Search
  • Follow NativePlanet
Share
» »ఆరు రోజుల‌పాటు సాగే వైజాగ్ టు థాయ్‌లాండ్ టూర్ ప్యాకేజీ..

ఆరు రోజుల‌పాటు సాగే వైజాగ్ టు థాయ్‌లాండ్ టూర్ ప్యాకేజీ..

విశాఖ‌న‌గ‌ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్‌...వైజాగ్ నుంచి నేరుగా థాయ్ లాండ్ వెళ్లాలని అనుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. IRCTC టూరిజం పర్యాట‌కుల కోసం ఇప్పటికే అనేక ప్యాకేజీలను తీసుకొచ్చినప్ప‌టికీ..ఈ ప్యాకేజీ మాత్రం అతి త‌క్కువ ధ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఐఆర్‌సిటిసి ట్రైన్ తో పాటు ఫ్లైట్ టూర్ ప్యాకేజీలు కూడా అందిస్తోంది. అయితే, థాయ్ లాండ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ఈసారి ప‌ర్యాట‌కుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 7, 2024వ తేదీన ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంటుంది. ఇందుకు సంంబధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం..

వైజాగ్ టూ థాయ్లాండ్ టూర్ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి..

IRCTC టూరిజం ప‌ర్యాట‌కుల కోసం వైజాగ్ నుంచి థాయ్లాండ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ MAGICAL THAILAND EX VISHAKHAPATNAM పేరుతో ఈ ప్యాకేజీని ఐఆర్‌సిటిసి ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీలో భాగంగా ఐదు రాత్రులు, ఆరు ప‌గ‌ళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీ వైజాగ్ నుంచి ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ స‌రికొత్త టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 7, 2024వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ ప్యాకేజీలో భాగంగా 0మొద‌టి రోజు విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ప్ర‌యాణం మొద‌లవుతుంది. ముందుగా బ్యాకాంక్ కు (Flight No. FD-117) చేరుకుంటారు. ఆ త‌ర్వాత మ‌రుస‌టి రోజు పట్టాయాకు వెళ్తారు.

thailandtourpackage1

ధ్యాహ్నం భోజ‌నం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంత‌రం Nong Nooch Garden ప‌ర్య‌ట‌న ఉంటుంది. ఆ రోజు రాత్రంతా పట్టాయాలోనే గడుపుతారు. ఇక‌, మూడో రోజు అల్పాహారం ముగించుకున్న తర్వాత Coral Island Tourకు బ‌య‌లుదేరుతారు. ఈ ప్రాంతానికి స్పీడ్ బోట్ ద్వారా చేరుకుంటారు. అనంత‌రం అక్క‌డి నుండి తిరిగి పట్టాయాకు వస్తారు. నాలుగ‌వ రోజు సఫారీ ప‌ర్య‌ట‌న ఉంటుంది. అనంత‌రం అక్క‌డి నుండి బ్యాంకాక్ కు చేరుకుంటారు. అక్క‌డి ప్రసిద్ధిచెందిన పలు ప్రాంతాలను సందర్శిస్తారు.

ఐదో రోజు బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత‌, Half day City Tour ఉంటుంది. ఈ టూర్‌లో భాగంగా గోల్డెన్ బుద్దాను వీక్షిస్తారు. ఆ త‌ర్వాత అక్క‌డి ఇండియన్ రెస్టారెంట్‌లో మ‌ధ్యాహ్నం భోజ‌నం చేస్తారు. అనంత‌రం Shri Racha Tiger Zooకి బ‌య‌లుదేరుతారు. ఇక‌, ఆరో రోజు ఉద‌యం Grand Palaceను సందర్శిస్తారు. లంచ్ తర్వాత తిరిగి సాయంత్రం ఆరు గంటలకు బ్యాంకాక్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అదే రోజు రాత్రి 10.20 గంటలకు విశాఖకు చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ఈ టూర్ ప్యాకేజీ ధ‌ర‌ల వివ‌రాలు..

టికెట్ ధరలు వివ‌రాలు చూస్తే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 66735 చెల్లించాలి. అదే డబుల్ ఆక్యుపెన్సీకయితే రూ. 57815 చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 57815గా నిర్ణయించారు.ఇక‌, ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ అందులోనే కవర్ అవుతాయి. ప్ర‌యాణికులు ఇత‌ర పూర్తి వివ‌రాల కోసం మ‌రియు బుకింగ్ కోసం ఈ వెబ్‌సైట్‌ను https://www.irctctourism.com/ స‌ంప్ర‌దించ‌గ‌ల‌రు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+