Search
  • Follow NativePlanet
Share
» »కర్ణాటక డే సంద‌ర్భంగా కార్వార్‌లోని బీచ్‌ల్లో విహ‌రిద్దామా..?

కర్ణాటక డే సంద‌ర్భంగా కార్వార్‌లోని బీచ్‌ల్లో విహ‌రిద్దామా..?

కర్ణాటక డే సంద‌ర్భంగా కార్వార్‌లోని బీచ్‌ల్లో విహ‌రిద్దామా..?

ప్రతి సంవత్సరం నవంబర్ 1న కర్ణాటక దినోత్సవాన్నిజ‌రుపుకుంటారు. ఈ రోజునే కర్ణాటక వ్యవస్థాపక దినోత్సవం లేదా రాజ్యోత్సవ దినోత్సవం అని కూడా పిలుస్తారు. కర్ణాటక రాష్ట్రాన్ని గతంలో మైసూర్ అని పిలిచేవారు. 1973 సంవ‌త్స‌రంలో ఈ పేరును మార్చ‌డం జ‌రిగింది. క‌ర్ణాట‌క భారతదేశంలో చాలా అందమైన ప్రదేశంగా ప్ర‌సిద్ధి చెందింది. ఈ ప్రాంతం బీచ్‌ల‌కు కూడా ఎంతో ప్ర‌సిద్ధి చెందింది.

బీచ్ పేరు చెప్ప‌గానే అంద‌రికీ గోవానే గుర్తుకొస్తుంది. ఎందుకంటే, గోవా బీచ్‌ల‌కు ప్ర‌సిద్ధిచెందింది. ఈ స‌మ‌యంలో గోవా ప్రాంతం సంద‌ర్శ‌కుల‌తో నిండి ఉంటుంది. కాబ‌ట్టి చాలామంది ఆ ప్రాంతాల‌కు వెళ్లిన‌వారు అక్క‌డి అందాల‌ను అంతంగా ఆస్వాదించ‌లేరు. అటువంటి వారు క‌ర్ణాట‌క‌లోని ఈ బీచ్‌ల అందాల‌ను చూసేయండి. క‌ర్ణాట‌క‌లోని కార్వార్ న‌గ‌రం బీచ్‌ల‌కు ఎంత‌గానో పేరుగాంచింది. ఈ ప్రాంతం గురించి చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలిసి ఉంటుంది. ఈ బీచ్ ల‌వ్‌బర్డ్స్‌కు ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది.

karwar day

కార్వార్‌లోని ప్రసిద్ధ బీచ్‌లు...

దేవ్‌బాగ్ బీచ్

దేవ్‌బాగ్ బీచ్ కర్ణాట‌క నగరం నుండి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది పచ్చని, దట్టమైన చెట్లతో నిండి ఉంటుంది. ఇక్క‌డి ప్ర‌కృతి అందాలతో ఈ ప్రాంతం అందం మ‌రింత రెట్టింప‌వుతోంది. ఈ బీచ్ స్పష్టమైన నీలి రంగు నీటికి ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఈ బీచ్ అందాల‌లో సేద‌తీరాల‌నుకుంటే మాత్రం సాహసం చేయాల్సిందే. దేవ్‌బాగ్ బీచ్‌లో స్టే చేసేందుకు రిసార్ట్‌లు, కాటేజీలు కూడా ఉన్నాయి.

రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్

క‌ర్ణాట‌క‌లోని రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్‌ను కార్వార్ బీచ్ అని కూడా పిలుస్తారు. ఈ బీచ్ అందాలు సాయంత్రం వేళలో మ‌రింత రెట్టింప‌వుతాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్ కాళీ నదికి సమీపంలో ఉంటుంది. అంతేకాకుండా ఇది అరేబియా సముద్రపు అద్భుతమైన వీక్షణల‌ను ప‌ర్యాట‌కులు అందిస్తుంది. ఈ బీచ్ స్పష్టమైన నీలిరంగు నీటిని కలిగి ఉంటుంది. ఈ బీచ్ చుట్టూ పచ్చని చెట్లు, కొండలు ఉంటాయి. ఇక్క‌డ స్విమ్మింగ్, సన్ బాత్, బీచ్ స్పోర్ట్స్ వంటి వివిధ కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. ఈ బీచ్ దాని సహజ సౌందర్యంతో పాటు చారిత్రక ప్రాధాన్యతకు కూడా ఎంత‌గానో ప్రసిద్ధి చెందింది. గొప్ప మరాఠా యోధుడు శివాజీ తన నౌకాదళ యాత్రల సమయంలో ఈ బీచ్‌లో తన నౌకలను లంగరు వేసేవాడని ఇక్క‌డివారు చెబుతుంటారు. అంతే కాకుండా ఇక్క‌డ మ్యూజికల్ ఫౌంటెన్, టాయ్ ట్రైన్, ఫిష్ హౌస్‌లను కూడా ఆస్వాదించవచ్చు.

karwar beach clean

కోడిబాగ్ బీచ్

కోడిబాగ్ బీచ్ క‌ర్ణాట‌క‌లో అత్యంత ప్రసిద్ధిచెందిన‌ బీచ్. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ బీచ్‌లో స్థానికులు, ప‌ర్యాట‌కుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంది. సాహస ప్రియుల‌కు కూడా ఈ ప్రాంతం ఎంతో అనువైనది. పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డిపేందుకు ఈ బీచ్ స‌రైన ప్లేస్‌. ఇక్క‌డ అనేక ర‌కాల సాహ‌స కార్య‌క‌లాపాలు కూడా ఉన్నాయి. ఈ బీచ్ కర్ణాటకలోని అత్యంత పరిశుభ్రమైన బీచ్‌లలో ఒకటిగా పేరుగాంచింది.

మజలి బీచ్

క‌ర్ణాట‌క‌లోని మజ‌లీ గ్రామం కార్వార్ నగరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామం ఉన్న బీచ్‌ని మజలి బీచ్ అంటారు. ఈ బీచ్‌లో ప‌ర్యాట‌కులు సేద తీరేందుకు అందమైన కాటేజీలు, రిసార్ట్‌లు అందుబాటు ధ‌ర‌ల‌కే ల‌భిస్తాయి. ఈ ప్రాంతంలో స్విమ్మింగ్‌తో పాటు కయాకింగ్, తెడ్డు, ట్రెక్కింగ్ వంటి అనేక కార్యకలాపాలను ఆస్వాదించే అవ‌కాశం ఉంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+