Search
  • Follow NativePlanet
Share
» » ఓడిశా లోని డైమండ్ ట్రాయాంగిల్ !

ఓడిశా లోని డైమండ్ ట్రాయాంగిల్ !

ఓడిశాలో బౌద్ధ మత ఆరామాలు, ఇతర చిహ్నాలు చాలా వరకు మూడు ప్రదేశాలలో చూడవచ్చు. అవి రత్నగిరి, ఉదయగిరి , మరియు లలిత గిరి. ఈ మూడింటిని కలిపి డైమండ్ ట్రయాంగిల్ అని అంటారు. ఈ ప్రదేశాలలో అనేక ఆరామాలు, టెంపుల్స్, స్తూపాలు, అందమైన బౌద్ధ శిల్పాలు, చిత్రాలు కలవు. ఇవన్నీ చాలావరకు సారవంతమైన ప్రదేశాలు, అందమైన పర్వత ప్రాంతాలలో వుండి ప్రకృతి రమణీయతలతో రాణిస్తూ వుంటాయి. ఓడిశా లోని మూడు ప్రధాన బౌద్ధ ప్రదేశాల గురించి మరింత తెలుసుకోండి.

ratnagiri

రత్నగిరి , దీనిని ‘ ఆభరణాల కొండ" అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఒరిస్సా లోని అనేక బౌద్ధ మత అవశేషాలు కలవు. అద్భుతమైన బౌద్ధ మత శిల్పాలకు, ప్రసంగాలకు ఈ ప్రదేశం వేదికగా నిలచింది. ప్రపంచంలోని బౌద్ధ మత యూనివర్సిటీ లలో మొదటిది అయిన బీహార్ రాష్ట్రంలోని నలంద కు దీటైన ప్రదేశాలు రత్నగిరి లో మీకు కనపడతాయి. రత్నగిరిలో కల అతి పెద్ద బుద్ధుడి రాతి తల ఒక అద్భుత దృశ్యంగా వుంటుంది. ఇక్కడి తవ్వకాలలో వెల్లడైన అవశేషాలు వివిధ సైజులలో సుమారు రెండు డజెన్ లకు పైగా గల ఈ తలలు బుద్ధుడి ప్రశాంత ధ్యాన భంగిమలను ప్రదర్శిస్తాయి. వీటిని ఆనాటి కళా పని తనానికి నిదర్శనంగా కూడా చెప్పవచ్చు.

ఉదయగిరి లోని బౌద్ధ ప్రదేశాలు - ఒరిస్సా లోని "సన్ రైజ్ హిల్" మరొక అతి పెద్ద బౌద్ధ మత ప్రదేశం. ఇక్కడ ఒక ఇటుకల స్తూపం, రెండు బ్రిక్ ఆరామాలు, శిలా శాశనాలు కల ఒక మెట్ల రాయి, రాతిలో చెక్కబడిన అనేక బౌద్ధ మత శిల్పాలు వుంటాయి. బిరూప రివర్ (స్థానికంగా దీనిని సోలపౌమా అంటారు) చూపుతూ రాతి లో చెక్కబడిన బుద్ధుడి చిత్రాలు గాలరీ ఉదయగిరి లో మరొక ప్రధాన ఆకర్షణ. లైఫ్ సైజు బోధిసత్వ చిత్రాలు మొత్తంగా అయిదు కలవు. ఒకటి నిలబడిన బుద్ధుడు, ఒక స్తూపం పై కూర్చుని వున్న దేవత, మరొక నిలబడిన బోధి సత్వ మరియు కూర్చుని వున్న బోద్ధిసత్వ.

ఉదయగిరి

లలితగిరి లో వెల్లడైన బౌద్ధ మత అవశేషాలు - ఒరిస్సా లోని రత్నగిరి, ఉదయగిరి లలో బయటపడ్డ శిధిలాలు అంతటివి కాకపోయినా, ఇవి కూడా ప్రసిద్ధి చెందినవే. 1985 నుండి 1992 వరకూ జరిగిన ప్రధాన తవ్వకాలలో క్రి పూ. 2 వ శతాబ్దం నుండి క్రి. శ 13 వ శతాబ్దం వరకూ కల బౌద్ధ మత సాక్ష్యాలు ఇక్కడ వెల్లడయ్యాయి.

ఒడిష యొక్క ప్రధాన బౌద్ధ ప్రదేశాలు ఎలా సందర్శించాలి ?
ఒడిష యొక్క బౌద్ధ ప్రదేశాల ‘డైమండ్ ట్రయాంగిల్ ‘ (అంటే రత్నగిరి, లుదయగిరి, లలితగిరి) అసియా హిల్స్ లో కలదు. ఇక్కడకు భువనేశ్వర్ నుండి ఉత్తర దిశగా రెండు గంటల రోడ్డు ప్రయాణంలో చేరవచ్చు. సమీప ఎయిర్ పోర్ట్ భువనేశ్వర్ లో కలదు. సమీప ప్రధాన రైల్వే స్టేషన్ కటక్. ఈ ప్రదేశాలు సందర్శించ గోరె పర్యాటకులు రత్నగిరి లోని తోశాలి హోటల్ లో బస చేయవచ్చు. ఈ హోటల్ అర్కేయోలాజికల్ మ్యూజియం కు ఎదురుగా రత్నగిరి బౌద్ధ ఆకర్షణల సమీపంలో కలదు. రత్నగిరి నుండి ఉదయగిరి 10 కి. మీ. ల దూరం కాగా లలితగిరి సుమారు కి. మీ. ల దూరం లో వుంటుంది. ఈ ప్రదేశాల సందర్శనకు పొడి , చలి వాతావరణం కల అక్టోబర్ నుండి మార్చ్ నెలలు సౌకర్యం. ఏప్రిల్, మే నెలల లో ఇక్కడ భరించ లేని వేడి వాతావరణం కనుక పర్యాటకులకు ఒడిషా పర్యటన సూచించ దగినది కాదు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+