Search
  • Follow NativePlanet
Share
» » ప్రపంచంలో అమృత శిలతో నిర్మించిన ఏకైక దేవాలయం

ప్రపంచంలో అమృత శిలతో నిర్మించిన ఏకైక దేవాలయం

రణక్ పూర్ దేవాలయానికి సంబంధించిన కథనం.

రణక్ పూర్ రాజస్థాన్ లోని పాలి జిల్లాలో ఉన్న చిన్న పట్టణం. ఇక్కడ ఉన్నటు వంటి వంటి జైన దేవాలయం దేశంలోనే అత్యంత పెద్దదైన జైన దేవాలయం. అంతేకాకుండా ప్రపంచంలోని అద్భుత ధార్మిక కట్టడాల్లో ఇది కూడా ఒకటి. దీనిని సందర్శించడానికి నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా రాజస్థాన్ ను సందర్శించే విదేశీయుల్లో దాదాపు 90 శాతం మంది ఈ దేవాలయాన్ని సందర్శించకుండా వెనుదిరగరు. ఈ నేపథ్యంలో ఆ రణక్ పూర్ జైన దేవాలయంతో పాటు చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీకోసం...

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube

రణక్ పూర్ లోని జైనదేవాలయం సుమారు 4800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అమృత శిల అనే అత్యంత అరుదైన రాయి నుంచి ఈ దేవాలయం నిర్మితమయ్యింది.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube
సుమారు 108 అడుగుల ఎతైన ఈ దేవాలయంలో 3 అంతస్తులు ఉన్నాయి. ఈ దేవాలయం లోపల 1444 అమృత శిలలు ఉన్నాయి.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube

ఇందులో కొన్ని శిల్పాలు అప్పటి శిల్పుల శిల్పకళాచాతుర్యానికి ప్రత్యక్ష నిదర్శనాలు. దేవాలయం లోపల ఉన్న ధ్యానమందిరంలోని స్తంభాల పై సూర్య కిరణాలు పడిన వెంటనే అవి నీలి రంగులోకి మారిపోతాయి.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube

ఇటువంటి ద`ష్యాన్ని భారత దేశంలో మరే ఇతర దేవాలయంలోనూ మనం చూడలేము. అందువల్లే ఈ రనక్ పూర్ దేవాలయం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇది ఏక శిలతో నిర్మించిన దేవాలయం.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు ఉంటాయి. మధ్యలో జైన తీర్థంకరుడైన అదినాథుడు ఉంటారు. ఈ దేవాలయం చుట్టూ 26 ఉపాలయాలు 80 శిఖరాలు 84 దేవతా ప్రతిమలు కూడా ఉన్నాయి.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయంలో ఉన్న సుందరమైన గంటలు మరో ఆకర్షణ. సుదూర ప్రాంతాలు వీటి శబ్దం వీనుల విందుగా వినిపిస్తుంది. ఆ శబ్దం దాదాపు 108 కిలోమీటర్ల దూరం వరకూ స్పష్టంగా వినిపిస్తుందని పరిశోధనలో తేలిందని స్థానికులు చెబుతారు.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube

అప్పటి మేవాడ్ రాజు రణకుంభ ఈ దేవాలయన్ని అత్యంత సుందరంగా నిర్మింపజేసాడు. ఈ దేవాలయం నిర్మాణం పూర్తి కావడానికి సుమారు 65 ఏళ్లు పట్టిందంటే నిర్మాణ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం చుట్టు పక్కల ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయి. అందులో దసూరి కూడా ఒకటి. రణక్ పూర్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయంలో అతి పురాతనమైన శివ దేవాలయం ఉంది.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube

అంతేకాకుండా అరుదైన పరుశరామ దేవాలయాన్ని కూడా మనం ఇక్కడ సందర్శించుకోవచ్చు. ఇక రణక్ పూర్ కు కూతవేటు దూరంలో ఉన్న ఘనేరావ్ గ్రామంలో కూడా ప్రముఖ జైనదేవాలయం ఉంది.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube

ఇక్కడ మహావీరుడి ప్రతిమను మనం చూడవచ్చు. ఇక రణక్ పూర్ దేవాలయానికి దగ్గర్లో ఉన్న సాద్రి గ్రామం అనేక విశిష్ట దేవాలయాల నిలయం. దీనిని అప్పట్లో గేట్ ఆఫ్ మేవార్ టు మార్వార్ అని పిలిచేవారు.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube

ఇక్కడ వరాహావతార దేవాలయం, చింతమిణి విశ్వనాథ దేవాలయం, ఖుదా బక్ష్ బాబా దర్గా ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. నార్లే రణక్ పూర్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో చిన్న గ్రామం.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube

ఇక్కడ అనేక జైన, హిందు దేవాలయాలు ఉన్నాయి. సమయం ఉంటే ఈ గ్రామాన్ని కూడా తప్పక సందర్శించండి. ఇక్కడ ఉన్న సూర్యదేవాలయం అత్యంత ప్రాచీనమైనది.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube

భారతీయ శిల్ప కళకు ఈ సూర్యదేవాలయం నిలయం. ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు, గోడల పై అశ్వాలు, ఏనుగులు, యుద్ధవీరుల బొమ్మలను అత్యంత సుందరంగా చెక్కారు.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube
ఇవన్నీ అప్పటి శిల్పుల కళా చాతుర్యానికి ప్రత్యక్ష నిదర్శనాలు. ఇక్కడకు దగ్గర్లోనే అంబామాత దేవాలయం కూడా ఉంది. ఈ శిల్పాల్లోని వస్త్ర, ఆభరణ విన్యాసాలు ఇప్పటికీ ఫ్యాషన్ రంగంలోని వారిని ఆకర్షిస్తున్నాయి.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube
రణక్ పూర్ నుంచి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో కుంభాల్ ఘర్ కోట ఉంది. బాణా నదీ తీరంలో క్రీస్తుశకం 15వ శతబ్దంలో రాజ రాణ కుంభ ఈ కోటను నిర్మించాడు. ఈ కోట 7 ద్వారాలతో, 13 వాచ్ టవర్లతో అప్పట్లో శత్రుదుర్భేద్యంగా నిర్మించబడింది.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube
కుంభాల్ ఘార్ కు ఆనుకొనే మనం బాదల్ మహల్ ను చూడవచ్చు. బాదల్ అంటే మేఘాలు అని అర్థం. ఈ మహల్ లోపల అత్యంత సుందరమైన కుడ్య చిత్రాలు, బంగారు, వెండి తాపడం చేసిన వస్తువులు ఎన్నో ఉన్నాయి.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube
కుంబాల్ ఘర్ కు దగ్గర్లోనే కుంభాల్ ఘర్ అభయారణ్యం ఉంది. ఉదయ్ పూర్ నుంచి ఇక్కడకు దాదాపు 65 కిలోమీటర్లు. సుమారు 578 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అభయారణ్యంలో అంతరించే స్థితికి చేరుకున్న ఎన్నో జంతువులను సంరక్షిస్తున్నారు.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube
ఇక కుంబాల్ ఘర్ అభయారణ్యంలోనే మచ్చల్ మహావీర్ దేవాలయం ఉంది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ప్రవేశ ద్వారంలో అత్యంత అందంగా చెక్కబడిన రెండు ఏనుగుల ప్రతిమలను మనం చూడవచ్చు.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube
ఈ దేవాలయానికి దగ్గర్లో నీలకంఠ మహాదేవ మందిరం ఉంది. ఇక్కడ శివలింగం దాదాపు 6 అడుగుల ఎత్తు ఉంటుంది. మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఇక్కడకు ఎక్కువ మంది భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube
నీలకంఠ మహాదేవ మందిరానికి దగ్గర్లోనే పరుశురామ దేవాలయం ఉంది. ఇది ఒక గుహాలయం. స్థానిక కథనాలను అనుసరించి పరుశురాముడు ఇక్కడ కొన్ని ఏళ్లపాటు తపస్సు చేశాడని చెబుతారు. ఈ గుహాలయంలో ఆయన విగ్రహం కూడా ఉంది.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube
రణక్ పూర్ కు దగ్గర్లో అంటే సుమారు 106 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయ్ పూర్ లో మహారాణా ప్రతాప్ విమానాశ్రయం ఉంది. ఢిల్లీ, జై పూర్, జోధ్ పూర్ నుంచి ఇక్కడకు నిత్యం విమాన సర్వీసులు ఉన్నాయి.

రణక్ పూర్, జైన దేవాలయం

రణక్ పూర్, జైన దేవాలయం

P.C: You Tube
అదేవిధంగా రణక్ పూర్ కు దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫల్నాలో రైల్వే స్టేషన్ ఉంది. ఢిల్లీ, ముంబై, ఆజ్మీర్, జైపూర్ నుంచి ఇక్కడకు రైల్వే సర్వీసులు ఉన్నాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+