Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ బంగారు పుష్పాలు ఎప్పుడు వినియోగిస్తారో తెలుసా?

ఇక్కడ బంగారు పుష్పాలు ఎప్పుడు వినియోగిస్తారో తెలుసా?

శ్రావణ బెళగోళలోని గోమఠేశ్వర విగ్రహానికి సంబంధించిన కథనం.

సోదరుడితో జరిగిన యుద్ధంలో బాహుబలి పిడిగుద్దుతో తన సోదరుడైన భరతుడిని చంపాలని ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో భరతుడి కళ్లల్లో ప్రాణభయాన్ని చూసి చలించిపోతాడు. ఆ తర్వాత తన రాజ్యాన్ని కూడా భరతుడికి అప్పగించి ప్రపంచ శాంతి కోసం దేశాటన బయలుదేరుతాడు. అటు పై జ్జానం సంపాదించి ఐహిక సుఖాలను వదిలేస్తున్నట్లు చెబుతూ దిగంబరంగా ఉండిపోయాడు. అటు పై ఆధ్యాత్మిక భావనలు ప్రజల్లో కలిగిస్తూ జైన మతాన్ని ప్రాచూర్యంలోకి తీసుకువచ్చాడు. అటు పై బాహుబలిని గోమఠేశ్వరుడని పిలిచారు. అందువల్లే గోమఠేశ్వరుడు నగ్నంగా ఉంటాడు.

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

P.C: You Tube

శ్రావణబెళగోళ కర్నాటకలోని హాసన్ జిల్లా చెన్నరాయపట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక కర్నాటక రాజధాని బెంగళూరుకు 144 కిలోమీటర్ల దూరంలో ఈ జైన పుణ్యక్షేత్రం ఉంటుంది.

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

P.C: You Tube

శ్రావణబెళగోళ చంద్రగిరి, విద్యాగిరి అనే రెండు కొండల సమహారం. ప్రధాన గోమఠేశ్వరుడి విగ్రహం ఈ విధ్యాగిరి పైనే ఉంది. ఇక్కడ దొరికిన కొన్ని శాసనాలను అనుసరించి ఇక్కడ తెల్లని సరోవరం ఉండేదని చెబుతారు.

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

P.C: You Tube

ఆ సరోవరాన్ని మనం ఇప్పటికీ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడి శిల్పసంపద జైన సంస్క`తి సంప్రదాయాలను మనకు గుర్తుకు తీసుకువస్తుంది. అంతేకాకుండా ఈ రెండు కొండల పై ఇప్పటి వరకూ 800 శాసనాలు లభించాయి.

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

P.C: You Tube

ఇవన్నీ భారత చరిత్రకు, జైన మతానికి సంబంధించినవి. ఇద్దులో కొన్ని కన్నడ భాషలో కూడా ఉండటం గమనార్హం. జైన, విష్ణుపురాణాల్లో బాహుబలి ప్రస్తావన ఉంది. కర్నాటకతో పాటు మిగిలిన మతస్తులు కూడా బాహుబలిని గోమఠేశ్వరుడి పేరుతో పూజలు జరుపుతారు.

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

P.C: You Tube

సోదరుడితో జరిగిన యుద్ధంలో బాహుబలి పిడిగుద్దుతో తన సోదరుడైన భరతుడిని చంపాలని ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో భరతుడి కళ్లల్లో ప్రాణభయాన్ని చూసి చలించిపోతాడు. ఆ తర్వాత తన రాజ్యాన్ని కూడా భరతుడికి అప్పగించి ప్రపంచ శాంతి కోసం దేశాటన బయలుదేరుతాడు.

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

P.C: You Tube

ఇది క్లుప్తంగా గోమఠేశ్వరుడి కథనం. అప్పట్లో భోదన్లో బాహుబలి ఎతైన విగ్రహం ఉండేది. ఈ విషయాన్ని తెలుసుకున్న హాసన్ ను పాలించిన గంగరాజుల ఆస్థానంలోని మంత్రి చాముండరాయ తన తల్లి కోరిక మేరకు కర్ణాకటలో కూడా అటు వంటి విగ్రహమే ఉండాలని భావించాడు.

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

P.C: You Tube

చివరికి జైన మతానికి ఆలవాలమైన విధ్యాగిరి పై బాహుబలి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఏక శిలా విగ్రహాల్లో బాహుబలి విగ్రహమే ఎతైనది. ఈ విగ్రహం ఎత్తు 58.8 అడుగులు.

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

P.C: You Tube

క్రీస్తుశకం 981లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదే ఏడాది మొదటిసారిగా మహామస్తకాభిషేకాలు జరిగాయి. అప్పటి నుంచి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహామస్తకాభిషేకాలు క్రమం తప్పకుండా జరుగుతూ వస్తున్నాయి.

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

P.C: You Tube

మొదట్లో ఈ మహామస్తకాభిషేకంలో రాజులు మాత్రమే పాల్గొనేవారు. అయితే ఒకసారి ఎన్ని పాలు పోసినా విగ్రహం తడవలేదు. దీంతో అక్కడ ఉన్న ఓ వ`ద్ధురాలు ఒక గిన్నెడు పాలు పోయగా అవి విగ్రహాన్ని తడపడే కాకుండా ధారగా ప్రవహించాయని చెబుతారు

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

P.C: You Tube

దీంతో చాముండిరాయుడు తన తప్పును తెలుసుకొని సాధారణ ప్రజలు కూడా పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహామస్తకాభిషేకంలో పాల్గొనడానికి అవకాశం కల్పించాలని ఉత్తర్వులు జారే చేశారు.

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

P.C: You Tube

ఈ ఉత్సవాల్లో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ ధార్మిక కార్యక్రమంలో దేశంలోని వివిధ పుణ్య నదుల నుంచి తెచ్చిన పాలు, నెయ్యి, వెన్న, గంధంతో పాటు బంగారు, వెండి పుష్పాలతో అభిషేకిస్తారు.

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

శ్రావణబెళగోళ, గోమఠేశ్వర విగ్రహం

P.C: You Tube

ఈ కార్యక్రమంలో జైనులే కాకుండా ఇతర మతస్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. అంతేకాకుండా దేశవిదేశాల నుంచి కూడా ఇక్కడకు భక్తులు లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+