Search
  • Follow NativePlanet
Share
» »శివ సాగర్ - మహా శివుడి కరుణా సముద్రం !

శివ సాగర్ - మహా శివుడి కరుణా సముద్రం !

శివ సాగర్ అంటే అర్ధం మహా శివుడి యొక్క సముద్రం అని చెపుతారు. ఇది ఒక చారిత్రక పట్టణం. ఒకప్పుడు అహోం రాజ వంశాలకు సుమారు నూరు సంవత్సరాలపాటు రాజధానిగా వుండేది. అహోం రాజుల కాలంనాటి చారిత్రక స్మారకాలు ఈ పట్టాన వైభవాన్ని చాటుతాయి.

ఒకప్పటి చరిత్ర ప్రాధాన్యత కల శివ సాగర్ పట్టణం నేడు అక్కడ ఉత్పత్తి అయ్యే నూనె మరియు తేయాకు తోటలకు ప్రసిద్ధి గాంచినది. అస్సాం ఎగువ ప్రాంతంలో అనేక పర్యాటక ప్రదేశాలు కలవు. అనేక సంవత్సరాల పాటు అహోం రాజుల వంశ పాలనలో వుండటం చే ఈ పట్టణం పూర్తిగా వారికి సంబంధిన స్మారక అవశేషాలను కలిగి వుంది.

టవున్ లో కల శివ సాగర్ సరస్సు ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. సరస్సు చుట్టూ మూడు ప్రధాన దేవాలయాలు కలవు. అవి శివదాల్, విష్ణు దాల్ మరియు దేవిదాల్ అని ప్రసిద్ధి కెక్కాయి.

శివ సాగర్ ఎలా చేరాలి ?

శివ సాగర్ ఎలా చేరాలి ?

శివ సాగర్ కు సమీప ఎయిర్ పోర్ట్ జోర్హాట్ లో 55 కి. మీ. ల దూరంలో కలదు. ఈ ఎయిర్ పోర్ట్ నుండి గౌహతి, కోల్కతా, మరియు సిల్చార్ పట్టణాలకు రెగ్యులర్ విమాన సేవలు కలవు. సమీప రైలు స్టేషన్ ఇక్కడకు సుమారు 16 కి. మీ. ల దూరంలో కల సిమాల్ గురి లో కలదు. ఈ రైలు స్టేషన్ గౌహతి - డిబ్రుఘర్ రైలు లైన్ లో వుండటంచే అనేక ట్రైన్ లు ఇక్కడ నిలబడతాయి.రోడ్డు మార్గంలో శివ సాగర్ కు జాతీయ రహదారి నెం.37 పై దిబ్రూఘర్ వరకు ప్రయాణించాలి. ఇది తేయాకు, నూనె ఎగుమతుల వ్యాపారులకు అతి బిజీ గా వుండే రహదారి. ఈ రకంగా ఈ పట్టణం రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలకు అనుసంధానించబడి వుంది.

ఫోటో కర్టిసీ: rajkumar1220

చారై దేవ్

చారై దేవ్

చారై దేవ్ ప్రదేశం ఒక సమాధుల ప్రదేశం. ఇక్కడ అస్సాం రాష్ట్ర సందర్శనలో పర్యాటకులు ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శిస్తారు. రాజ కుటుంబాల సభ్యుల సమాధులు అతి పెద్దవిగా ఈజిప్ట్ లోని పిరమిడ్ ల ఆకారాలలో నిర్మించారు. ఈ ప్రదేశంలో వారి పిత్రు దేవతలు సైతం నివసిస్తారని చెపుతారు. ఈ సమాధులు సుమారు 150 వరకూ ఇక్కడ కలవు. ఈ సమాధులు చిన్న కొండల ఆకారంలో వుండి ఆనాటి శిల్ప శైలి కి ఉదాహరణగా నిలుస్తాయి. సమారు 30 సమాధులు పురావస్తు శాఖ చేనిర్వహించ బడుతున్నాయి. శివ సాగర్ సందర్శించే వారికి ఈ ప్రదేశం చేరటం చాలా తేలిక.

ఫోటో కర్టిసీ: Zorodocknife

గౌరీ సాగర్

గౌరీ సాగర్

గౌరీ సాగర్ సరస్సు శివసాగర్ టవున్ కు 12 కి. మీ. ల దూరంలో కలదు. ఇక్కడ కల టెంపుల్ ను సుమారు రెండువందల సంవత్సరాల కిందట నిర్మించారు. మాత దుర్గా దేవి ఇక్కడ వివిధ రూపాలలో విగ్రహాలు కలిగి దర్శనం ఇస్తుంది. గౌరీ సాగర్ సరస్సు సుమారు 150 ఎకరాలలో విస్తరించింది. దీని తీరంలో కల మూడు దేవాలయాలు ప్రధాన ఆకర్షనగా నిలుస్తాయి. ఈ దేవాలయాల దర్శనం కొరకు భక్తులు రాష్ట్రం నుండే కాక దేశ వ్యాప్తంగా కూడా వస్తారు. ఈ సరస్సు యొక్క పరిసరాలు టూరిస్ట్ లకు ఒక విహార ప్రదేశంగా కూడా వుంటాయి. ఫోటో కర్టిసీ: Dhruba Jyoti Deka

జాయ్ సాగర్ ట్యాంక్

జాయ్ సాగర్ ట్యాంక్

జాయ్ సాగర్ సరస్సు ఒక అందమైన మానవ నిర్మిత సరస్సు. అహోం రాజులు దీనిని సుమారు మూడు వందల ఎకరాలలో నిర్మించారు. ఈ సరస్సు చుట్టూ అనేక దేవాలయాలు కలవు. కేసవరాయ్ విష్ణు దాల్ లేదా జాయ్ దాల్, దేవి ఘర్, బైద్యనాత్ శివ దాల్, శ్రీ సూర్య మందిర్, ఘనశ్యాం దాల్ లేదా నాటి గోసి దాల్, గణేష్ మందిర్ లు గా ఇవి ప్రసిద్ధి కెక్కాయి. ఇవి అన్నీ సరస్సుకు ఉత్తర దిశగా కలవు.
ఫోటో కర్టిసీ: Chanchal Rungta

కారెంగ్ ఘర్

కారెంగ్ ఘర్

కారెంగ్ ఘర్ భవనం ఏడు అంతస్తులు కలిగి వుంటుంది. దీనిలో మూడు అంతస్తులు అండర్ గ్రౌండ్ లో వుండగా, మిగిలినవి భూమికి పై భాగంలో ఉంటాయ్. దీనిని తలాతల్ ఘర్ అని కూడా అంటారు. పై అంతస్తు రూఫ్ ఒక డోమ్ ఆకారంలో ఆకర్షణీయంగా వుంటుంది. దీనిపై ఒకప్పుడు నాలుగు వాచ్ టవర్లు కలవు. ఇపుడు రెండు మాత్రమే మిగిలాయి. అందమైన ఈ నిర్మాణం శివసాగర్ కు 15 కి. మీ. ల దూరంలో కలదు. ఫోటో కర్టిసీ: Aniruddha Buragohain

పాణి దైహింగ్ బర్డ్ సాన్క్చురి

పాణి దైహింగ్ బర్డ్ సాన్క్చురి

పాణి దైహింగ్ బర్డ్ సాన్క్చురి శివ సాగర్ టవున్ కు 22 కి. మీ. ల దూరంలో కలదు. సుమారు 33 కి. మీ. ల విస్తీర్ణంలో ఈ పక్షి ఆశ్రమం కలదు. ఇక్కడకు ప్రతి సంవత్సరం అనేక జాతుల వలస పక్షులు వచ్చి ఆశ్రయం తీసుకుంటాయి. 1996 లో దీనిని వన్య జంతువుల అభయారణ్యంగా ప్రకటించారు. ఇక్కడ కల అనేక రకాల పక్షులు ఒక గొప్ప పర్యాటక ఆకర్షణ.

ఫోటో కర్టిసీ: Ron Knight

శివ దాల్ లేదా శివాలయం

శివ దాల్ లేదా శివాలయం

శివ దాల్ దేవాలయం శివ సాగర్ సరస్సు ఒడ్డున అధిక ఎత్తైనదిగా కనపడుతుంది. భూమి నుండి ఈ దేవాలయం ఎత్తు 59 మీ. గా నిర్మించారు. ఇండియా లోనే అతి పొడవైన శివ దేవాలయంగా చెప్పబడుతుంది. ఈ దేవాలయం గోపురం పై భాగంలో ఎనిమిది అడుగుల ఎత్తు కల ఒక బంగారు డోమ్ అహోం రాజుల కాలంనాటి పనివారాల కళా నైపుణ్యం చాటుతుంది. శివరాత్రి సందర్భంగా ఇక్కడకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఉత్సవాలు అతి వైభవంగా నిర్వహిస్తారు. శివదాల్ సమీపంలోని దేవి దాల్ మరియు విష్ణు దాల్ అనే దేవాలయాలు కలవు. ఇవి కూడా పర్యాటకులకు గొప్ప ఆకర్షణలు. దేవాలయాల సముదాయ ప్రదేశంలో అహోం రాజుల కాలంనాటివి భద్ర పరచిన కొన్ని ఫిరంగులను కూడా ఇక్కడ చూడవచ్చు.

తలాతాల్ ఘర్

తలాతాల్ ఘర్

తలాతాల్ ఘర్ శివ సాగర్ పట్టణ పొలిమేరలలో కలదు. ఇది అహోం రాజుల రాజ భవనం. అహోం రాజుల కాలంనాటి శిల్ప కళా వైభవాలు ఈ భవనం ప్రదర్శిస్తుంది. ఏడు అంతస్తులు కల ఈ భవనం ఒకప్పుడు అహోం పాలకుల సేవకులకు కుటుంబాలకు గొప్ప నివాస భవనంగా వుండేది. ఇక్కడ కల ఫిరంగులు, మెట్ల వరుసలు, పాలస్ టేర్రసు లు పర్యాటక ప్రసిద్ధి. అస్సాం పర్యటన లో అహోం రాజుల వైభవం చూపే ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా ఇక్కడకు టూరిస్ట్ లు అధిక సంఖ్యలో వచ్చి ఆనందిస్తారు.

ఫోటో కర్టిసీ: D. Konwar

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+