Search
  • Follow NativePlanet
Share
» »రామేశ్వరం అంటే గుళ్లు, గోపురాలే కాదు మరెన్నో

రామేశ్వరం అంటే గుళ్లు, గోపురాలే కాదు మరెన్నో

రామేశ్వరం చుట్టూ చూడదగిన ప్రాంతాలకు సంబంధించిన కథనం.

రామేశ్వరం అన్న తక్షణం ప్రతి ఒక్కరి మదిలో మెదిలేది అది ఒక ఆధ్యాత్మిక, ధార్మిక స్థలం. ముఖ్యంగా ఇక్కడి సముద్ర స్నానాన్ని అత్యంత పవిత్రమైన కార్యంగా భావిస్తారు. అదే విధంగా రామేశ్వరం చుట్టు పక్కల కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇందులో కోదండ రామస్వామి దేవాలయం, పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం తదితరాలు. అయితే రామేశ్వరం ఒక్క ధార్మిక ప్రాంతమే కాదు. ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా. ఈ రామేశ్వరంలో గుళ్లు, గోపురాలే కాకుండా చూడదగిన ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామేశ్వరంలో ప్రధానంగా చూడదగిన పర్యాటక కేంద్రాలకు సంబంధించిన కథనం....

రామనాథస్వామి దేవాలయం

రామనాథస్వామి దేవాలయం

P.C: You Tube

ద్రవిడ శైలిలో నిర్మితమైన దేవాలయాల్లో రామనాథస్వామి దేవాలయం కూడా ఒకటి. ఇక్కడ గతంలో 112 సరస్సుుల ఉండేవని చెబుతారు. అయితే ప్రస్తుతం ఇక్కడ 12 సరస్సులు మాత్రమే ఉన్నాయి. అత్యంత విశాలమైన ఆలయ ప్రాంగణాల్లో రామనాథ స్వామి దేవాలయం రెండో స్థానంలో ఉంటుంది.

కోదండరామస్వామి దేవాలయం

కోదండరామస్వామి దేవాలయం

P.C: You Tube

ఇక్కడ కోదండరామస్వామి దేవాలయం రామయణ కాలం నుంచి ఉందని చెబుతారు. ముఖ్యంగా విభీషణుడు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇక్కడ దేవాలయానికి ఆనుకొనే ఉన్న సముద్ర తీర ప్రాంతాలు మన మనస్సుకు మరింత ఉత్తేజం చేకూరుస్తాయి.

పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం

పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం

P.C: You Tube

రామేశ్వరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. ఇక్కడి విగ్రహాన్ని సాలగ్రామ శిలతో చేసినట్లు చెబుతారు. ఈ సాలగ్రామ శిల హిందూ పురాణాల ప్రకారం అత్యంత పవిత్రమైనది.

అగ్ని తీర్థం

అగ్ని తీర్థం

P.C: You Tube

భారత దేశంలో అత్యంత పవిత్రమైన తీర్థల్లో అగ్ని తీర్థం కూడా ఒకటి. ఇక్కడ స్నానం చేయడం వల్ల పంచ మహాపాతకాలు తొలిగిపోతాయని చెబుతారు. ఇక్కడ శ్రాద్ధ కర్మలు కూడా నిర్వహిస్తారు. మొదట ఇక్కడ స్నానం చేసిన తర్వాతనే రామేశ్వరంలోని మిగిలిన తీర్థాల్లో స్నానం చేయాలని హిందువులు బలంగా నమ్ముతారు.

ఆర్యామాన్ బీచ్

ఆర్యామాన్ బీచ్

P.C: You Tube

రామేశ్వరానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్యామన్ బీచ్ లో అత్యంత స్వచ్ఛమైనది. ఇక్కడ ఈత కొట్టడానికి చాలా అనువుగా ఉంటుంది. అందువల్లే కొంత సమయం ఉన్నవారు ఖచ్చితంగా ఈ బీచ్ కు వెళ్లి కొంత సమయం అక్కడ సరదాగా గడుపుతారు.

ధనుష్కోటి

ధనుష్కోటి

P.C: You Tube

రామేశ్వరం వెళ్లినవారు ధనుష్కోటికి తప్పకుండా వెలుతారు. ఇక్కడే ఒకవైపున అరేబియా సముద్రం, మరోవైపున బంగాళఖాతం ఉంటాయి. ఆ రెండు సముద్రాలు కూడా ఇక్కడే కలుస్తాయి. ఆ ప్రాంతం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీనిని ఘోస్ట్ టౌన్ అని కూడా పిలుస్తారు.

అడమ్స్ బ్రిడ్జ్

అడమ్స్ బ్రిడ్జ్

P.C: You Tube

దీనినే రామసేతు అంటారు. రామయణ కాలంలో శ్రీరాముడు లంకను దాటడానికి వానర సైన్యం సహాయంతో ఈ బ్రిడ్జ్ ను నిర్మించారని చెబుతారు. అయితే ఈ బ్రిడ్జ్ విషయమై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఇది ప్రక`తి సిద్ధంగా ఏర్పడిందని చెబుతుండగా మారికొంతమంది మాత్రం మానవ నిర్మితమని చెబుతారు. అయితే రామేశ్వరం వెళ్లిన వారు ఈ రామసేతును కూడా తప్పకుండా సందర్శిస్తుంటారు.

పక్షిసంరక్షణ కేంద్రం

పక్షిసంరక్షణ కేంద్రం

P.C: You Tube

రామేశ్వరం అంటే చాలా మంది ఇదొక ధార్మిక క్షేత్రంగానే భావిస్తారు. అయితే పక్షి ప్రేమికులకు కూడా ఇది స్వర్గధామం. ఈ పక్షి కేంద్రంలో స్థానిక పక్షులే కుండా శ్రీలంక తదితర దేశాల నుంచి వలస వచ్చిన పక్షులను మనం చూడవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+