Search
  • Follow NativePlanet
Share
» »సాగర్ ఐలాండ్ - ద్వీపంలోనే స్వర్గం !

సాగర్ ఐలాండ్ - ద్వీపంలోనే స్వర్గం !

By Mohammad

సాగర్ ఐలాండ్ ఒక ద్వీపం. చూస్తే గనక స్వర్గం వలే ఉంటుంది. పర్యాటకులు సెలవు దినాల్లో, తీర్థయాత్రల సమయంలో ఇక్కడికి వస్తుంటారు. పశ్చిమ బెంగాల్ లోని కోల్కతా నుండి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఈ ద్వీపానికి గల మరో పేరు 'గంగసాగర్' లేదా 'సాగర్ ద్వీప్'.

బంగాళాఖాతంలో నీటి చుక్క మాదిరి ఉండే సాగర్ ఐలాండ్ లో మొత్తం 43 గ్రామాలు ఉన్నాయి. అందులో పెద్ద గ్రామం 'గంగసాగర్'. ప్రతి సంవత్సరం వందల వేల మంది యాత్రికులు గంగా నది సంగమ ప్రదేశంలో మరియు బంగాళాఖాతం సముద్రం లో మునిగి సమీపంలోని కపిల ముని ఆశ్రమాన్ని సందర్శిస్తారు.

ఇది కూడా చదవండి : ప్రత్యేక ఆకర్షణలలో - వెస్ట్ బెంగాల్ మ్యూజియం లు !

కపిల ముని మహర్షి ఆలయం

కపిల ముని మహర్షి ఆలయం మతపరమైన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశంగా గుర్తించబడినది. ఎందుకు అంటే శ్రీరాముని పూర్వీకులు సాగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం. గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది.

కపిల ముని మహర్షి ఆలయం

కపిల ముని మహర్షి ఆలయం

చిత్ర కృప : Niloy Chakraborty

గంగార్సర్ మేళా

హిందూ మత పండుగ అయిన మకర సంక్రాంతి రోజున వేలాది మంది యాత్రికులు సాగర్ ఐలాండ్ కు వచ్చి గంగ్సాగర్ మేళా లేదా వేడుక లో పాల్గొంటారు. ఇక్కడ కుంభమేళా బ్రహ్మాండంగా జరుగుతుంది. 2007 లో 3 లక్షల మంది మరియు 2008 లో 5 లక్షల మంది హుగ్లీ నది (గంగా నదిని స్థానికంగా హుగ్లీ నది గా వ్యవహరిస్తారు) సముద్రంలో కలిసే ప్రదేశంలో పవిత్ర స్నానం ఆచరించారు. ప్రతి ఏటా 5 లక్షల మంది ఈ ఐలాండ్ ను సందర్శిస్తారని అంచనా.

చిత్ర కృప : Ankan Banerjee

గంగార్సర్ మేళా - 2015

చిత్ర కృప : Ankan Banerjee

సాగర్ మెరైన్ పార్క్, కపిల మహర్షి ఆశ్రమం, రామకృష్ణ మిషన్ ఆశ్రమం, పవన విద్యుత్ మరలు మరియు సాగర్ లైట్ హౌస్ ప్రదేశాలను కూడా సాగర్ ఐలాండ్ లో సందర్శించవచ్చు. కోల్కతా నుండి సాగర్ ఐలాండ్ సుమారు 100 కి. మీ ల దూరంలో ఉంటుంది.

ఐలాండ్ లో ఏమి చేస్తే బాగుంటుంది ?

ఈ ద్వీపంలో ఫెర్రీ ప్రయాణం, ఆహారం సరదాగా ఉంటుంది. చేపల్లు పట్టడం, తీరం వెంబడి కారులో ప్రయాణం వంటివి ఇక్కడ చేపట్టవచ్చు. భోజన ప్రియులకు రైస్ దొరికే హోటళ్ళు ఇక్కడ చాలానే ఉన్నాయి. సంప్రదాయ బెంగాలీ వంటకాలు, నోరూరించే చాపలు, ఇతర సముద్రపు ఆహారాలు ఎంతో రుచికరంగా ఉంటాయి.

ఐలాండ్ లో చేపలు పడుతున్న దృశ్యం

ఐలాండ్ లో చేపలు పడుతున్న దృశ్యం

చిత్ర కృప : sudarsan2009

వసతి

సాగర్ ఐలాండ్ లో అన్ని తరగతుల హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఏసీ, నాన్ - ఏసీ, డీలక్స్ తదితర గదులు తక్కువ ధరకే లభ్యమవుతాయి. స్టేట్ యూత్ హాస్టల్, భారత్ సేవాశ్రం సంఘ్, లిరికా సాగర్ లాడ్జ్ లు ఇక్కడ ప్రధాన సత్రాలు లేదా వసతి గృహాలుగా ఉన్నాయి. స్టేట్ యూత్ హాస్టల్ లోని డబుల్ బెడ్ రూమ్ గదులకు రోజుకి 100 రూపాయలు అద్దె వసూలు చేస్తారు. భారత్ సేవాశ్రం సంఘ్ ఉచితంగా భోజనం, వసతి సదుపాయాన్ని అందిస్తుంది.

ఐలాండ్ లోని వసతి గృహాలు

ఐలాండ్ లోని వసతి గృహాలు

చిత్ర కృప : Owen Lin

సాగర్ ఐలాండ్ ఎలా చేరుకోవాలి ?

సాగర్ ఐలాండ్ చేరుకోవటానికి ముందుగా మీరు కోల్కతా లోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాలి. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లేదా ప్రభుత్వ వాహనాలను ఆశ్రయించి డైమండ్ హార్బర్ రోడ్ (జాతీయ రహదారి 117) గుండా 90 కిలోమీటర్లు దక్షిణంగా ఉన్న కక్ద్విప్ వరకు ప్రయాణించాలి. రైళ్ళలో వచ్చే వారు కోల్కతా రైల్వే స్టేషన్ లో దిగి కక్ద్విప్ వరకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవాలి.

సాగర్ ఐలాండ్ ఎలా చేరుకోవాలి ?

సాగర్ ఐలాండ్ ఎలా చేరుకోవాలి ?

చిత్ర కృప : Dageesh PANDHAYIL

కక్ద్విప్ వద్ద లభించే ఫెర్రీ లలో ప్రయాణించి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కచుబెరియా (సాగర్ ఐలాండ్ ఉత్తర కోన) చేరుకొంటె సరి .. మీరు సాగర్ ఐలాండ్ చేరుకున్నట్టే ..! లోకల్ గా తిరగటానికి సుమోలు, ప్రవేట్ వాహనాలు అద్దెకు లభిస్తాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+