జైపూర్‌లోని గంభీరమైన ప్యాలెస్‌ల నుండి లోనావాలాలోని నిర్మలమైన అందాల వరకు పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అనుభూతిని మాటల్లో చెప్పలేం. అందుకోసం పర్యాటకులను మంత్రముగ్దులను చేసే భారతదేశంలోని కొన్ని గమ్యస్థానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడి విస్మయపరిచే దృశ్యాలు, మరపురాని జ్ఞాపకాలను అందించే వైమానిక సాహసయాత్రను ఆస్వాదించేందుకు సిద్దమవ్వాల్సిందే..

జైపూర్
పింక్ సిటీగా పిలవబడే ఈ నగరంలో ప్యాలెస్‌లు, కోటలు, గంభీరమైన ఆరావళి కొండల ఉత్కంఠభరితమైన దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇక, జైపూర్‌లోని హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ నిజంగా ఆకర్షణీయంగా ఉండడంతోపాటు ఇక్కడి చారిత్రక నగర ప్రత్యేక దృక్పథాన్ని పర్యాటకులకు అందిస్తుంది. ఎయిర్ బెలూన్ రైడ్‌లో జైపూర్ చరిత్ర, నిర్మాణ వైభవాన్ని చూసి పర్యాటకులు తప్పకుండా మంత్రముగ్ద్దులవుతారు. జైపూర్ సందర్శన శాశ్వతమైన జ్ఞాపకాలను చేరువచేయాలంటే ఇది ఒక గొప్ప అవకాశమనే చెప్పుకోవాలి.
ఆగ్రా
ప్రేమ చిహ్నాలైన తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ యొక్క వైమానిక వీక్షణను అందించే హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ జీవితంలో మర్చిపోలేని ప్రత్యేక అనుభూతి. ముఖ్యంగా మీకు ఎంతో ప్రత్యేకమైన వారితో ప్రేమను పంచుకునేదందుకు ఇది ఎంతో ఉత్తమమైన మార్గం. తమ అభిమానాన్నిఇతరులతో చిరస్మరణీయంగా వ్యక్తపరచాలనుకునే వారికి ఈ ప్రాంతం ఒక ప్రత్యేకమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఈ ప్రాంతపు అందాలను రైడ్‌లో వీక్షించొచ్చు. ఇది ఒక అసాధారణమైన, రొమాంటిక్ సాహసంగా కూడా అభివర్ణించవచ్చు.

గోవా
గోవా మీదుగా హాట్ ఎయిర్ బెలూన్ ప్రయాణాన్ని సాగించడమంటే, దాని తీరప్రాంతం, సహజమైన బీచ్‌లు, పచ్చని దృశ్యాలను దగ్గరగా చూసినట్లే. హనీమూన్ జంట లేదా అడ్వెంచర్ కోసం వెతుకుతున్న పార్టీ ఔత్సాహికులైనా గోవాలో అంతిమ గమ్యస్థానం మాత్రం ఈ రైడ్ అనే చెప్పుకోవాలి. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు, ప్రశాంతమైన తీరాలను చూసేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది సందర్శకులు తరలివస్తుంటారు. ఈ గోవా అనుభవానికి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌లను జోడించడం వల్ల ఈ క్షణాలను ఇంకా ఆస్వాదించొచ్చు. ప్రేమను, ఆనందాన్ని పంచుకోవాలనుకునే వారికి చిరస్మరణీయమైన జ్ఞాపకాలను అందిస్తుంది ఈరైడ్.
మనాలి
హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌ను హిమాలయాల్లోని మనాలి మీదుగా కూడా రైడ్ చేయొచ్చు. ఈ రైడ్‌లో పైకి వెళ్లే కొలది అద్భుతమైన అందాలను చూడొచ్చు. మనాలిలోని హాట్ ఎయిర్ బెలూన్ అడ్వెంచర్ ఖచ్చితంగా ఓకొత్త అనుభవాన్ని పర్యాటకులకు అందిస్తుంది. ఇది ఇప్పటికే పర్యాటకుల హృదయాలను మరింత చేరువయ్యింది. ఇక్కడి హిల్‌స్టేషన్‌లపై, హిమాలయాలు దట్టమైన లోయల మీదుగా ఈ ప్రయాణం కొనసాగించవచ్చు. హిమాలయాల మీద ప్రయాణం ఒక థ్రిల్లింగ్ అనుభూతినే ఇస్తుంది. ఈ అద్భుతమైన మరపురాని జ్ఞాపకాలను అస్సలు మిస్సవ్వొద్దు.

డార్జిలింగ్
డార్జిలింగ్‌లోని తేయాకు తోటలు, రోలింగ్ కొండలు, విస్మయపరిచే హిమాయాల అందాలను చూడాలంటే ఖచ్చితంగా హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణం చేయాల్సిందే. ఇక్కడి దృశ్యాలను పర్యాటకులను మంత్రముగ్థులను చేస్తాయి. ఇది బడ్జెట్‌కు అనుకూలమైన రైడ్. ఈ ప్రాంతంలోని ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మైమరింపజేస్తాయి. ఈ బెలూన్ రైడ్‌లో కనీసం 15 మంది వరకూ పాల్గొంటారు. ఈ సాహాసాన్ని ఆస్వాదించేందుకు అక్టోబర్ నుండి మే వరకు ఎంతో ఉత్తమమైన సమయం. ఈ రైడ్ డార్జిలింగ్ ప్రయాణాన్ని మరింత ఉల్లాసభరితంగా మారుస్తుంది.



Click it and Unblock the Notifications















