Search
  • Follow NativePlanet
Share
» »భార‌త‌దేశంలోని అత్యంత అంద‌మైన రైలుమార్గాలు ఇవే...

భార‌త‌దేశంలోని అత్యంత అంద‌మైన రైలుమార్గాలు ఇవే...

భార‌త‌దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే వ్య‌వ‌స్థ‌. చాలా మంది రైలు ప్రయాణం చేసేందుకు ఆస‌క్తి క‌న‌బరుస్తారు. ఎందుకంటే ఏ ఇత‌ర ర‌వాణా క‌న్నా రైల్వే ఛార్జీలు త‌క్కువగా ఉండ‌డంతో పాటు సౌక‌ర్య‌వంతంగా ఉంటాయి. అందుకే ఎక్కువ మంది ప్ర‌యాణికులు రైలు మార్గాన్నే ఎంచుకుంటారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెరుగైన సేవలను అందించ‌డంలో కూడా రైల్వే శాఖ ఎప్పుడూ ముందుంటుంది. రైలు ప్ర‌యాణం ఓ స‌రికొత్త అనుభూతిని కూడా క‌లిగిస్తుంది.

భారతీయ రైల్వేలు దేశంలోని వివిధ ప్రాంతాల గుండా ప్ర‌యాణిస్తుంటాయి. అయితే రైలు నెట్‌వర్క్ ఎంతో పొడవైన మార్గాన్ని విస్తరించి ఉంది. ఈ రైలు ప్ర‌యాణంలో ఎంతో ఆకర్షణీయంగా, అందంగా ఉండే కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. ఈ మార్గాల్లో రైలు ప్రయాణం చేయడం ద్వారా జీవితంలో మర్చిపోలేని అందాలను చూడ‌డంతోపాటు స‌రికొత్త అనుభూతుల‌ను కూడా ఆస్వాదించవ‌చ్చు. భార‌త‌దేశంలో అత్యంత అందంగా ఉండే రైలు మార్గాలు కూడా ఉన్నాయి. ఇప్ప‌డు భారతదేశంలోని అలాంటి కొన్ని రైలు మార్గాల గురించి తెలుసుకుందాం.

ముంబై-గోవా రైలు ప్రయాణం

కొన్ని రైలు మార్గాలు ప్రకృతి అందాల‌తో పర్యాట‌కుల‌కు క‌నువిందు చేస్తూ ఉంటాయి. అలాంటి రైలు మార్గాల‌లో ముంబై- గోవా రైలు ప్ర‌యాణం ఒక‌టి. ముంబైలో నివసిస్తూ గోవా ప్ర‌యాణం చేయాల‌నుకునేవారు విమానానికి బదులుగా ట్రైన్‌ను బుక్‌చేసుకోవ‌డం ఎంతో ఉత్త‌మం. ఎందుకంటే ముంబై గోవా రైలు ప్ర‌యాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రయాణానికి సుమారు 14 గంటల స‌మ‌యం పడుతుంది. ముంబై నుంచి గోవా ప్రయాణం కోసం ఈ రైలు అరేబియా సముద్రం ఒడ్డు గుండా ప్ర‌యాణిస్తుంది. అలాగే భారతదేశంలోనే అత్యంత అందమైన రైలు ప్రయాణంగా దీనిని చెప్పుకోవచ్చు. గోవా వెళ్లేవారు కచ్చితంగా ఈ రైలులో ఒక్కసారైనా ప్రయాణించాలని కోరుకుంటారు.

mandapam-rameswaramtrain

మండపం- రామేశ్వరం రైలు మార్గం

పాంబన్ ద్వీపంలో నిర్మించిన రామేశ్వరం ఎంతో ప్రశాంతంగా, ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. ఇది భారతదేశంలోని రెండవ పొడవైన వంతెన, పాక్ జలసంధి, రామేశ్వరం నుండి పాంబన్ ద్వీపానికి భారతదేశాన్ని కలుపుతూ ఉంటుంది. రైలులో ఈ మార్గం గుండా ప్ర‌యాణించేందుకు ఒక‌గంట స‌మ‌యం మాత్ర‌మే పడుతుంది.

guwahati-silchartrain

గౌహతి- సిల్చార్ రైలు మార్గం

లుమ్డింగ్, బరాక్ వ్యాలీ గౌహతి నుండి సిల్చార్ రైలు మార్గంలో ప్ర‌యాణం ప‌ర్యాట‌కులకు ఒక స‌రికొత్త అనుభూతినిస్తాయి. ఈ ప్రయాణంలో జటింగా నది, సుదూర తేయాకు తోటలు, పచ్చని అస్సాం వ్యాలీని చూడొచ్చు. ఇక్క‌డ ప్ర‌యాణం చేసేందుకు సుమారు ప‌ది గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. కానీ ఈ మార్గం చుట్టూ ప్ర‌కృతి అందాల‌తో ఎంతో అందంగా, అద్భుతంగా ఉంటుంది.

ratnagiri-mangaloretrain

రత్నగిరి- మంగళూరు రైలు మార్గం

ర‌త్న‌గిరి- మంగ‌ళూరు గుండా ప్ర‌యాణంచే రైలు మార్గం కొంకణ్ రైల్వే ప్రయాణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పొడవైన సొరంగం, దట్టమైన అడవి, నది, వంతెన గుండా ఈ ప్ర‌యాణం సాగుతుంది. ఈ రైలు ప్రయాణానికి కూడా సుమారు 10 గంటల స‌మ‌యం పడుతుంది. ఈ ప్ర‌యాణం ప‌ర్యాట‌కుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తుంది.

బెంగళూరు-కన్యాకుమారి ఐలాండ్ ఎక్స్‌ప్రెస్

భారతదేశంలోని అత్యంత అందమైన రైలు మార్గాల జాబితాలో బెంగుళూరు- క‌న్యాకుమారి ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ కూడా కూడా చేర్చబడింది. ఈ ప్ర‌యాణానికి సుమారు 15 గంటల స‌మ‌యం పడుతుంది. ఇక్క‌డ‌ అనేక ప్రదేశాల అందాలను ఏకకాలంలో చూడొచ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+