Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలో అత్యంత ధనవంతులు నివసించే ప్రాంతాలు ఇవే..

భారతదేశంలో అత్యంత ధనవంతులు నివసించే ప్రాంతాలు ఇవే..

భారతదేశంలో అత్యంత ధనవంతులు నివసించే ప్రాంతాలు ఇవే..

ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశం లేదా సంపన్న నగరం గురించి వినే ఉంటారు. కానీ అత్యంత ధనవంతులు నివసించే రిచ్ సిటీ ఆఫ్ ఇండియా గురించి ఎప్పుడైనా విన్నారా? అవును, దేశంలో ధనిక నివాసాలుగా పిలువబడే అనేక నగరాలు ఇక్క‌డ ఉన్నాయి. భార‌త‌దేశం పేద దేశ‌మ‌ని అంటూ ఉంటారు. కానీ, ఇక్క‌డ అత్యంత సంప‌న్నులు కూడా ఉన్నారు. ధ‌న‌వంతులు కుబేరులుగా మారుతున్నారు.

పేద‌వారు మాత్రం క‌డుపేద‌రికంలో మునిగిపోతున్నారు. అయితే, మ‌న భార‌త‌దేశంలో అత్యంత ధ‌న‌వంతులు నివ‌సించే ప్రాంతాలు ఉన్నాయి. హురున్ రిచ్ రెసిడెంట్ జాబితాలో దేశంలోని మ‌రో 21 న‌గ‌రాల‌ను ఇందులో చేర్చారు. అందులో తెలంగాణ‌కు చెందిన రంగారెడ్డితో పాటు ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌, యుపిలోని ఘ‌జియాబాద్ వంటి న‌గ‌రాలు చాలానే ఉన్నాయి. అత్యంత సంప‌న్నులు ఉండే ఆ ప్రాంతాలేంటో ఒక‌సారి చూద్దాం..

mumbai2

ముంబై

ఆర్థిక రాజ‌ధాని ముంబైలో మొత్తం 328 సంపన్నులు ఉండే జాబితాలో ఇదే అగ్రస్థానంలో ఉంది. ఇందులో నగరంలోని అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, అత‌ని కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. 2019 నుండి 45 సంస్థల పెరుగుదల నగరంగా ఈ ప్ర‌దేశం పేరుగాంచింది. అత్యంత ధ‌న‌వంతులు నివ‌సించే న‌గ‌రంలో ఇది ఒక‌టిగా ప్ర‌సిద్ధిగాంచింది. భారతదేశంలోని ప్రధాన కాస్మోపాలిటన్ నగరాల్లో ఒకటైన ముంబై, ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఇది ప్రధానంగా పెద్ద మార్కెట్‌లు, బీచ్‌లు, ఎత్తైన భవనాలు, ఐదు నక్షత్రాల హోటళ్లకు ప్రసిద్ధి చెందింది.

న్యూఢిల్లీ

దేశంలో అత్యంత ధ‌న‌వంతులు నివ‌సించే ప్రాంతాల్లో న్యూఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇందులో 199 సంస్థలతో న్యూఢిల్లీ రెండో స్థానంలో ఉండ‌డం విశేషం. ఢిల్లీలోని అత్యంత సంపన్నుల జాబితాలో శివనాడార్ మరియు అతని కుటుంబం అగ్రస్థానంలో ఉన్నారు. ఈ నగరం పెరుగుతున్న సంపదను ప్రతిబింబిస్తుంది, దేశం యొక్క ఆర్థిక శక్తిని మరింత‌గా పెంచేందుకు కృషి చేస్తుంది.

banglore1

బెంగళూరు

వంద విద్యాసంస్థలతో బెంగళూరు దేశంలోని అత్యంత సంప‌న్నుల గల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. భారతదేశంలోని మహానగరాలలో బెంగుళూరు ఒకటి. ఇది కర్ణాటక రాష్ట్రానికి రాజధాని. బెంగుళూరును "గ్రీన్ సిటీ" అని కూడా అంటారు. ఇక్కడ వృక్షాలు అధికంగా ఉండటం వలన దానికాపేరు వచ్చింది.

హైదరాబాద్

దేశంలో అత్యంత సంప‌న్నులు నివ‌సించే జాబితాలో హైద‌ర‌బాద్ నాలుగో స్థానంలో ఉంది. హైద‌రాబాద్‌లో 87 విద్యాసంస్థలు క‌ల‌వు. భారతదేశ ఆర్థిక స్థితికి ఈ నగరం పాత్ర కూడా ఎంతో ఉంది. హైదరాబాద్ కి మరో పేరు భాగ్యనగరం. హస్తకళలకు, నాట్యానికి ఈ ప్రాంతం ఎంతో ప్ర‌సిద్ధి చెందింది. హైదరాబాదు భారతదేశంలో ఐదవ అతిపెద్ద మహానగరంగా విరాజిల్లుతుంది.

chennai4

చెన్నై

దేశంలో అత్యంత సంప‌న్నులు నివ‌సించే జాబితాలో చెన్నై ఐదవ స్థానంలో ఉంది. ఇక్క‌డ 67 సంస్థలు క‌ల‌వు. 2019 నుండి 16 ఎంటిటీలు ఇక్క‌డ అభివృద్ధి చెందాయి. చెన్నైలో అత్యంత సంపన్నుడిగా రాధా వెంబు నిలిచారు.

ahmedabad1 posh area

అహ్మదాబాద్

అహ్మదాబాద్ 55 సంస్థలతో దేశంలోనే అత్యంత సంప‌న్నుల జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది. 2019 నుండి ఈ ప్రాంత ఆర్థిక పురోగ‌తి మ‌రింత పెరిగింది. దీని కారణంగా ఇది ఆరవ స్థానానికి చేరుకుంది. గౌతమ్ అదానీ, అత‌ని కుటుంబం అహ్మదాబాద్‌లో అత్యంత సంపన్నుల జాబితాలో నిలిచారు.

More News

    Read more about: mumbai new delhi bangalore
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+