Search
  • Follow NativePlanet
Share
» »Summer Destination : జ‌మ్మూలోని ఈ ప్ర‌దేశాన్ని వేస‌విలో త‌ప్ప‌క సంద‌ర్శించాల్సిందే..!

Summer Destination : జ‌మ్మూలోని ఈ ప్ర‌దేశాన్ని వేస‌విలో త‌ప్ప‌క సంద‌ర్శించాల్సిందే..!

సమ్మర్‌లో ట్రావెలింగ్ అన‌గానే అంద‌రికీ ఉత్తరాఖండ్ లేదా హిమాచల్ వంటి ప్ర‌దేశాలే గుర్తుకొస్తాయి. వీటితో పాటు దేశంలో మ‌రికొన్న కూలెస్ట్ ప్లేసెస్ చాలానే ఉన్నాయి. అందులో ఒక‌టి జ‌మ్మూలోని కోకర్నాగ్‌. ఈ ప్ర‌దేశం ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ సెల‌వుల్లో జ‌మ్మూలోని ఈ ప్రాంతాన్ని త‌ప్ప‌కుండా విజిట్ చేయాల్సిందే. ప్రకృతి అందాలతో నిండిన కాశ్మీర్‌లో సాహస ప్రియులకు ఎంపికలకు కొదవలేదు. ఇక్కడ ప్రతి ప్ర‌దేశం దానిక‌దే ఓ ప్రత్యేకత‌. జ‌మ్మూలోని సోనామార్గ్, గుల్‌మార్గ్, పహల్గామ్‌లను వంటివాటిని సంద‌ర్శించి ఉంటారు. కానీ, ఈ ప్ర‌దేశం అతి త‌క్కువ ర‌ద్దీతో ఉంటుంది కోకెర్నాగ్‌. ఈ ప్ర‌దేశం ప్ర‌త్యేక‌త తెలుసుకుందాం ప‌దండి..

కోకర్నాగ్ ప్రత్యేకత...

కోకెర్‌నాగ్ జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉంది. ఇక్క‌డి వాతావ‌ర‌ణం ప‌ర్యాట‌కులకు ఎంత‌గానో న‌చ్చుతుంది. వారాంతాన్ని సరదాగా ఎంజాయ్ చేయాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఈ ప్ర‌దేశాన్ని చూడాల్సిందే. కోకర్నాగ్ ఒక ఆఫ్‌బీట్ ప్రదేశం, దీని కారణంగా నేటికీ ఈ ప్ర‌దేశం అందం చెక్కుచెదరలేదు. ఇక్కడి ప్రశాంతమైన మరియు కాలుష్య రహిత వాతావరణం ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకం చేస్తుంది. కోకర్నాగ్‌లో మంచినీటి బుగ్గలు మరియు పచ్చని తోటలను ఎంత‌గానో ప్రసిద్ధిచెందాయి. వీటితో పాటు దూరంగా ఉన్న పచ్చిక బయళ్లు కూడా ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటాయి. ఇది ఫోటోగ్రఫీకి అనువైన ప్ర‌దేశం.

sonmarg

కోకర్నాగ్ లో చూడదగ్గ ప్రదేశాలు..

కోకర్నాగ్ రోజ్ గార్డెన్..

కోకర్నాగ్‌లోని రోజ్ గార్డెన్ ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. కోకర్నాగ్ సంద‌ర్శించిన‌ప్ప‌డు త‌ప్ప‌కుండా రోజ్ గార్డెన్‌ను వీక్షించాల్సిందే. భారతదేశం మరియు విదేశాల నుండి ప్రతిరోజూ వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ తోటలో అనేక రకాల గులాబీలు ఉన్నాయి. వాటిని మీమీ కెమెరాల్లో బంధించ‌డ‌మే కాకుండా, వాటి గురించి తెలుసుకునే అవకాశం కూడా ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ తోటను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉద్యానవనంలోని కాలువ మరియు దానిపై నిర్మించిన వంతెన ఈ ప్రదేశం యొక్క ఆకర్షణను మరింత పెంచుతుంది. శ్రీనగర్ నుండి కేవలం 70 కిలోమీట‌ర్ల దూరంలో ఇక్కడికి చేరుకోవచ్చు.

pahalgham

కోకర్నాగ్ జలపాతం

కోకెర్‌నాగ్ నగరానికి సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి. కోకర్నాగ్ జలపాతం శ్రీనగర్ నుండి సుమారు 80 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఈ జలపాతం చుట్టూ ఉన్న పచ్చదనం, రంగురంగుల పువ్వులు ఈ ప్రదేశానికి మ‌రింత అందాన్ని ఇస్తాయి. ఈ బుగ్గలోని నీరు అనేక సమస్యలను నివారించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

gulmarg

ఎప్పుడు వెళ్లాలి?

కోకర్నాగ్ సందర్శించడానికి ఉత్తమ సీజన్ వేసవికాలం. ఎందుకంటే ఈ సమయంలో ఇక్క‌డ‌ వెచ్చని బట్టలు ధ‌రించాల్సిన అవసరం లేదు. అయితే, జూలై నుండి సెప్టెంబర్ చివరి వరకు కూడా ఈ ప్ర‌దేశాన్ని సంద‌ర్శించేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.

చేరుకోవడం ఎలా?

కోక‌ర్నాగ్ సంద‌ర్శించేందుకు అన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గం ద్వారా ప్రయాణించాలనుకుంటే మాత్రం నేరుగా శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఇక్క‌డ విమానాశ్రయం నుండి కోకర్నాగ్‌ టాక్సీని పొందొచ్చు. శ్రీనగర్ మరియు కోకర్నాగ్ మధ్య దూరం సుమారు 90 కిలోమీట‌ర్లు ఉంటుంది. రైలు మార్గం ద్వారా అయితే, కోకెర్‌నాగ్‌కు సమీప రైల్వే స్టేషన్ అనంత్‌నాగ్ 25 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. స్టేషన్‌కు చేరుకున్న తర్వాత క్యాబ్‌ని అద్దెకు తీసుకోవచ్చు లేదా కోకర్‌నాగ్‌కి బస్సులో వెళ్లొచ్చు . ఇక రోడ్డు మార్గం ద్వారా అయితే, కోకెర్నాగ్ సమీపంలోని అన్ని నగరాలకు రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ఇక్కడకు టాక్సీ లేదా సొంత వాహ‌నం ద్వారా చేరుకోవచ్చు. మ‌రెందుకాల‌స్యం కోక‌ర్నాగ్ సంద‌ర్శ‌న‌కు బ‌యలుదేరండి.

More News

    Read more about: kokarnag jammu
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+