Search
  • Follow NativePlanet
Share
» »కాశ్మీర్ అందాల‌ను చూసొద్దామా?

కాశ్మీర్ అందాల‌ను చూసొద్దామా?

కాశ్మీర్ అందాల‌ను చూసొద్దామా?

కాశ్మీర్ లోయ అందం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భూతల స్వర్గంగా పిలువబడే కాశ్మీర్ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ హిల్ స్టేషన్లు ఉన్నాయి. ఇవి మనస్సును ఆకర్షిస్తాయి. ఇక్కడి సహజ సౌందర్యం మరియు తీర్థయాత్రలు ప్రధాన ఆకర్షణ కేంద్రాలు. వేసవి సెలవులు గడపడానికి కాశ్మీర్‌ను మించిన ప్రదేశం మరొకటి ఉండదు. ఇక్కడ మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు సరస్సులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. వేసవిలో కాశ్మీర్‌ను సందర్శించడానికి ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకోండి. మ‌రెందుకాల‌స్యం కాశ్మీర్ ప్ర‌యాణానికి బ‌య‌లుదేరండి.

srinagar

శ్రీనగర్

శ్రీనగర్ చాలా అందమైన హిల్ స్టేషన్. ఇది దాని అందంతో పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తుంది. ఈ హిల్ స్టేషన్ జీలం నది ఒడ్డున ఉంది. శ్రీనగర్‌ని సందర్శించినప్పుడు, తప్పనిసరిగా హౌస్‌బోట్‌ని ఆస్వాదించండి. ఈ ప్రాంతంలోని అందమైన దాల్ సరస్సును సందర్శించడం మాత్రం మ‌రవొద్దు. ఇది దాల్‌, అంచ‌ర్ స‌ర‌స్సుల‌లో ఉంది. ఈ న‌గ‌రం ఉద్యాన‌వనాలు, మంచుతుంప‌రుల‌తో స‌హ‌జ వాతావ‌ర‌ణం క‌లిగి ఉంటుంది. శ్రీ‌న‌గ‌ర్ ఇంటి ఆకారంతో ఉన్న బోట్ల‌కు పేరుపొందింది. కాశ్మీర్ శాలువాల‌కు, ఇత‌ర సాంప్ర‌దాయ హ‌స్త‌క‌ళ‌ల‌కు ఎండిన పండ్ల‌కు పేరుపొందింది. ఇది భార‌త‌దేశం ఉత్త‌రాన ప‌దిల‌క్ష‌ల‌కు పైగా జ‌నాభా క‌లిగి ఉన్న‌న‌గ‌రం.

pahalgam

పహల్గామ్

పహల్గామ్ దాని సుంద‌ర‌మైన అందానికి ప్ర‌సిద్ధి చెందింది. మ‌రియు ఎత్త‌యిన హిమాల‌యాలలోని సుంద‌ర‌మైన లిద్ద‌ర్ లోయ యొక్క అభ‌ర‌ణం. ఇది హైకింగ్‌, ట్రెక్కింగ్ మ‌రియు ఫిషింగ్ కోసం అనువైన ప్రాంత‌మ‌నే చెప్పుకోవాలి. ఇక్క‌డ చందన్‌వాడి, బేతాబ్ వ్యాలీ మరియు అరు వ్యాలీ వంటి ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే, ఇక్కడ పోనీ రైడ్ చేయడం ప‌ర్యాట‌కులు ఎంతో గొప్ప అనుభూతిని క‌లిగిస్తుంది.

patnithop

పట్నితోప్

ప‌ట్నితోప్ భార‌త‌దేశంలోని జ‌మ్మూకాశ్మీర్‌లోని రాంబ‌న్ జిల్లాలో రాంబ‌న్ టౌన్ మ‌రియు ఉదంపూర్ న‌గ‌రాల మ‌ధ్య ఉన్న ఒక హిల్‌స్టేష‌న్‌. ఇది జ‌మ్మూ శ్రీ‌న‌గ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై, జ‌మ్మూనుండి 112 కిలోమీట‌ర్ల దూరంలో ఉదంపూర్ నుండి శ్రీ‌న‌గ‌ర్ వెళ్లే మార్గంలో ఉంది. ఇక్కడి అందం ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. సాహ‌స‌ప్రియుల‌కు ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ది. ఈ ప్రాంతంలో పారాగ్లైడింగ్ మొదలైనవాటిని ఆస్వాదించవచ్చు. పర్యాటకులు పట్నితోప్ నుండి నాథాటాప్ వరకు నడిచేటప్పుడు రుచికరమైన కాశ్మీరీ ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.

aruvalley

అరు వ్యాలీ

అరు అనేది భార‌త‌దేశంలోని జ‌మ్మూమ‌రియు కాశ్మీర్‌లోని అనంత‌నాగ్ జిల్లాలో ఉన్న గ్రామం. ఈ ప్రాంతం జిల్లా కేంద్ర‌మైన అనంత‌నాగ్ నగ‌రం నుండి 53 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది ఇది ప‌హ‌ల్గామ్ నుండి 12 కిలోమీట‌ర్ల దూరంలో లిద్ద‌ర్ న‌ది నుండి 11 కిలోమీట‌ర్ల ఎగువ‌న ఉంది. దాని సుంద‌ర‌మైన ప‌చ్చిక‌భూములు, స‌ర‌స్సులు మ‌రియు ప‌ర్వ‌తాల‌కు ప్ర‌సిద్ధి చెందింది. ఈ గ్రామం లిద్ద‌ర్ నదికి ఉప‌న‌ది అయిన ఆరు న‌దికి ఎడ‌మ ఒడ్డున ఉంది. జ‌మ్మూ కాశ్మీర్ యొక్క అతిపెద్ద ప‌శుగ్రాస విత్త‌న ఉత్ప‌త్తి కేంద్రం కూడా ఆరు గ్రామంలో ఉంది. హైకింగ్ మరియు క్యాంపింగ్ వంటివి ఇష్ట‌ప‌డే వారికి ఈ ప్ర‌దేశం ఎంతో అనువైన‌ద‌నే చెప్పాలి. ఈ ప్రదేశం టార్సర్ సరస్సు మరియు కొల్హోయ్ గ్లేసియర్ ట్రెక్‌కి ప్రసిద్ధి చెందింది.

lamayur1

లామయూరు

ఇది శ్రీనగర్ సమీపంలోని అత్యంత సుందరమైన హిల్ స్టేషన్లలో ఒకటి. లామ‌యూరును యురు మొనాస్ట‌రీ అని కూడా పిలుస్తారు. ఇది భార‌త‌దేశంలోని జ‌మ్మూ కాశ్మీర్‌లోని లేహ్ జిల్లాలో ఉన్న లామ‌యూరు వ‌ద్ద ఉన్న పురాత‌న టిబెట‌న్ బౌద్ద ఆరామాల‌లో ఒక‌టి. ఈ ప్రాంతంలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూడొచ్చు. ఈ ప్రదేశం సమీపంలోని టిబెటన్ బౌద్ధ విహారాల‌కు కూడా ప్రసిద్ధి చెందింది.

More News

    Read more about: srinagar pahalgam
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+