వ‌ల్ల ఎంతో ఆనందిస్తారు. గుల్మార్గ్ అనేది గుల్, మార్గ్ అనే రెండు పర్షియన్ పదాల సమ్మేళనం. గుల్ అంటే పువ్వులు, మార్గ్ అంటే పచ్చికభూమి. కాబట్టి, గుల్మార్గ్ పూల పచ్చికభూమి. గుల్మార్గ్‌ అంటే పూలదారి అని అర్థం. గుల్మార్గ్‌లో లభించే పువ్వుల వైవిధ్యం మ‌రే ఇత‌ర ప్రాంతంలో కనిపించదు. ఇక్కడకు రావడం ద్వారా స్కీయింగ్ మరియు స్నోబోర్డింగ్ వంటి మంచు కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. ట్రెక్కింగ్ ప్రియుల‌కు ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ద‌నే చెప్పుకోవాలి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+