Search
  • Follow NativePlanet
Share
» »విమానాశ్ర‌యాలు కాదు ఇవి రైల్వేస్టేష‌న్లు..

విమానాశ్ర‌యాలు కాదు ఇవి రైల్వేస్టేష‌న్లు..

విమానాశ్ర‌యాలు కాదు ఇవి రైల్వేస్టేష‌న్లు..

రైల్వే స్టేషన్ పేరు వినగానే ముందుగా అంద‌రికి గుర్తుకు వచ్చేది ట్రాక్‌పై పడి ఉన్నమట్టి, ప్లాట్‌ఫారమ్‌పై పడి ఉన్న మనుషులు, ప్రతి మూలన పడి ఉన్న చెత్త. అవును, నిజానికి చాలా రైల్వే స్టేషన్లు నేటికీ అదే స్థితిలో ఉన్నాయి. అయితే, కాలక్రమేణా, రైల్వే స్టేషన్ల రూపురేఖ‌లు మార‌డం కూడా మ‌నం చూశాం. భారతదేశంలోని కొన్నిరైల్వే స్టేషన్లు ఎయిర్‌పోర్టుల‌నే త‌ల‌పించేస్తున్నాయి.

భారతదేశంలోని ఈ రైల్వే స్టేషన్లు అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ప్రయాణీకులకు ఫస్ట్ క్లాస్ సౌకర్యాలు, లైటింగ్ మరియు పరిశుభ్రత వంటి అన్ని సౌక‌ర్యాల‌ను ప్ర‌యాణికుల‌కు అందిస్తున్నాయి. ఈ స్టేషన్లను సందర్శించిన తర్వాత, పూర్తిగా విమానాశ్రయ అనుభూతిని పొందుతారు. మ‌రెందుకాల‌స్యం రండి, విమానాశ్ర‌యాల‌ను త‌ల‌పించే ఆ రైల్వేస్టేష‌న్ల‌ను మ‌న‌ము ఒక‌సారి చూసొద్దాం.

ranikamalapatirailwaystation

రాణి కమలాపతి రైల్వే స్టేషన్

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఈ రైల్వే స్టేషన్ భారతీయ రైల్వేలకు గర్వకారణం. పూర్వం దీనిని హబీబ్‌గంజ్ అని పిలిచేవారు. కానీ రీడెవలప్‌మెంట్ తర్వాత, దాని రూపాన్ని మార్చడంతో పాటు, పేరును కూడా మార్చారు. ఇప్పుడు ఈ రైల్వేస్టేష‌న్‌ను రాణి కమలాపతి రైల్వే స్టేషన్ అని పిలుస్తున్నారు. ఈ స్టేషన్ లోపల, షాపింగ్ కూడా చేయొచ్చు.

అంతేకాకుండా ఇక్క‌డ మీకు ఇష్ట‌మైన ఆహారాన్నిమ‌రియు సంతోషంగా మీ కుటుంబంతో గ‌డిపేందుకు సినిమాహాలు కూడా ఉంది. ఈ రైల్వే స్టేషన్ జర్మనీలోని హైడెల్‌బర్గ్ రైల్వే స్టేషన్ తరహాలో నిర్మించబడింది. ఇది భారతదేశపు మొదటి ISO సర్టిఫైడ్ రైల్వే స్టేషన్. ఫైవ్ స్టార్ సౌకర్యాలతో కూడిన ఈ ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ చాలా మందిని ప్ర‌యాణికుల‌ను ఆక‌ట్టుకుంటుంది.

chhatrapatishivajiterminalrailwaystation

ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వేస్టేష‌న్‌

ఇది భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే మరియు ప్రసిద్ధి చెందిన రైల్వే స్టేషన్. అతి త్వరలో ఈ స్టేషన్ రూపురేఖ‌లు మార‌నున్నాయి. ఈ స్టేష‌న్ ముంబ‌యిలో ఉంది. గ‌తంలో ఈ రైల్వేస్టేష‌న్‌ను విక్టోరియా టెర్మిన‌స్ అని పిలిచేవారు. కెఫెటేరియా, ఫుడ్ కోర్ట్, వెడ్డింగ్ లాంజ్, సినిమా హాల్, లిఫ్ట్‌, ఎస్కలేటర్ వంటి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దీని అభివృద్ధి అనంత‌రం ఈ రైల్వేస్టేష‌న్ విమానాశ్ర‌యాన్ని త‌ల‌పించేలా ఉంటుంది. ఈ స్టేషన్‌ను నిర్మించేందుకు రెండున్నర నుంచి మూడేళ్లు పట్టొచ్చు అంటున్నారు.

గాంధీనగర్ రైల్వే స్టేషన్

దేశంలోని తొలి రీవ్యాంప్డ్ రైల్వేస్టేష‌న్‌గా గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్ రైల్వేస్టేష‌న్ పేరుగాంచింది. ఈ రైల్వేస్టేష‌న్‌లో ప‌ట్టాల‌పైనే నిర్మించిన 5స్టార్ హోట‌ల్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. రైల్వేస్టేష‌న్‌పైన ల‌గ్జ‌రీ హోట‌ల్ నిర్మాణం దేశంలోనే మొద‌టిసారి. ఈ హోట‌ల్‌లో 318 గ‌దులు ఉన్నాయి. 7400 చ‌ద‌ర‌పు మీట‌ర్ల విస్తీర్ణంగ‌ల ఈ నిర్మాణానికి రూ. 790 కోట్లు ఖ‌ర్చుచేశారు. జాతీయ అంత‌ర్జాతీయ సెమినార్ల‌లో పాల్గొన‌డానికి వ‌చ్చే అతిథుల‌కు, మ‌హాత్మా మందిర్‌లో కాన్ఫ‌రెన్సుల‌కు వ‌చ్చేవారికి ఈ హోట‌ల్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

gandhinagarrailwaystation1

బ‌య‌ట నుంచి చూస్తే ట్రినిటి ఫామ్‌లో క‌నిపించే గాంధీన‌గ‌ర్ రైల్వేస్టేష‌న్లో మూడు ట‌వ‌ర్లు ఉంటాయి. మొద‌టి ట‌వ‌ర్‌లో 9 అంత‌స్తులు, రెండోమూడో ట‌వ‌ర్ల‌లో 11 అంత‌స్తులున్నాయి. రైల్వేస్టేష‌న్‌గానే కాదు, మొత్తం గాంధీన‌గ‌ర్ సిటిలోనే పొడ‌వైన భవంతిగా దీనికి గుర్తింపు ల‌భించింది. స్టేష‌న్ లోప‌లికి రావ‌డానికి, బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి వేర్వేరు ద్వారాలున్నాయి. లిప్టులు ప్ర‌త్య‌క‌మైన పార్కింగ్ స్పేస్ ఉన్నాయి.

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వేస్టేష‌న్‌లో కాన్‌కోర్స్ కూడా ఉన్నాయి. ప్ర‌యాణికుల సంఖ్య పెరిగిన‌ప్పుడు దీనిని ఉప‌యోగించ‌వ‌చ్చు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా టికెట్ బుకింగ్ కౌంట‌ర్లు, లైవ్ ఎల్ ఇడి వాల్‌డిస్‌ప్లే లాంజ్‌తోపాటు ఆర్ట్ గ్యాల‌రీ కూడా ఉంది. అన్నిమ‌తాల ప్ర‌యాణికులు ప్రార్థ‌న చేసుకోవ‌డానికి ప్ర‌త్యేక‌మైన హాల్ కూడా ఉంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+