దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రం లో (త్రిచీ గా పిలువబడే) తిరుచిరాపల్లి లోని అందమైన, ముగ్ధ పరచే ద్వీప నగరం శ్రీరంగం. ప్రాచీనకాలంలో శ్రీరంగాన్ని వేల్లితిరు ముతగ్రామం అని పిలిచే వారు. తమిళ భాష లో ఈ నగరాని తిరువరంగం అనేవారు. కావేరి - కొల్లిదం (కావేరి ఉపనది) నదుల మధ్య శ్రీరంగం వుంది.
దేవతల నివాసం

దేవతల నివాసం
ప్రసిద్ధ శివ, విష్ణ్వాలయాలు వుండడం వల్ల శ్రీరంగపట్నం హిందువులకు ప్రధాన పర్యాటక స్థానం. నిజానికి శ్రీరంగంలో విష్ణ్వారాధకులైన శ్రీవైష్ణవుల జనాభా ఎక్కువ.ఇక్కడి ప్రసిద్ధ దేవాలయాల్లో శ్రీ రంగనాధ స్వామి దేవాలయం ఒకటి.
Image source: commons.wikimedia.org

దేవతల నివాసం
ప్రతి ఏటా విష్ణువు అనుగ్రహం కోసం అనేక మంది హిందూ భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద హిందూ దేవాలయం గా ఇది ప్రసిద్ది పొందింది. దీన్ని 631000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 4 కిలొమీటర్లు లేక 10,710 అడుగుల చుట్టు కొలతతో నిర్మించారు.
Image source: commons.wikimedia.org

దేవతల నివాసం
విష్ణు భగవానుని ఎనిమిది దేవాలయాల్లో మొదటి ఆలయం కలిగి వుండడం శ్రీరంగం ప్రత్యేకత. హిందూ పురాణాల ప్రకారం ఇవన్నీ స్వయంభూ క్షేత్రాలే. విష్ణు భగవానుని 108 దివ్యక్షేత్రాలలో ఇదే మొదటిదిగా భావిస్తారు.
Image source: commons.wikimedia.org

దేవతల నివాసం
ఈ విష్ణ్వాలయం చాలా పెద్దది - 156 ఎకరాల విస్తీర్ణం లో దీన్ని నిర్మించారు. ఈ నిర్మాణం వున్న ప్రదేశం కూడా కావేరి కోలేరూన్ నదుల మధ్య వున్న ద్వీప ప్రాంతంలో వుంది.
Image source: commons.wikimedia.org

దేవతల నివాసం
ఈ గుడికి ఏడు ప్రాంగణాలు వుంటాయి - ప్రాకారాలు గా స్థానికంగా పిలిచే వీటి గుండా భక్తులు నడుచుకుంటూ లోపలి వెళ్తారు. ఈ ప్రాకారాలు కూడా ప్రధాన ఆలయం చుట్టూ వృత్తాకారంలో నిర్మించిన దట్టమైన పెద్ద గోడలు గా వుంటాయి. ఈ ప్రాకారాల్లో 21 పెద్ద శిఖరాలు కూడా వున్నాయి. ఈ ప్రాకారాలతో వున్న ఈ గుడి నిర్మాణ పరంగా ఒక అధ్బుతమే.
Image source: commons.wikimedia.org

దేవతల నివాసం
విష్ణ్వాలయమే కాకుండా శ్రీరంగం లో మరో మూడు ప్రముఖ దేవాలయాలు వున్నాయి. వీటిని కూడా కావేరి నది ఒడ్డున నిర్మించారు.
Image source: commons.wikimedia.org

దేవతల నివాసం
శ్రీరంగపట్నం లోని ఆది రంగ దేవాలయం, (శివనసముద్రం లోని) మధ్య రంగ దేవాలయం, (శ్రీరంగం లోని) అంత్య రంగ దేవాలయం - ఈ మూడు దేవాలయాలు కూడా రంగనాథుని ప్రధాన ఆలయాలుగా పరిగణిస్తారు.
Image source: commons.wikimedia.org

దేవతల నివాసం
రాక్ ఫోర్ట్ దేవాలయం, తిరువానై కోవిల్, ఉరైయూర్ వెక్కలి అమ్మన్ దేవాలయం, సమయపురం మరియంమన్ దేవాలయం, కుమారా వైయలూర్ దేవాలయం, కాటాళగియా సింగర్ దేవాలయం ఈ చుట్టుపక్కల వున్న ప్రసిద్ధ దేవాలయాల్లో కొన్ని.
Image source: commons.wikimedia.org

దేవతల నివాసం
అప్పల రంగనాథార్ ప్రధాన దైవంగా వుండే శ్రీ వడివలగియ నంబి దేవాలయం ఇక్కడి ప్రధాన విష్ణ్వాలయం - దీన్నే అప్పుకుడత్తన్ దేవాలయ౦ అని కూడా అంటారు.
Image source: commons.wikimedia.org

దేవతల నివాసం
శ్రీరంగం పట్టణానికి దగ్గర లోని కోవిలడి గ్రామంలో ఈ దేవాలయం వుంది. శ్రీరంగానికి దగ్గరలోని మరో ప్రసిద్ధ విష్ణ్వాలయం ట్రిచీ కి సమీపంలో వుంది. శ్రీ రంగనాథ స్వామి దేవాలయం లో భాగమైన అళగియ నంబి దేవాలయం ఇది.
Image source: commons.wikimedia.org

దేవతల నివాసం
పట్టణం లోను, చుట్టూ పక్కలా ఇన్ని దేవాలయాలు వున్న శ్రీరంగం చాలా మంది యాత్రికులను ఆకర్షించడం లో ఆశ్చర్యం ఏముంది.
శ్రీరంగనాధ స్వామి దేవాలయం, సమయపురం మారియంమన్ దేవాలయం, జంబు లింగేశ్వర దేవాలయం, అఖిలా౦డేశ్వరి దేవాలయం శ్రీరంగంలోని ఇతర ప్రధాన దేవాలయాలు.
Image source: commons.wikimedia.org

దేవతల నివాసం
ఎపుడు ఎలా వెళ్ళాలి !
వేడి వేసవి నెలలు౦డే కాలంలో ఈ ప్రాంతం ఒక మోస్తరు వర్షపాతం కలిగి వుంటుంది. శీతాకాలాలు బాగా చల్లగా కాకుండా ఆహ్లాదకరంగా వుంటాయి. శ్రీరంగం లో రైల్వే స్టేషన్ వుంది - రోడ్డు ద్వారా వెళ్ళే వారు ట్రిచీ వెళ్ళే బస్సు ఎక్కవచ్చు. మదురై ఇక్కడికి సమీప విమానాశ్రయం.



Click it and Unblock the Notifications











