Search
  • Follow NativePlanet
Share
» »దెయ్యాలు నిర్మించిన దేవాలయం ఇదే

దెయ్యాలు నిర్మించిన దేవాలయం ఇదే

సాధారణంగా దేవాలయాలను రాజులు లేదా మునులు నిర్మిస్తారు. అయితే ఒక శివాలయం మాత్రం దెయ్యాలు నిర్మించాయని చెబుతారు. ఇందుకు సంబంధించిన కథనం.

By Beldaru Sajjendrakishore

హిందూ సంస్కృతిలో దేవాలయాల పాత్ర చాలా ఎక్కువ. హిందూ సనాతన ధర్మంలో దైవారాధనకు ప్రథమ స్థానం ఉంటుంది. అందువల్ల మన దేశంలో ఆలయాలు ఎక్కువ. ఒక్కొక్క ఆలయం ఒక్కో శైలిలో నిర్మితమై ఉంటాయి. వాటిలో కొన్నింటి నిర్మాణం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. అటు వంటి కోవకు చెందినదే సుందరేశ్వరుడి ఆలయం ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన కథనం .

1. ఈ నిర్మాణం అసాధరణం

1. ఈ నిర్మాణం అసాధరణం

Image source

హిందూ ధర్మంలో కొన్ని కథలకు ఆధారాలు దొరకడం చాలా కష్టం. అయితే సదరు కథలను నమ్మాల్సి వచ్చినప్పుడు కొంతమంది అక్కడి ఉన్న ప్రస్తుత పరిస్థితులనో, ఒక బొమ్మనో రాయినో చూపిస్తారు. దీంతో సదరు ఘటన నిజంగానే జరిగిందని మనం భావించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అటు వంటి కోవకు చెందిన సుందరేశ్వర దేవాలయం.

2. భూతాలు నిర్మించాయంట

2. భూతాలు నిర్మించాయంట

Image source

సాధారణంగా హిందూ ధర్మంలోని దేవాలయాలతో పాటు మిగిలిన ఏ మతంలోని ప్రార్థనా స్థలాలను అయినా రాజులు కాని ఆ రాజుల ప్రతినిధులు కాని నిర్మిస్తారు. అయితే సుందరేశ్వరుడి దేవాలయం మాత్రాన్ని మాత్రం భూతాలు నిర్మించినట్లు స్థానిక కథనం.

3. 600 ఏళ్ల క్రితం కథ

3. 600 ఏళ్ల క్రితం కథ

Image source

స్థానికులు చెబుతున్న దాని ప్రకారం దాదాపు 600 ఏళ్ల క్రితం ఈ ఊరిలో బుచ్చయ్య అనే వైద్యుడు ఉండేవాడు. ఇతనికి ఆయుర్వేదంతో పాటు కొన్ని తాత్రిక శక్తులు కూడా ఉండేవి. దీంతో జబ్బు పడిన వారికి వైద్యం చేసి స్థానికంగానే కాకుడా చుట్టు పక్కల కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.

4.ఊరివారంతా కలిసి

4.ఊరివారంతా కలిసి

Image source

ఈ నేపథ్యంలో ఈ ఊరిలోని వారంతా కలిసి అక్కడ ఓ శివాలయాన్ని నిర్మించాలని భావించారు. తమకు తోచినంత చందాలు వేసుకుని ఒక మంచి దేవాలయాన్ని నిర్మించారు. ఇక గుడిలో రేపటి రోజు విగ్రహ ప్రతిష్ట చేయాలని అనుకున్న తరుణంలో ఆ దేవాలయం ఒక్కసారిగి కూలిపోయింది.

5.కోపగించుకున్న బుచ్చయ్య

5.కోపగించుకున్న బుచ్చయ్య

Image source

దీంతో గ్రామస్తులంతా బాధపడుతుండగా బుచ్చయ్య తన శక్తి నంతటినీ వినియోగించి ఈ పనిని ఆ ఊరిలో ఉన్న కొన్ని దుష్టశక్తులు చేశాయని తెలుసుకుంటాడు. కోపంతో వాటిని శిక్షించాలని పంథం పడుతాడు.

6. దెయ్యాలు వేడుకున్నాయి.

6. దెయ్యాలు వేడుకున్నాయి.

Image source

అనుకున్న విధంగానే వాటి జుట్టును కత్తిరించి ఒక రోకలికి కడుతాడు. దీంతో ఆ దెయ్యాలు బచ్చయ్యని వేడుకున్న తర్వాత దేవాలయాన్ని నిర్మిస్తే మీకు స్వేచ్చను ప్రసాదిస్తానని చెబుతాడు. ఇందుకు అంగీకరించిన ఆ దెయ్యాలు ఒక రోజులోపలే దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాయి.

7. విగ్రహ ప్రతిష్ట జరగలేదు

7. విగ్రహ ప్రతిష్ట జరగలేదు

Image source

మరుసటి రోజు విగ్రహ ప్రతిష్టాపన జరగాలనే సమయానికి సదరు బుచ్చయ్య చనిపోతాడు. ఇన్ని అవాంతరాల మధ్య నిర్మించిన దేవాలయం మాకు అక్కర లేదని గ్రామస్తులు భావిస్తారు. దీంతో దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఆగిపోతుంది.

8.ఇదిగో నిదర్శనం...

8.ఇదిగో నిదర్శనం...

Image source

సాధారణంగా ఏ దేవాలయం పైన అయినా దేవతల బొమ్మలు కాని, కామసూత్ర బొమ్మలు కాని ఉండటం రివాజు. అయితే ఈ దేవాలయం శిఖర భాగంలో కొన్ని విచిత్రమైన బొమ్మలు ఉంటాయి. వాటిని బూతాలు లేదా దెయ్యాలుగా ఇక్కడి వారు పిలుస్తారు. బుచ్చతో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఆ దెయ్యాలు తమ బొమ్మలను ఆ దేవాలయం పై ఏర్పాటు చేశాయని కూడా ఇక్కడి వారు చెబుతున్నారు.

9. 50 ఏళ్ల క్రితం

9. 50 ఏళ్ల క్రితం

Image source

ఇక దేవాలయం నిర్మించినప్పటి నుంచి గర్భగుడిలో ఎటువంటి విగ్రహం లేదు. అయితే 50 ఏళ్ల క్రితం గ్రామస్తులకు ఊరి చివర ఉన్న చెరువు చాలా వరకూ ఎండిపోయిన తర్వాత అందులో 8 అడుగుల శివలింగం కనిపించింది. దీంతో అందరూ కలిసి ఆ శివలింగాన్ని ప్రస్తుత గర్భగుడిలో ప్రతిష్టింపజేసి పూజలు చేస్తున్నారు.

10. పున్నమిరోజు ప్రత్యేక పూజలు

10. పున్నమిరోజు ప్రత్యేక పూజలు

Image source

విచిత్రమైన మానసిక స్థితితో ప్రవర్తించేవారు ఇక్కడ పూజలు చేస్తే సత్ఫలితాలు ఉంటాయని చాలా మంది నమ్ముతున్నారు. దీంతో పున్నమినాడు ఇక్కడకు రాష్ర్టంలోని వివిధ చోట్ల నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.

11. ఎక్కడ ఉంది.

11. ఎక్కడ ఉంది.

Image source

బెంగళూరుకు దగ్గర్లోని దొడ్డబళాపురం సమీపంలో బొమ్మావర అనే గ్రామం ఉంది. ఆ గ్రామ శివారులో ఈ దేవాలయం ఉంది. దొడ్డబళాపురం నుంచి బొమ్మవరకు 20 కిలోమీటర్ల దూరం. ప్రయాణ సమయం అరగంట.

12. ఇంకా ఏమేమి చూడవచ్చు.

12. ఇంకా ఏమేమి చూడవచ్చు.

Image source

ఇక ఈ దేవాలయంతో పాటు నందిబెట్ట, ఘాటి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం, ట్రెక్కింగ్ కు ప్రఖ్యాతి గాంచిన మకలిదుర్గ తదితర పర్యాటక ప్రాంతాలను ఇక్కడ చూడవచ్చు.

More News

    Read more about: lord shiva
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+