భారతదేశం లౌకిక దేశం అయినప్పటికీ, హిందూ మతస్థులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ కారణంగా పవిత్ర హిందూ దేవాలయాలు కూడా ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. ఇక్కడ ప్రతిరోజూ చిన్న దేవాలయాల నుండి పెద్ద దేవాలయాల వరకు భక్తుల తాకిడితో కిటకిటలాడుతుంటాయి. 2023 మరికొద్దిరోజుల్లో ముగియబోతుంది. ఇక, కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతున్నాం. ఈ సందర్భంగా 2023లో భారతీయులు ఎక్కువగా సందర్శించిన దేవాలయాల గురించి ఓసారి మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం, భారతదేశంలోని చాలా మంది ప్రజలు ఈ ఆలయాలను సందర్శించారు. కింది జాబితాలోని ఏ ఆలయాన్నయినా మీరు వీక్షించకపోతే సంవత్సరం ముగుస్తున్నందున ఖచ్చితంగా వాటిని సందర్శించేలా ప్రణాళిక వేసుకోండి.

కేదార్‌నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం ఎంతగానో ప్రసిద్ధిచెందింది. ఈ ఏడాది పర్యాటకులు ఎక్కువగా సందర్శించిన ఆలయాల్లో ఈ ఆలయం ముందువరుసులో ఉంది. ఈ ఆలయం మతపరమైన ఆసక్తి ఉన్న పర్యాటకులలో మాత్రమే కాకుండా ఇతర ప్రకృతి ప్రేమికుల జాబితాలో కూడా ఉంటుంది. ఇది హిమాలయ హిమానీనదాల మధ్య ఉంది. శీతాకాలంలో ఈ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. అందుకే ఏడాదిన్నర పాటు ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఈ ఆలయం శివుని కోసం నిర్మించబడింది. యాత్రికులు ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే సుమారు 14 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే.
వైష్ణో దేవి ఆలయం
జమ్మూ కాశ్మీర్ లో ఉన్న శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతి ఏటా భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఏడాది భక్తులు ఎక్కువగా సందర్శించిన్న ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం అతి పురాతనమైనది. వైష్ణో దేవి ఆలయం ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం ప్రజలలో విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. 200 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంటుంది. కత్రా వద్ద ఉన్న బేస్ క్యాంప్ నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే ట్రెక్కింగ్ చేయాల్సిందే.

జగన్నాథ దేవాలయం
2023లో భారతీయులు ఎక్కువగా సందర్శించిన దేవాలయాల్లో ఒడిశాలోని జగన్నాథ దేవాలయం పేరు కూడా ఉంది. ఇది పూరీలోని జగన్నాథుని ఆలయం. ఇది అనేక కారణాల వల్ల ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా పేరుగాంచింది. రథయాత్ర అనేది జగన్నాథుడు. అతని తోబుట్టువుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పురాతన ఆలయం చుట్టూ జరిపే పండుగ. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ పండుగ సంబరాలను వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు పూరీకి బయలుదేరుతారు. జగన్నాథ దేవాలయం కృష్ణ భగవానుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం లోపల ప్రసిద్ధిచెందిన రాజ వంటగదిని తప్పక చూడాల్సిందే.
అమర్‌నాథ్ గుహ దేవాలయం
అమర్‌నాథ్ గుహ దేవాలయాన్ని కూడా ఈ సంవత్సరం పర్యాటకులు ఎక్కువగా సందర్శించారు. ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. ఇది 5000 సంవత్సరాల కంటే పాతది. ఈ దేవాలయం 3900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కాబట్టి మంచు కురుస్తున్న కారణంగా ఆలయానికి వెళ్లే మార్గం మూసివేయబడ్డం వల్ల శీతాకాలంలో ఈ ఆలయాన్ని సందర్శించలేరు. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం మానవ నిర్మితం కాదు. ఇది మంచుతో చేసిన సహజమైన గుహ, ఇక్కడ మంచు లింగాన్ని పూజిస్తారు. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు, యాత్రికులు ఈ గుహను చేరుకునేందుకు ట్రెక్కింగ్ చేస్తుంటారు.

శ్రీ వేంకటేశ్వర దేవాలయం
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో వెలసిన ఒక హిందూ దేవాలయం. ఇది తిరుమల కొండలలో వెలసిన పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని సంద్శించేందుకు ప్రతి రోజు 50,000 మంది యాత్రికులు వస్తుంటారు. ఈ ఆలయం ఏడాది పొడవునా సందర్శకుల తాకిడితో కొలాహాలాంగా ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన, పవిత్రమైన దేవాలయాలలో ఒకటిగా దీనిని పరిగణించారు



Click it and Unblock the Notifications













