Search
  • Follow NativePlanet
Share
» »రంగురంగుల పూల‌తో క‌నువిందుచేస్తోన్న తులిప్ గార్డెన్ ఫెస్టివ‌ల్‌

రంగురంగుల పూల‌తో క‌నువిందుచేస్తోన్న తులిప్ గార్డెన్ ఫెస్టివ‌ల్‌

రంగురంగుల పూల‌తో క‌నువిందుచేస్తోన్న తులిప్ గార్డెన్ ఫెస్టివ‌ల్‌

జమ్మూకాశ్మీర్ పేరువిన‌గానే అంద‌మైన ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు గుర్తుకొస్తాయి. ప‌చ్చ‌ద‌నాన్ని క‌మ్మేసిన మంచు పొర‌లు క‌ల్ల‌ముందు మెద‌లాడుతాయి. అలాంటి జ‌మ్మూకాశ్మీర్ ఇప్పుడు రంగురంగుల పువ్వులతో సంద‌ర్శ‌కుల‌ను ఆకట్టుకుంటోంది. ఎటు చూసినా చూపు తిప్పుకోనీయ‌ని ఎరుపు, తెలుపు రంగుల్లో తులిప్ పుష్పాలు సందర్శకులను ఆకర్శిస్తున్నాయి. ప్రతియేటా వసంత రుతువులో తులిప్ పుష్పాలు వికసించే సమయంలో.. ఇక్క‌డి తులిప్‌ గార్డెన్‌ను పర్యాటకుల కోసం అధికారులు తెరిపించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ పూల వనంలో ఐదు రంగుల్లో తులిప్‌ పుష్పాలు దర్శనమిస్తున్నాయి.

తులిప్‌ పూలతోపాటే చాలా రకాల ఇతర పుష్పాలు కూడా తులిప్‌ గార్డెన్‌కు వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఏఫ్రిల్ 3 నుంచి ప్రారంభ‌మై 20 రోజుల‌పాటు తులిప్ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ అందాల‌ను చూసేందుకు సుదూర ప్kరాంతాల‌నుంచి ప్ర‌కృతి ప్రేమికులు బారులు తీరుతున్నారు. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్‌ పూల గార్డెన్‌లు ఉన్నాయి. అయితే శ్రీనగర్‌లోని తులిప్‌ గార్డెన్‌ మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఈ గార్డెన్‌ విస్తీర్ణం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30 హెక్టార్‌లు ఉంది. ప్రతి ఏటా వసంత రుతువులో పుష్పాలు వికసిస్తుంటే ఈ గార్డెన్‌ను తెరుస్తారు. అలా ప్రతి ఏడాది తులిప్ ఫెస్టివల్‌ పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

indiragandhitulipgarden1

ఇవి లిల్లీ జాతికి చెందినవి

చూడ‌గానే క‌ట్టిప‌డేసే అందంతోపాటు తులిప్ పుష్పాల గురించి మాటల్లో వ‌ర్ణించ‌డం కాస్త క‌ష్ట‌మే. తులిప్ అంటే లాటిన్ భాష‌లో త‌ల‌పాగా అని అర్థం. ఇవి లిల్లీ జాతికి చెందినవి. తులిప్‌లో దాదాపు 150 ర‌కాల జాతుల‌కు చెందిన మూడు వేల వెరైటీలు ఉన్నాయంటే కాస్త ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది. ఈ 20 రోజులపాటు జ‌రిగే ఫెస్టివ‌ల్లో రంగురంగుల తులిప్‌ పుష్పాలతోపాటు రకరకాల ఇతర పుష్పాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఇప్ప‌టికే తులిప్‌ పూల అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు.

indiragandhitulipgarden

ప్ర‌స్తుతం ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా ఉంటుంది ఈ తులిప్ తోట‌. ఈ భూలోక స్వర్గాన్ని చూసేందుకు ఏటా లక్షల మంది పర్యాటకులు శ్రీనగర్‌కు క్యూ కడుతుంటారు. ఈ సీజ‌న్‌లో అక్కడ ప‌ర్యాట‌కుల సంద‌డి ఎక్కువ‌గా ఉంటుంది. దేశ‌, విదేశాల నుంచి భారీగా త‌ర‌లివ‌స్తుంటారు. ఈసారి కూడా తులిప్ పూలు బాగా వికసించాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్త ఎక్కువగా లక్షల పువ్వులు వికసించాయి.

indiragandhitulipgarden

ఐదు రంగుల్లో వికసించిన పూలు

ఆ పూల సోయగాలు సందర్శకుల మదిని దోచేస్తున్నాయి. ఐదు రంగుల్లో వికసించిన పూలు టూరిస్టులను మెస్మరైజ్‌ చేస్తున్నాయి. మంచు కొండల మధ్య తులిప్‌ పూల సోయగాలను వీక్షిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. వ‌సంత‌కాలంలో మూడు రోజుల నుంచి ఏడు రోజులపాటు విక‌సించే ఈ తులిప్ పుష్పాలు.. దాదాపు అన్ని రంగుల్లో క‌నువిందు చేస్తాయి. నిజానికి తులిప్ పుష్పాలు మ‌ధ్య ఆసియాకు చెందిన‌వి. కానీ ఇవి నెద‌ర్లాండ్‌కు చేరిన త‌ర్వాతే మంచి ఆద‌ర‌ణ పొందాయ‌ని చెబుతారు. ఈ పుష్పాల‌కు పెరిగేందుకు వీలుగా కాంతివైపు వంగి మెలి తిరిగే ల‌క్ష‌ణం ఉంది.

More News

    Read more about: tulip garden festival
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+