Search
  • Follow NativePlanet
Share
» »భారత చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు...ఈ స్మారక చిహ్నాలు..

భారత చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు...ఈ స్మారక చిహ్నాలు..

భారతదేశం అపారమైన చారిత్రక వైభవాన్ని, ఘనమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని కలిగింది. ఈ దేశం ఎన్నో అద్భుతమైన కట్టడాలు, అపురూపమైన కళాఖండాలకు నిలయంగా ఉంది. దేశంలో ఊహకందని రీతిలో పురాతనకాలంలోనే నిర్మించిన ఎన్నో ఆశ్చర్యకరమైన స్మారక చిహ్నాలు నేటికి జీవకళ ఉట్టిపడేలా దర్శనమిస్తున్నాయి. భార‌త‌దేశంలోని పురాత‌న‌మైన స్మార‌క చిహ్నాలను మ‌నం ఇప్పుడు చూస్తున్నాం..

నేటికీ భారతదేశంలో వేల సంవత్సరాల నాటి స్మారక చిహ్నాలు ఇప్ప‌టికీ మ‌నకు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అనేక స్మారక చిహ్నాలలో ప‌లు చిత్రాల షూటింగ్‌లు కూడా చిత్రీకరించబడ్డాయి. ఇలాంటి ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించేందుకు చాలామంది ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. మీరు కూడా ఈ స్మారక చిహ్నాలను చూడాలని ఆసక్తి కలిగి ఉంటే మాత్రం మొఘల్ పాలనలో నిర్మించిన ఈ స్మారక కట్టడాల గురించి త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిందే..

హుమాయున్ సమాధి

ఢిల్లీకి స‌మీపంలో నివ‌సిస్తున్న వారయితే మాత్రం.. ఇక్క‌డి అతి పురాత‌న‌మైన స్మార‌క క‌ట్ట‌డ‌మైన హుమాయున్ సమాధిని త‌ప్ప‌క వీక్షించాల్సిందే. ఎర్ర రాతితో చేసిన ఈ కట్టడాలు తాజ్ మహల్ లాగా కనిపిస్తాయి. ఈ స్మార‌క క‌ట్ట‌డాన్నీ వీక్షించేందుకు ఎటువంటి టిక్కెట్ అవ‌స‌రం లేదు. హుమాయున్ సమాధిని అక్బర్ నిర్మించాడు. ఇది 30 ఎకరాల్లో విస్తరించి ఉంది.

humayunstomb2

ఎర్రకోట

ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవం నాడు దేశ ప్రధాని ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఎర్రకోటను మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాత ఢిల్లీలో నిర్మించాడు. ఇది ఎర్ర బుల్లా రాతితో నిర్మించబడింది. ఈ కోట రంగు ఎరుపు. ప్రతి రోజు సాయంత్రం ఇక్క‌డ మీనా బజార్ జ‌రుగుతుంది. ఇక్క‌డ రూ. 100 నుండి రూ. 1000 వరకు చాలా ఆకర్షణీయమైన వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఎర్రకోటకు వెళ్లాలంటే త‌ప్ప‌కుండా టిక్కెట్టు తీసుకోవాల్సిందే. ఈ స్మార‌క క‌ట్టడం సుమారు 250 ఎకరాల స్థలంలో నిర్మించబడింది.

తాజ్ మహల్

తాజ్ మహల్ గురించి తెలియని ప‌ర్యాట‌కులు ఎవ‌రూ ఉండ‌రు. ఈ అద్భుత‌మైన క‌ట్ట‌డాన్ని వీక్షించేందుకు కేవలం దేశీయులు మాత్ర‌మే కాదు విదేశాల నుంచి కూడా చాలామంది పర్యాట‌కులు త‌ర‌లివ‌స్తుంటారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం తెల్లని పాలరాతితో దీనిని నిర్మించాడని నమ్ముతారు. ఈ నిర్మాణం మొత్తం 42 ఎకరాల స్థలంలో విస్త‌రించి ఉంటుంది. తాజ్ మహల్ 7 అద్భుతాలలో ఒకటిగా పేరుగాంచింది. ఇంత‌టి అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు చాలామంది ప‌ర్యాట‌కులు త‌ర‌లి వస్తుంటారు. తాజ్ మహల్‌ను వీక్షించేందుకు ప్ర‌వేశ టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

jamamasjid

జామా మసీదు

దేశంలోని మ‌రో అద్భుత‌మైన స్మార‌క క‌ట్ట‌డాల‌లో మొఘల్ షాజహాన్ నిర్మించిన జామా మసీదు ఒక‌టి. 1650లో దీని మసీదు నిర్మాణం ప్రారంభమైంది. ఈద్ సందర్భంగా పాత ఢిల్లీలో ఉన్న జామా మసీదు వైభవాన్ని ప‌ర్యాట‌కులు వీక్షించొచ్చు. నమాజ్ ఇఫ్తారీ అందించే సమయంలో ఇక్క‌డ‌ వేలాది మందిని చూడొచ్చు. ఇది 65 మీటర్ల పొడవు, 35 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద మసీదుగా ప్ర‌సిద్ధిచెందింది. ముస్లిం సమాజానికి, ఈ ప్రదేశం మక్కా మరియు మదీనా కంటే తక్కువేమీ కాదు. జామా మసీదులోకి ప్రవేశించడానికి ఎటువంటి ప్ర‌వేశ రుసుము అవసరం లేదు. కానీ సాయంత్రం సమయంలో ఇక్క‌డ అమ్మాయిలకు ప్రవేశం ఉండదు.

agrafort1

ఆగ్రా కోట

ఆగ్రాలోని తాజ్ మహల్ కాకుండా "ఆగ్రా ఫోర్ట్" కూడా చాలా ప్రసిద్ధి చెందిన స్మార‌క క‌ట్ట‌డం. దీనిని అక్బర్ నిర్మించాడు. ఈ స్మారక కట్టడాలు 94 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ కోట మొఘల్ రాజవంశపు చక్రవర్తుల ప్రధాన నివాసంగా నిలిచింది. తాజ్ మహల్ సందర్శించడానికి వెళ్లిన‌ప్పుడు త‌ప్ప‌కుండా ఆగ్రాలోని ఈ కోట‌ను వీక్షించొచ్చు. తాజ్ మహల్‌కు స‌మీపంలోనే ఆగ్రా కోట ఉంటుంది. కాబ‌ట్టి త‌ప్ప‌కుండా ఈ కోట అందాల‌ను చూడండి.

More News

    Read more about: mughal monuments travel guide
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+