శివుడు చాలామంది హిందువులకి ఇష్టమైన దేవుడు. అడిగిన వరాలన్నీ ఇట్టే తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఈ శివరాత్రి సందర్భంగా శివ ఆలయాలను సందర్శించడం అనాదిగా హిందూ మతంలో వస్తున్న ఒక ఆచారం. ఐటీ రాజధాని అయిన బెంగళూరు కూడా అనేక శివాలయాలకు ప్రసిద్ధి. ఇందులో కొన్ని పురాణ కాంలో వెలిసినవి కాగా, మరికొన్ని ఇటీవల నిర్మించినవి. ఈ శివరాత్రి రోజున ఈ ఆలయ పర్యటన కోసం సదరు దేవాలయాల జాబితాను నేటివ్ ప్లానెట్ మీకోసం తీసుకువచ్చింది. గవి గంగాధరేశ్వర ఆలయం, కెంపుఫోర్ట్ శివ దేవాలయం మరియు కాడు మల్లిశ్వర దేవాలయం బెంగళూరు లో ప్రసిద్ధి చెందింది. మరి ఈ పర్వదినాన ఆ ఆలయాలను సందర్శించి సదాశివుడిని మనస్త్ఫూ ర్తిగా ప్రార్థిస్తామా....

1. హలసూరు సోమేశ్వర స్వామి దేవాలయం
Image source
బెంగళూరులోని అతి ప్రాచీన శివాలయాల్లో హలసూరులోని సోమేశ్వర దేవాలయం ఒకటి. చోళుల కాలానికి చెందిన ఈ దేవాలయం అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం. ఇటీవల దేవాదాయ శాఖ ఈ దేవాలయంలో భక్తుల కోసం అనేక సదుపాయాలను కల్పించింది.

2.గవి గంగాధరేశ్వర ఆలయం
Image source
గవి గంగాధరేశ్వర ఆలయం నగరంలోని విపురం లో ఉంది. గుహాలయమైన ఈ శైవ క్షేత్రం పురాణ కాలానికి చెందినదని చెబుతారు. ఈ ఆలయం మరో ఆసక్తికరమైన విషయం ప్రతి సంక్రాంతి పండుగ రోజున చోటు చేసుకుంటుంది. . ఆ రోజు సాయంత్రం సూర్యకాంతి దేవాలయం నంది విగ్రహం యొక్క కొమ్ముల గుండా వెళ్లి లింగంపై నేరుగా వస్తుంది. ప్రతి సంవత్సరం అద్భుత ద`ష్యం ఆవిష్కారమవుతుంది. దీన్ని చూడటానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో అక్కడ చేరు కుంటారు.

3. ద్వా దశ జ్యోతిర్లింగ దేవాలయం...
Image source
భారత దేశంలోని వివిధ చోట్ల ఉన్న 12 ప్రముఖ శైవ క్షేత్రాలను ప్రతిబింబించేలా శివపురంలోని ఓంకారేశ్వర కొండ పై ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ శివరాత్రి రోజున రాత్రి మొత్తం ప్రత్యేక పూజలు జరుగుతాయి.

4.కాడు మల్లేశ్వర దేవాలయం...
Image source
నగరంలోని మల్లేశ్వరంలో ఈ దేవాలయం ఉంది. 17వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయంలో నందీశ్వర తీర్థం కూడా చూడదగినది. ఇక్కడ ఓ నంది విగ్రహం నుంచి ప్రతి క్షణం నీరు వస్తుంది. ఈ నీరు లింగం పై పడుతున్న ద`ష్యం చూసి తరించాల్సిందే. స్థానిక వ`షభావతి నది నుంచి ఈ నీరు వస్తుందని పూజారులతో పాటు స్థానికులు చెబుతుంటారు.

5.బేగూరు నాగేశ్వర దేవాలయం...
Image source
గంగరాజుల కాలానికి చెందిన ఈ దేవాలయం నగరంలోని ప్రాచీన దేవాలయాల్లో అతి ముఖ్యమైనది. ఈ దేవాలయంలో లభించిన శిలాశాసనాల నుంచి భారత దేశ చరిత్ర తెలుసుకోవడానికి వీలయ్యింది. ఇక్కడ లభించిన శిలాశాసనాలను భారత పురవస్తు శాఖ భద్ర పరిచింది. శివరాత్రి నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. నగరంలోని బేరులో ఈ దేవాలయం ఉంది.

6.కెంఫోర్ట్
Image source
నగరంలోని ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డులో ఉన్న ఈ దేవాలయం అత్యంత ఆకర్షనీయమైన దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం చూడటానికి చుట్టు పక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా ప్రజలు వస్తారు. ఇక్కడి భారీ గణపతి విగ్రహాన్ని కూడా చూడాల్సిందే. శివరాత్రి మొత్తం శివనామం జపించే భక్తులతో ఈ ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది.

7.కోట జలకంఠేశ్వర దేవాలయం
Image source
నగర నడిబొడ్డులోని కళాసిపాళ్య ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయం కూడా చోళుల కాలానికి చెందినది. అత్యంత ప్రాచీన మైన ఈ శివాలయం శిల్ప కళకు నిలవు. ఈ దేవాలయంలో జలకంఠేశ్వర, పార్వతి, కైలాసనాథేశ్వర విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి.

8. ధర్మగిరి మంజునాథ దేవాలయం
Image source
ఆదునిక కాలానికి చెందిన బనశంకరి బీడీఏ కాంప్లెక్ల్స్ లో ఉంది. కన్నడ సీరియల్స్ ఎక్కువగా ఇక్కడ షూటింగ్ జరుగుతుంటాయి. ఇక్కడి పెద్ద లింగం చూడటానికి ఆకర్శనీయంగా ఉంటుంది. శివరాత్రి పర్వదినాన ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి.



Click it and Unblock the Notifications
