సుదూర ప్రయాణాలను తక్కువ సమయంలో చేరుకోవాలంటే చాలా మంది వ్యక్తులు విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఇది సౌకర్యవంతంగాను మరియు తక్కువ సమయంలో వెళ్లే వీలుగా ఉంటుంది. కానీ, సామాన్య పౌరులు విమాన ప్రయాణాలకు కాస్త దూరంగానే ఉంటారు. ఎందుకంటే విమానప్రయాణాలనేవి ఖర్చుతో కూడుకున్న పని. కానీ, ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించాలనుకునేవారు సహజ అందాలను తిలకించాలనుకునేవారు మాత్రం తప్పకుండా రోడ్డు ప్రయాణాలనే ఎంపిక చేసుకోవాలి. అలాంటి అందమైన రోడ్లు భారత్‌లో చాలానే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

రామేశ్వరం నుండి పాంబన్ వంతెన వరకు ప్రయాణం
భారత్‌లోని అందమైన రోడ్డు మార్గాలలో రామేశ్వరం నుంచి పాంబన్ వంతెన వరకు ప్రయాణం ఓ అద్భుతమైన మార్గం అని చెప్పుకోవాలి. రామేశ్వరాన్ని కలిపే ఈ రహదారి దృశ్యాలు స్వర్గానికి తక్కువేమీ కాదు. సముద్రాన్ని మరియు ఆకాశాన్ని కలిపే అద్భుతమైన దృశ్యం ఈ రహదారి నుండి చూసే అవకాశం లభిస్తుంది. ఈ మార్గానికి అనేక ప్రాముఖ్యతలు కూడా ఉన్నాయి. ఈ రహదారికి మతపరమైన మరియు చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. ఎందుకంటే శ్రీరాముడు శ్రీలంక చేరుకోవడానికి ఇక్కడ నుండి ఒక వంతెనను నిర్మించాడని చరిత్ర చెబుతోంది. అక్టోబరు నుండి ఏప్రిల్ వరకు, ఇక్కడి దృశ్యాలు ఎంతో ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ప్రయాణికులు ఈ మార్గం గుండా వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకోవాల్సిందే.
ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్ వే
మహారాష్ట్రలో నివసించేవారు తప్పకుండా ఈ మార్గం గుండా ప్రయాణించి ఉంటారు. లేదంటే ఖచ్చితంగా ఈ మార్గం గుండా ప్రయాణం చేయండి. పశ్చిమ కనుమల గుండా వెళుతున్న ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రయాణం ఓ మధురమైన అనుభూతినిస్తుంది. ఈ సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు చుట్టుపక్కల కొండలు, ఘాట్‌లు మరియు అడవుల సుందరమైన దృశ్యాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభిస్తోంది. ఇక్కడ అనేక హిల్ స్టేషన్లు మరియు చారిత్రక కోటలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుండి సహ్యాద్రి పర్వతాల యొక్క పచ్చని లోయలు మరియు ప్రకృతి అందాలను నేరుగా తాకే అనుభూతి కలుగుతోంది.

గౌహతి నుండి తవాంగ్ వరకు రోడ్డు ప్రయాణం
గౌహతి నుండి తవాంగ్‌ను కలిపే ఈ రహదారి ఈశాన్య ప్రాంతంలో ఉంది. దీనిని భారతదేశ స్వర్గంగా కూడా పిలుస్తుంటారు. కానీ ప్రతి ఒక్కరూ ఈ రహదారి యొక్క అందమైన దృశ్యాలను వీక్షించాల్సిందే. ఎందుకంటే ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. అయితే, ఇక్కడికి ప్రవేశించాలంటే తప్పకుండా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. భారతీయ మరియు విదేశీ పౌరులు కూడా ఇక్కడ ఇన్నర్ లైన్ అనుమతిని పొందాలి. సుమారు 14 గంటల ఈ రోడ్ ట్రిప్‌ను ఆస్వాదించడానికి మార్చి మరియు అక్టోబర్ మధ్య ఉత్తమ సమయంగా చెప్పుకోవచ్చు.

బెంగళూరు-పూణే హైవే
బెంగళూరు నుండి పూణే వెళ్లే హైవే దేశంలోని నాలుగు పెద్ద నగరాలను కలుపుతుంది. ఇందులో ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు కోల్‌కతా వంటి నగరాలు ఉన్నాయి. ఇక, ఈ మార్గం గుండా ప్రయాణం జీవితంలో మర్చిపోలేని ఎన్నో అనుభూతులను సమకూర్చుతుంది. వర్షాకాలంలో ఈ రహదారి నుండి పశ్చిమ కనుమల అద్భుతమైన దృశ్యాలు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడి మార్గం గుండా వెళ్ళే పాదచారులు అందమైన దృశ్యాలను చూస్తూ తమను తాము మైమరిచిపోవడం ఖాయం. కనుచూపుమేరు ప్రకృతి అందాలు పర్యాటకులను సాదర ఆహ్వానం పలుకుతుంఆయి. ఇంకా ఇక్కడ ప్రయాణికుల కోసం అనేక ఫుడ్ కోర్ట్‌లు, గ్యాస్ స్టేషన్లు మరియు పిక్నిక్ స్పాట్‌లు ఉన్నాయి.
మనాలి నుండి లేహ్ ప్రయాణం
ప్రపంచంలోని అతిపెద్ద పర్వత శ్రేణులలో ఒకటైన ఈ రహదారి మనాలి, లేహ్‌లను కలుపుతుంది. ఈ మార్గం ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన బైక్ రైడింగ్ కష్టంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ రహదారి యాత్రలో, మఠాలు, సరస్సులు, లోయలు మరియు మంచుతో కప్పబడిన పర్వతాలను కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడికి జూన్ మరియు సెప్టెంబర్ మధ్య ఈ వస్తే ట్రిప్‌ను మరింత ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. మరెందుకాలస్యం భారత్‌లోని ఈ అందమైన రహాదారుల గుండా మీ ప్రయాణాలను మొదలుపెట్టండి మరీ..



Click it and Unblock the Notifications













