Search
  • Follow NativePlanet
Share
» »శ‌ర‌న్న‌వ‌రాత్రుల వేళ క‌ర్నాట‌క‌లోని ఆల‌యాల సంద‌ర్శ‌న‌.. ఐఆర్‌సిటిసి ప్యాకేజీ..

శ‌ర‌న్న‌వ‌రాత్రుల వేళ క‌ర్నాట‌క‌లోని ఆల‌యాల సంద‌ర్శ‌న‌.. ఐఆర్‌సిటిసి ప్యాకేజీ..

మ‌రికొద్దిరోజుల్లో ద‌స‌రా పండుగ స‌మీపిస్తోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాల‌ను తిల‌కించాల‌ని చాలామంది అనుకుంటారు. అలాంటివారికోసం ఐఆర్‌సిటిసి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. త‌క్కువ బ‌డ్జెట్‌తో ఎక్కువ దూరం ప్ర‌యాణించాల‌నుకునేవారికి ఈ ప్యాకేజీ ఓ మంచి ఆఫ‌ర్ అని చెప్పుకోవాలి. ఈ ప్యాకేజీలో భాగంగా హైద‌రాబాద్ టు క‌ర్నాట‌క ప్ర‌యాణం ఉంటుంది. ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ స్పెష‌ల్ టూర్ ప్యాకేజీలో క‌ర్ణాట‌క‌లోని ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శించేయొచ్చు.

వ‌చ్చే నెల‌లో నవరాత్రులు, దసరా పండుగ రానున్న క్ర‌మంలో ఐఆర్‌సిటిస ప‌ర్యాట‌కుల కోసం 'DIVINE KARNATAKA' పేరుతో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో మొత్తం ఐదు రోజులు, ఆరు రోజులు పగటిపూట జ‌ర్నీ చేయాల్సి ఉంటుంది. ఈ స్పెష‌ల్ టూర్ ప్యాకేజీ అక్టోబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి వ‌స్తుంది. ఇది మిస్ అయితే, అక్టోబర్ నెల‌లోని ప్రతి మంగళవారం అంటే అక్టోబర్ 8, 15, 22, 29వ తేదీల్లో ఈ ట్రైన్ జ‌ర్నీ చేయొచ్చు. ఈ టూర్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది.

sharadambatemple1

టూర్ షెడ్యూల్ ఇదే..

ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ టూర్ ప్యాకేజీ హైదరాబాద్ లో ప్రారంభ‌మ‌వుతుంది.12789 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్‌ కాచిగూడ స్టేషన్లో ఉదయం 6:05 గంటలకు ట్రైన్ బ‌య‌లుదేరుతోంది. ఇక‌, ఈ ట్రైన్ మహబూబ్‌నగర్, కర్నూలు, డోన్, కడప, రేణిగుంట వయా తమిళనాడురాష్ట్రాల్లో ప్ర‌యాణికుల కోసం ఆగుతుంది. ఈ జ‌ర్నీలో భాగంగా మరుసటిరోజు ఉదయం 9:30 గంటలకు మంగళూరుకు చేరుకుంటుంది. ఇక‌, అక్కడి నుంచి ఉడిపికి మ‌రికొంత దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఉడిపి చేరుకున్నాక ఐఆర్‌సిటిసి వారు ఏర్పాటు చేసిన హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. ఆ త‌ర్వాత శ్రీ క్రిష్ణ మఠాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. అనంత‌రం ప్ర‌సిద్ధిచెందిన మల్పే బీచ్ అందాల‌ను తిల‌కించేందుకు బ‌య‌లుదేరుతారు.

udupibeach

ఆ నైటంతా ఉడిపిలోనే స్టే చేస్తారు. మూడోరోజు ఉదయం శృంగేరికి వెళ్తారు. అక్క‌డ అత్యంత ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన శారదాంబ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం అక్క‌డి నుండి మళ్లీ తిరిగి మంగళూరు ప్రయాణం ప్రారంభిస్తారు. మూడోరోజు మంగళూరులో హోటల్‌‌లోనే ఉండాల్సి ఉంటుంది. అక్కడ డిన్న‌ర్ సౌక‌ర్యం కూడా కల్పిస్తారు. ఇక ఆ మ‌రుస‌టి రోజు ధర్మస్థలాన్ని చేరుకుంటారు. అక్కడ భోలేనాథుని ద‌ర్శ‌నం చేసుకుంటారు. ఆ త‌ర్వాత కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్తారు. ఇక‌, అదేరోజు సాయంత్రం తిరిగి మంగళూరుకు వెళ్లాల్సి ఉంటుంది. నాలుగో రోజు రాత్రి కూడా మంగళూరులోనే బస చేస్తారు. ఐదో రోజు మంగళదేవి ఆలయం, కదిరి మంజునాథ ఆలయం సంద‌ర్శ‌న ఉంటుంది. ఇక‌, అదేరోజు సాయంత్రం తన్నెరభావి బీచ్‌, కుద్రోలి గోకర్నాథ దేవాలయం సందర్శించి తిరిగి మంగళూరు రైల్వేస్టేషన్‌ చేరుకుంటారు. అదేరోజు రాత్రి 8 గంటలకు 12790 అనే నెంబ‌ర్‌గ‌ల రైలు ఎక్కుతారు.
మ‌రుస‌టి రోజు అంటే ఆరో రోజు రాత్రి 11:40 గంటలకు కాచిగూడ స్టేష‌న్ చేరుకోవ‌డంతో ఈ ప్యాకేజీ ముగుస్తోంది.

udupi sri krishna Mata

ప్యాకేజీ ధ‌ర‌లివే..

ఈ టూర్ ప్యాకేజీ ధ‌ర‌ల‌ను ఓసారి ప‌రిశీలిద్దాం.. ఒక్క‌రి నుంచి ముగ్గురికి.. కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ బెర్త్‌) ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ షేరింగ్‌లో అయితే రూ.38,100 చెల్లించాల్సి ఉంటుంది. అదే ట్విన్ షేరింగ్‌కు రూ.22,450 ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.18150 చెల్లించాల్సి ఉంటుంది. ఇక‌ 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.11430గా నిర్ణ‌యించారు. అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.9,890 చెల్లించాల్సి ఉంటుంది.

ఇక‌, స్టాండర్డ్ విష‌యానికొస్తే..రూమ్‌ సింగిల్ షేరింగ్‌కు రూ.35,070 ఉంటుంది. అదే ట్విన్ షేరింగ్ అయితే రూ.19,430 ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్‌కయితే రూ.15,130 చెల్లించాలి. ఇక 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో క‌లిపి రూ.8,410 గా నిర్ణ‌యించారు. విత్ అవుట్ బెడ్‌కు రూ.6,860 నిర్ణ‌యించారు.

అదే నలుగురు నుంచి ఆరుగురు వ్యక్తులు కలిసి ఈ ప్యాకేజీ బుక్‌ చేసుకుంటే మాత్రం కంఫర్ట్ థర్డ్‌ ఏసీ డబుల్‌ షేరింగ్‌ రూ.19,190చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.17,110 ఉంటుంది. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌ అయితే రూ.11,430 చెల్లించాలి. విత్ అవుట్ బెడ్ అయితే రూ.9,890 చెల్లించాలి. స్టాండర్డ్‌లో డ‌బుల్‌ షేరింగ్‌కు రూ.16,170గా నిర్ణయించారు. అదే ట్రిపుల్‌ షేరింగ్ అయితే రూ.14,090 ఉంటుంద‌. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో క‌లిపి రూ.8,410 చెల్లించాల్సి ఉంటుంది. విత్ అవుట్ బెడ్‌కు రూ.6,860 గా నిర్ణ‌యించారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+