Search
  • Follow NativePlanet
Share
» »ముంబైలోని దాండియా, గర్బా నైట్స్‌కు బెస్ట్ లొకేషన్‌లు ఇవే..

ముంబైలోని దాండియా, గర్బా నైట్స్‌కు బెస్ట్ లొకేషన్‌లు ఇవే..

ముంబైలోని దాండియా, గర్బా నైట్స్‌కు బెస్ట్ లొకేషన్‌లు ఇవే..

దాండియా ఆటలు ఆడ...సరదా పాటలు పాడ...గుజరాత్ పడుచులు ఆడ....ప్రియుడే చెలికై చూడ.. అని ఓ సినిమాలో సినీ క‌వి అన్న‌ట్లు దాండియా కేవ‌లం గుజ‌రాత్‌లోనే కాదు. దాండియా ఆడే ప్రాంతాలు మ‌న‌దేశంలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ముంబ‌యి వంటి మ‌హాన‌గ‌రాల్లో సైతం ఈ క‌ల్చ‌ర్ న‌డుస్తోంది. ముంబై ప్రాంతం గర్బా, దాండియా నైట్‌లకు అత్యంత‌ ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో న‌వ‌రాత్రుల తొమ్మిది రోజులు భ‌క్తులు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో మాతారాణి ఆరాధ‌న‌లో మునిగితేలిపోతారు. ఇంకో వైపు ఓ స‌మూహం ఏకంగా నృత్యం, పాట‌ల‌తో ఈ పండుగ‌ను సంపూర్ణం చేసేందుకు కృషిచేస్తుంది.

garba dance

ఫల్గుణి పాఠక్ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు..

ముంబైలోని నవరాత్రులు లేదా గర్బా నైట్స్ గురించి మాట్లాడేట‌ప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఫల్గుణి పాఠక్. ఈమె స్వ‌యంగా ఇక్క‌డ జ‌రిగే దాండియా ఉత్సవానికి హాజరవుతారు. ఇది ముంబైలోని బోరివలి వెస్ట్‌లో నిర్వహించబ‌డే గర్బా నైట్స్. ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది కూడా. ఇది ప్రమోద్ మహాజన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, బోరివలిలో నిర్వహించబడుతోంది. ముంబైలోని ఈ ప్రాంతంలో అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 25, 2023 వరకు గ‌ర్బా నైట్స్ నిర్వహించబడతాయి. సాయంత్రం 7 గంట‌ల నుండి అర్థ‌రాత్రి 12.30 ఇవి కొన‌సాగ‌తాయి. వీటిని తిల‌కించేందుకు ప్రవేశ రుసుము ప్రతి రాత్రికి 499 రూపాయ‌ల‌ నుండి ప్రారంభమవుతుంది.

dandia dance

గ్రేట్ ఇండియా దాండియా ఫెస్టివల్

ముంబైలో నవరాత్రి సందర్భంగా నిర్వహించబడే అత్యంత ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల‌లో గ్రేట్ ఇండియా దాండియా ఫెస్టివల్ ఒక‌టి. ఈ కార్య‌క్రమాన్ని ఐదు రోజుల‌పాటు నిర్వ‌హిస్తారు.ఇది అక్టోబర్ 20 నుండి అక్టోబర్ 25 వరకు జరుగుతుంది. ఈ ఐదు రోజులు కార్య‌క్ర‌మంలో ఆహారం, పానీయం, సంగీతం, నృత్యం నుండి ప్రతిదీ ఏర్పాటు చేయబడుతుంది. ఇది జియో వరల్డ్ గార్డెన్, బాంద్రా తూర్పులో నిర్వహించబడుతుంది. సాయంత్రం ఏడు నుండి రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించేందుకు సుమారు 699 రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది.

రంగిలో రే...

గోరేగావ్ తూర్పు ముంబైలో నవరాత్రి రోజుల్లో నిర్వహించబడే మరో ప్రధాన కార్యక్రమం రంగిలో రే అని చెప్పుకోవ‌చ్చు. ఇక్క‌డ ఒకేసారి కనీసం 16,000 మంది ప్రజలు కూర్చుని కార్య‌క్ర‌మాన్ని వీక్షించే వెసులుబాటు ఉంటుంది. ఇది NESCO, గోరేగావ్ తూర్పులో నిర్వహించబడే కార్య‌క్ర‌మం. ఈ ఈవెంట్‌ను కూడా అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 23, 2023 వరకు నిర్వహిస్తారు. సాయంత్రం ఏడు నుండి మొద‌లై అర్థ‌రాత్రి 12.30 త‌ర్వాత ఈ ఈవెంట్ ముగుస్తుంది. ఈ ఈవెంట్‌ను తిల‌కించేందుకు సుమారు 499 రూపాయ‌లు చెల్లించాల్సిందే..

raslilanavratri

కింజల్ డేవ్‌తో రంగ్రాత్రి నైట్స్..

ఇది ముంబైలో జరగనున్న స్టార్ స్టడెడ్ గార్బా నైట్స్‌గా ప్ర‌సిద్ధి చెందింది. ఎందుకంటే ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ గాయకుడు కింజల్ డేవ్ కూడా పాల్గొంటారు. అందుకే ఈ ఈవెంట్‌ను కింజ్‌ల్ డేవ్‌తో రంగ్రాత్రి నైట్స్ అనే పేరు పెట్టారు. ఈ వేడుక‌ బోరివలి వెస్ట్‌లోని కచ్చి సర్వోదయ ట్రస్ట్ గ్రౌండ్‌లో నిర్వహించబడుతుంది. ఇక్క‌డ‌ గర్బా నైట్స్ అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 24 , 2023 వరకు నిర్వహించబడతాయి. సాయంత్రం 7 నుండి 11.30 వరకు ఈ వేడుక జ‌రుగుతుంది. దీనికి ప్రవేశ రుసుము రూ.499.

రాస్లీలా నవరాత్రి..

రాస్లీలా నవరాత్రి ఇది దక్షిణ ముంబైలో నిర్వహించబడే నవరాత్రి వేడుక. సోషల్ మీడియా ప్రభావశీలులు కూడా ఈ నవరాత్రి వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. రాస్లీలా నవరాత్రి 157, ఆర్థర్ బండర్ రోడ్, అపోలో బందర్, కొలాబాలో నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటల నుండి అర్థ‌రాత్రి వ‌ర‌కూ ఈ వేడుక జ‌రుగుతోంది. దీనికి ప్రవేశ రుసుము సుమారు 499 రూపాయ‌లు చెల్లించాలి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+