Search
  • Follow NativePlanet
Share
» »రాయల్‌ రాజస్థాన్ పేరుతో ఐఆర్‌సిటిసి వారి స్పెషల్ టూర్ ప్యాకేజీ..

రాయల్‌ రాజస్థాన్ పేరుతో ఐఆర్‌సిటిసి వారి స్పెషల్ టూర్ ప్యాకేజీ..

భార‌త్‌లో ప్ర‌సిద్ధిచెందిన కోట‌లు, పురాత‌న క‌ట్ట‌డాల‌కు కొద‌వే లేదు. అందులో ముఖ్యంగా రాజస్థాన్ పేరు వినగానే చాలామందికి ఇక్క‌డి కోటలు, ప్యాలెస్‌లు, సరస్సులు మాత్ర‌మే గుర్తొస్తాయి. రాజ‌స్థాన్ రాజ‌సం చూడాల‌నుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ హైద‌రాబాద్ నుంచి ప్రారంభ‌మ‌వుతంది. ఇది విమాన ప్ర‌యాణం. ఇక్క‌డి ప్ర‌సిద్ధ ప్ర‌దేశాల‌ను చూడాల‌నుకునేవారికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ అందుబాటు ధరలోనే స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

ఐఆర్​సీటీసీ టూరిజం "'రాయల్‌ రాజస్థాన్‌ (ROYAL RAJASTHAN)" పేరుతో ఈ ప్యాకేజీని ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌తో పాటూ ఉదయ్‌పూర్‌, జోధ్‌పూర్‌ వంటి నగరాలను కూడా వీక్షించొచ్చు. మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లతో ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది.

rajasthan

ఆరు రోజుల షెడ్యూల్ వివ‌రాలు..

ఈ టూర్‌లో భాగంగా హైదరాబాద్‌ ఎయిర్​పోర్ట్​ నుంచి తెల్లవారుజామున 4:45గంటలకు విమాన ప్ర‌యాణం ప్రారంభ‌మ‌వుతుంది. మొత్తం రెండు గంటల్లో జైపూర్ ఎయిర్‌పోర్టును చేరుకుంటారు. అనంత‌రం అక్కడి నుంచి హోటల్​కు వెళ్తారు. అక్క‌డ ప్రెష్ అయ్యాక జైపూర్​ సిటీ ప్యాలెస్​ సంద‌ర్శ‌న ఉంటుంది. ఆ త‌ర్వాత హోటల్​కు చేరుకుని మ‌ధ్యాహ్నం భోజ‌నం పూర్తి చేస్తారు. ఆత త‌ర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంత‌రం అమేర్‌ ఫోర్ట్ చూసేందుకు సిద్ధ‌మ‌వుతారు. తిరిగి అదే హోటల్‌లో భోజనం చేస్తారు. అక్క‌డే ఉండాల్సి ఉంటుంది. మ‌రుస‌టిరోజు (2వ రోజు) మార్నింగ్ అల్పాహారం ముగించుకుని హోటల్ నుంచి చెక్ అవుట్ అవ‌తారు. అక్క‌డినుంచి పుష్క‌ర్‌కు ప్ర‌యాణం ఉంటుంది.

udaipur

పుష్కర్​ ఆలయ సంద‌ర్శ‌నం అనంత‌రం సమయం ఉంటే షాపింగ్‌ చేసుకోవచ్చు. డిన్న‌ర్, స్టేయింగ్ అక్క‌డే ఉంటుంది. మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత జోధ్‌పూర్ సంద‌ర్శ‌న ఉంటుంది. అక్క‌డి మెహ్రాన్‌ఘర్ కోటను వీక్షిస్తారు. ఆ తర్వాత హోటల్​లో చెకిన్ అవుతారు. రాత్రంతా అక్క‌డే స్టే చేస్తారు. నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ పూర్త‌య్యాక‌ హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి ఉమైద్ భవన్ ప్యాలెస్ సంద‌ర్శ‌న‌కు వెళ్తారు. అక్కడి నుంచి రణక్​ పూర్​ ప్ర‌యాణం ఉటుంది. ఆ త‌ర్వాత జైన దేవాలయ ద‌ర్శ‌నం ఉంటుంది. అక్కడి నుంచి ఉదయ్​పూర్​ ప్ర‌యాణం.. ఇక‌, ఐదో రోజు హోటల్​కు వెళ్లాక బ్రేక్​ఫాస్ట్​ చేసి సిటీ ప్యాలెస్​ అందాలను చూసేందుకు బ‌య‌లుదేరుతారు. అక్కడ స్టాచ్యూ ఆఫ్​ బిలీఫ్ దర్శ‌నం ఉంటుంది. ఆ రోజు రాత్రి ఉదయపూర్‌ హోటల్‌లో డిన్నర్​ చేస్తారు. రాత్రి స్టేయింగ్ కూడా అక్క‌డే. ఇక‌, ఆరో రోజు బ్రేక్​ఫాస్ట్​ త‌ర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అవుతారు. అక్క‌డినుంచి సహేలియోన్‌ కీ బరీ సంద‌ర్శ‌న‌కు వెళ్తారు. అనంత‌రం తిరుగు ప్ర‌యాణంలో భాగంగా విమాన‌శ్ర‌యానికి ప‌య‌న‌మ‌వుతారు. అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో ఈట్రిప్ ముగుస్తుంది.

jaipur

ప్యాకేజ్ ధ‌ర‌లివే..

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా వీటి ధ‌ర‌ల‌ను ఓసారి ప‌రిశీలిస్తే.. సింగిల్‌ షేరింగ్​కు రూ.41,950 చెల్లించాల్సి ఉంటుంది. అదే డబుల్​ షేరింగ్‌ అయితే రూ.32,900 చెల్లించాలి. ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ.31,650 చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకయితే ఒకరికి విత్‌ బెడ్‌ అయితే రూ.28,650గా నిర్ణ‌యించారు. విత్‌ అవుట్‌ బెడ్‌ అయితే రూ.25,500 ఉంటుంది.

ఇక‌పోతే, 2-4 సంవత్సరాల మధ్య చిన్నారులకు రూ.19,400 గా నిర్ణ‌యించారు. ప్రస్తుతానికి ఈ టూర్ ప్యాకేజీ​ సెప్టెంబర్​ 23న ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్యాకేజీ బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు. ప్యాకేజీలో 6 బ్రేక్​ఫాస్ట్​లు, 5 లంచ్​, 5 డిన్నర్​లు ఉంటాయి.పర్యాటక ప్రదేశాలు చూసేందుకు ఏసీ బస్సు ప‌ర్యాట‌కులకు అందుబాటులో ఉంటుంది. ప్యాకేజీలో ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం కూడా ఉంటుంది. ఐఆర్‌సీటీసీ టూర్‌ గైడ్​ కూడా అందుబాటులో ఉంటారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+