Search
  • Follow NativePlanet
Share
» »కేదార్ నాథ్, బద్రీనాథ్ ద‌ర్శనం కోసం స్పెష‌ల్ టూర్‌ ప్యాకేజీ..!

కేదార్ నాథ్, బద్రీనాథ్ ద‌ర్శనం కోసం స్పెష‌ల్ టూర్‌ ప్యాకేజీ..!

దేశంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని దైవ‌భూమిగా కొలుస్తుంటారు. ఎందుకంటే ఇక్క‌డ ఎటు చూసిన మీకు ఆధ్యాత్మిక ప్ర‌దేశాలే క‌నిపిస్తాయి. ప్రముఖ పుణ్య క్షేత్రాలకు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోంది ఈ ప్రాంతం. ఈ రాష్ట్రంలోని కేదార్ నాథ్, బద్రీనాథ్, గుప్తకాశీ, కార్తీక్ కోవిల్ దర్శనం చేసుకోవాల‌నుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందిస్తోంది.

ఈ టూర్ ప్యాకేజీ భారత్ గౌరవ్ ట్రైన్ నడుపుతోంది. ఈ ప్యాకేజీలో భాగంగా ట్రైన్ జ‌ర్నీ చేయాల్సి ఉంటుంది. మధురై నుంచి బయలుదేరే ఈ ట్రైన్ రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్ర‌యాణిస్తుంది. ఈ టూర్ మొత్తం 13 రోజుల పాటు ఉంటుంది. కేదార్-బద్రీ-కార్తీక్ యాత్ర పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. భారత్ గౌరవ్ రైలు తెలుగు రాష్ట్రాల్లో గూడూరు, విజయవాడ, వరంగల్ మీదుగా వెళ్తుంది. ఈ టూర్ జూన్ 20న ప్రారంభ‌మ‌వుతుంది.

ఈ టూర్ ప్యాకేజీ ధ‌ర‌లు..

సింగిల్/డబుల్/ట్రిపుల్- పిల్లలు (5-11 సంవత్సరాలు)

స్టాండర్డ్ రూ. 58,946/- రూ. 58,946/-

డీలక్స్ రూ. 62,353/- రూ. 62,353/-

kedarnath packages

టూర్ షెడ్యూల్‌..

మొద‌టి రోజు 20.06.2024 (గురువారం) తమిళనాడులోని మధురై నుంచి సాయంత్రం 8.00 గంటలకు రైలు ప్రయాణం ప్రారంభమవుతుంది. రెండో రోజు ఉదయం 06.00 గంటలకు చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో బోర్డింగ్ ఉంటుంది. ఆ త‌ర్వాత మూడోరోజు రైలు ప్ర‌యాణం ఉంటుంది. అనంత‌రం నాలుగోరోజు ఉద‌యం 8 గంట‌ల‌కు యోగ్ నగరి రిషికేశ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఆ నైటంతా రిషికేశ్‌లోనే ఉంటారు. అనంత‌రం మ‌రుస‌టిరోజు పర్యాటకులంతా క‌లిసి రుద్రప్రయాగకు బ‌య‌లుదేరుతారు. టూరిస్టుల‌ను మొత్తం మూడు భాగాలుగా విభ‌జిస్తారు. అందులో గ్రూప్ ఎ, గ్రూప్ బి, గ్రూప్ సి ఉంటారు. గ్రూప్ ఏ వారు

రుద్రప్రయాగ నుంచి గుప్తకాశీ, అక్కడ నుంచి కేదార్‌నాథ్ వరకు హెలీకాఫ్టర్ లో బ‌య‌లుదేరుతారు. తిరిగి గుప్తకాశీ నుంచి హెలీకాఫ్టర్ లో రుద్రప్రయాగకు చేరుకుంటారు. గ్రూప్ బి వారు రుద్రప్రయాగ నుంచి కార్తీక స్వామి దేవాలయం, గుప్తకాశీ వరకు రోడ్డు ప్ర‌యాణం చేస్తారు. గ్రూప్ సి వారు రుద్రప్రయాగ నుంచి జోషిమఠానికి వెళ్తారు. ఆ మ‌రుస‌టి రోజు గ్రూప్ ఏ వారు రుద్రప్రయాగ నుంచి కార్తీక స్వామి దేవాలయం వెళ్తారు. తిరిగి రుద్రప్రయాగకు చేరుకుంటారు. గ్రూప్ బి వారు గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్‌కి హెలీకాఫ్టర్ లో వెళ్తారు. తిరిగి గుప్తకాశీ, తర్వాత రుద్రప్రయాగకు చేరుకుంటారు.

ఇక‌, గ్రూప్ సి వారు జోషిమఠ్ నుంచి బద్రీనాథ్, అక్కడి నుంచి జోషిమఠ్, రుద్రప్రయాగకు తిరిగి వస్తారు. ఆ మరుస‌టి రోజు గ్రూప్ ఏ స‌భ్యులు రుద్రప్రయాగ నుంచి జోషిమఠానికి వెళ్తారు. ఆ త‌ర్వాత గ్రూప్ బీ వారు రుద్రప్రయాగ నుంచి జోషిమఠ్115 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేస్తారు. అనంతరం గ్రూప్ సి స‌భ్యులు రుద్రప్రయాగ నుంచి గుప్తకాశీ అక్కడి నుంచి కేదార్‌నాథ్ వరకు హెలీకాఫ్టర్ లో వెళ్తారు. తిరిగి గుప్తకాశీకి, రుద్రప్రయాగకు వెళ్తారు. ఆ మ‌రుస‌టి రోజు (28.06.2024 శుక్రవారం) గ్రూప్ ఏ వారు జోషిమఠ్ నుంచి బద్రీనాథ్ వెళ్తారు. తిరిగి జోషిమఠ్ చేరుకుంటారు.

ఆ త‌ర్వాత గ్రూప్ బి స‌భ్యులు జోషిమఠ్ నుంచి బద్రీనాథ్ పంద‌ర్శించుకుని తిరిగి జోషిమఠ్ చేరుకుంటారు. గ్రూప్ సి స‌భ్యులు రుద్రప్రయాగ నుంచి కార్తీక స్వామి ఆలయానికి వెళ్తారు. తిరిగి రుద్రప్రయాగకు చేరుకుంటారు. 29.06.2024 (శనివారం) గ్రూప్ ఏ స‌భ్యులు తిరుగు ప్రయాణం కోసం జోషిమఠ్ నుంచి రిషికేశ్ చేరుకుంటారు. గ్రూప్ బి స‌భ్యులు తిరుగు ప్రయాణం కోసం జోషిమత్ నుంచి రిషికేశ్‌కు బ‌య‌లుదేరుతారు. గ్రూప్ సి సభ్యులు తిరుగు ప్రయాణం కోసం రుద్రప్రయాగ నుంచి రిషికేశ్ చేరుకుంటారు. 30.07.2024 తేదీన తిరుగు ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. 01.07.2024 న టూరిస్టులు చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కు చేరుకుంటారు. ఆ మరుస‌టి రోజు (02.07.2024) మధురై చేరుకుంటారు. దీంతో వీరి టూర్ ముగుస్తోంది.

More News

Read more about: madurai rishikesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+