Search
  • Follow NativePlanet
Share
» »Street Food of Ayodhya: అయోధ్య‌లో ప్ర‌సిద్ధిచెందిన వీధి వంట‌కాలివే..

Street Food of Ayodhya: అయోధ్య‌లో ప్ర‌సిద్ధిచెందిన వీధి వంట‌కాలివే..

అయోధ్య పేరు విన‌గానే చాలామందికి రామ‌మందిరం గుర్తుకొస్తుంది. హిందువుల ఎన్నోయేళ్ల క‌ల నేర‌వేరేందుకు మ‌రికొన్ని రోజులు మాత్రమే సమ‌యం ఉంది. అయోధ్యలో ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్క‌డి స్ట్రీట్ ఫుడ్ కూడా ప‌ర్యాట‌కుల‌కు ఎంత‌గానో న‌చ్చుతుంది. అయితే ఈ నగరం అనేక ఇతర విషయాలకు కూడా ప్రసిద్ధి చెందింది. అందులో ఒకటి ఇక్కడి ఆహారం. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకసారి వాటిని రుచి చూస్తే మిమ్మ‌ల్ని మీరే మైమ‌రిచిపోవ‌డం ఖాయం. వీటిని రుచి చూడకుండా అయోధ్య సందర్శన అసంపూర్ణమ‌నే చెప్పుకోవాలి.

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా అయోధ్య పేరే వినిపిస్తోంది. ఎందుకంటే జనవరి 22న ఇక్కడ రామమందిర శంకుస్థాపన కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. ఈ రోజున అయోధ్య‌లోని రామాలయంలో రాంలాలా విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న జ‌ర‌గ‌బోతుంది. ఈ మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి రాజకీయాల నుంచి క్రీడలు, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. అంతేకాకుండా, ఈ కార్య‌క్ర‌మం కోసం 55 దేశాల నుండి సుమారు 100 మంది ప్రత్యేక వ్యక్తులకు కూడా ఆహ్వానాలు అందాయి.

అయోధ్య, విశ్వాసాల నగరం. ఇది కేవ‌లం రామ మందిరానికి మాత్రమే ప్రసిద్ధి చెందింది కాదు. ఇక్క‌డ ఆహారం కూడా ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక్క‌డి చిన్న బండ్లపై విక్రయించే చాట్, జిలేబీ లేదా దహీ భల్లా వంటివి ఒక్కసారి తింటే, వాటి రుచికి అభిమానుల‌వ‌డం ఖాయం. కారంగా ఉండే సుగంధ ద్రవ్యాలతో చేసిన వీటిని తినకుండా అయోధ్య పర్యటన అసంపూర్ణమ‌నే చెప్పొచ్చు. ఇక్క‌డి అద్భుత‌మైన రుచుల గురించి ఓసారి తెలుసుకుందాం ప‌దండి.

chaa1

చాట్‌

ఉత్తరప్రదేశ్‌లోని చాలా నగరాల్లోని చాట్ భిన్న‌మైన రుచిని క‌లిగి ఉంటుంది. చాట్ దేశంలోని ఏ ప్రాంతాల్లోనైనా ల‌భిస్తుంది. కానీ, అయోధ్య‌లోని చాట్ రుచి వాటికంటే భిన్నంగా ఉంటుంది. తీపి, పుల్లని చట్నీ, మసాలా చిక్‌పీస్, సుగంధ కొత్తిమీర, ఇతర మసాలా దినుసులను ఉపయోగించడం ద్వారా చాట్ రుచిని మ‌రింత పెంచొచ్చు. ఇక్క‌డి సాయంత్రం వేళ్ల‌లో జనాలు చాట్ స్టాల్స్ వద్ద గుమిగూడడం ప్రారంభిస్తారు. చలికాలంలో చాట్ తినేందుకు చాలామంది ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు.

దాల్ కచోరి

పూరీ, కచోరీలు ఉదయం పూట అత్యంత ఇష్టమైన అల్పాహారం. కచోరీలో వివిధ రకాల కూరగాయలు మరియు పప్పులు ఉప‌యోగించ‌డం జ‌రుగుతుంది. ఇక్కడ అయోధ్యలో, మూంగ్ మరియు ఉరద్ పప్పుతో చేసిన కచోరీ ఎంతో ప్రసిద్ధి చెందింది. వీటిని చట్నీ లేదా కూరగాయలతో వ‌డ్డిస్తుంటారు. వీటి రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయోధ్య‌లో చాలామంది ప‌ర్యాట‌కులు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే వాటిలో దాల్ క‌చోరి ఒక‌టి. మ‌రీ మీరు ట్రైచేయండి.

దహీ భల్లా

అయోధ్యకు వెళ్లిన‌ప్ప‌డు ఖచ్చితంగా దహీ భల్లాను రుచి చూడడం అస్స‌లు మిస్స‌వ్వ‌కండి. పప్పులతో చేసిన వడలు, పెరుగు మరియు తీపి-పుల్లని చట్నీల కలయికను చూసిన తర్వాత నోట్లో లాలాజ‌లం రావ‌డం ఖాయం. అయోధ్య‌లోని ప్ర‌తి వీధిలో ద‌హీ భ‌ల్లా ల‌భిస్తుంది.

rabdi

రబ్డి

అయోధ్యలో స్వీట్ లవర్స్ కోసం ఇక్కడ చాలా ర‌కాల వెరైటీలు ఉన్నాయి. సిరప్‌లో ముంచిన జిలేబీ అయినా లేదా నోటిలో కరిగిపోయే లడ్డు అయినా ప్ర‌తి ఒక్క స్వీట్ ఇక్క‌డ ల‌భిస్తుంది. ఇక్క‌డి వీధుల్లో అనేక ర‌కాల స్వీట్‌లు, వంట‌కాలు ల‌భిస్తాయి. వీటన్నింటితో పాటు, ఇక్కడ రబ్డీని రుచి చూడటం అస్స‌లు మర్చిపోవద్దు. అయోధ్య వంట‌కాల‌లో ప్ర‌సిద్ధిచెందిన వంట‌కం ఇదే. రబ్డీకి రకరకాల డ్రై ఫ్రూట్స్, కుంకుమపువ్వును వ‌డ్డించ‌డం జ‌రుగుతుంది. ఇది దాని రుచిని మ‌రింత రెట్టింపు చేస్తుంది. ఈ స్ట్రీట్ ఫుడ్స్‌ని రుచి చూసేందుకు పెద్దగా ఖర్చు చేయనవసరం లేదు. అతి తక్కువ డబ్బుతో ఈ అద్భుతమైన రుచులను ఆస్వాదించవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+