Search
  • Follow NativePlanet
Share
» »వ‌ర్షాకాలంలో విశాఖ‌లోని ఈ జ‌ల‌పాత‌పు అందాల‌ను వీక్షించాల్సిందే..!

వ‌ర్షాకాలంలో విశాఖ‌లోని ఈ జ‌ల‌పాత‌పు అందాల‌ను వీక్షించాల్సిందే..!

వ‌ర్షాకాలంలో చాలామంది బ‌య‌టికి వెళ్లేందుకు ఆస‌క్తి చూపించ‌రు. కానీ, ఈ సీజ‌న్‌లో ఎంజాయ్ చేయాలంటే మాత్రం జ‌ల‌పాతాల‌కు వెళ్లాల్సిందే. జ‌ల‌పాతాల స‌వ్వ‌డుల‌ను ఆస్వాదించాల‌నుకునేవారు ఎక్క‌డికో విదేశాల‌కు వెళ్లాల్సిన ప‌నిలేదండి. మ‌న చుట్టుప‌క్క‌లే ఎన్నో అంద‌మైన జ‌ల‌పాతాలు మ‌న‌కు సాద‌ర ఆహ్వ‌నం ప‌లుకుతున్నాయి. ఏపీలోని విశాఖ‌లో ప్ర‌కృతి అందాల మ‌ధ్య దాగి వున్న సుంద‌ర‌మైన జ‌ల‌పాతం వ‌ర్షాకాలంలో వ‌ర్ష‌పు నీటితో జ‌ల‌క‌ళ‌లాడుతు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఆ జ‌లపాతం ఏంట‌నుకుంటున్నారా..? అదే స‌మ్మ‌గిరి జ‌ల‌పాతం... రండి దీని విశేషాలేంటో తెలుసుకుందాం.

lambsangi1

ప‌చ్చ‌ని అందాలు..

ఈ సీజ‌న్‌లో చూడద‌గ్గ వాట‌ర్‌ఫాల్స్ లో ఇది ఒక‌టి. వ‌ర్షాకాలంలో లంబ‌సింగి వ‌చ్చే ప‌ర్యాట‌కులు ఈ జ‌ల‌పాతం చూడకుండా అస్స‌లు ఉండ‌లేరు. అంత‌టి అద్భుత దృశ్యాల‌ను ఇక్క‌డ చూడొచ్చు. ఇది విశాఖలోని మ‌న్యంలో ఉంది. ఎత్త‌యిన జ‌ల‌పాతం నుంచి జాలువారే జ‌ల‌పాత‌పు అందాలు నేరుగా ఇక్క‌డ కింద ఉన్న చెరువులో ప‌డుతాయి. ఆ దృశ్యాలు చూప‌రుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ఈ ప్రాంతమంతా ప‌చ్చ‌ద‌నంతో నిండిపోయింటుంది. చుట్టూ ప‌చ్చ‌ద‌నం మ‌ధ్య‌లో జ‌ల‌పాతం ఉంటుంది. ఇక్క‌డి ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాల‌ను మాటల్లో వ‌ర్ణించ‌డం క‌ష్టం..

sammagirifalls1

సెల్పీల‌తో...

వ‌ర్షాకాలంలో వీటీ అందాలు మ‌రింత రెట్టింప‌వుతాయి. ఈ సీజ‌న్‌లో అధిక సంఖ్య లో నీరు రావడంతో ఈ జలపాపు అందాలను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు సూదూర ప్రాంతాల‌ను ప‌ర్యాట‌కులు త‌ర‌లివ‌స్తున్నారు. ఈ ప‌చ్చ‌ని అందాల‌ను త‌మ త‌మ కెమెరాల్లో బందిస్తున్నారు. అంతేకాదు, ఇక్క‌డికి వ‌చ్చేవారంతా ఈ జ‌ల‌పాతం ద‌గ్గ‌ర సెల్పీలు దిగేందుకు ఎగ‌బ‌డుతున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ, జ‌ల‌పాతం దగ్గ‌ర స్నానాలు చేస్తూ యువ‌త సంద‌డి చేస్తున్నారు.

ఏడాది పొడ‌వునా ప్ర‌వ‌హించే నీరు..

స‌మ్మ‌గిరి జలపాతం లంబసింగి వెళ్లే మార్గంలో ఉంది. యార్రవరం నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్ర‌యాణించగానే ప‌ర్యాట‌కుల‌కు స‌మ్మ‌గిరి జ‌ల‌పాతం అనే బోర్డు క‌నిపిస్తుంది. ఈ జలపాతంలో దాదాపు సంవ‌త్స‌రం పొడవునా నీరు ప్ర‌వ‌హిస్తూనే ఉంటుంది. హిల్ క్లైంబింగ్ అంటే మ‌క్కువ ఉన్నవారు త‌ప్ప‌క ఈ ప్రాంతానికి వెళ్లాల్సిందే. ఇది ప్ర‌కృతి ప్రేమికుల‌కు ఎంతో ఉత్తమమైన ప్రదేశం. ఈ ప్రదేశం అన్ని సీజ‌న్ల‌లో పర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ స‌మ్మ‌గిరి జ‌ల‌పాతానికి స‌మీపంలోనే అనేక జ‌ల‌పాతాలు ఉన్నాయి. అవి ఇక్క‌డికొచ్చే ప‌ర్యాట‌కుల‌ను త‌మ అందాలతో మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తాయి.

sammagirifalls1

ఎలా వెళ్లాలి..?

ఈ జ‌ల‌పాతం విశాఖపట్నంకి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో వుంటుంది. లంబసింగి నుండి 20 కిలోమీట‌ర్ల‌ దూరంలో, నర్సీపట్నం నుండి సుమారు 25 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. నర్సీపట్నం తాలూకాలోని యర్రవరం గ్రామంలో ఉన్న ఒక సుందరమైన జలపాతమే స‌మ్మ‌గిరి. ఈ జలపాతం 10 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో విస్తరించి ఉంటుంది. ఈ జ‌ల‌పాత‌పు నీరు వేర్వేరు క్యాస్కేడ్లలో పడిపోతుండ‌డంతో పాటు దిగువన ఒక కొలనుని కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ కొల‌నులో కూర్చ‌ని ప‌ర్యాట‌కుల‌కు స్నానాలు చేస్తుంటారు. ఇది ఏడాది పొడవునా ఉండే జలపాతం.

ఇక్క‌డికి వెళ్లాలంటే నర్సీపట్నం సిటీ నుండి యర్రవరం గ్రామం వరకు క్యాబ్స్ ఆటోలు అందుబాటులో ఉంటాయి. బ‌స్సు సౌక‌ర్యం ఉండ‌దు. లంబ‌సింగి వ‌ర‌కు బ‌స్సులు అందుబాటులో ఉంటాయి. అక్క‌డినుంచి ఆటోలు కానీ, క్యాబ్‌లు కానీ తీసుకొవ‌చ్చు. సొంత వెహిక‌ల్‌లో వెళ్లేవారికి ఎలాంటి ఇబ్బందులుండ‌వు. ట్రెక్కింగ్, స్టార్‌గేజింగ్, క్యాంపింగ్ వంటివి చేయాల‌నుకునేవారికి ఈ ప్రాంతంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+