Search
  • Follow NativePlanet
Share
» »ఈ ఏడాది ఇండియ‌న్స్ అత్య‌ధికంగా సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్లేస్‌లు ఇవే...

ఈ ఏడాది ఇండియ‌న్స్ అత్య‌ధికంగా సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్లేస్‌లు ఇవే...

ఈ ఏడాది పూర్తికావ‌స్తోంది.. మ‌రికొద్దిరోజుల్లో కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్ట‌బోతున్నాం. అయితే, ఈ ఏడాది భార‌తీయులు గూగుల్‌లో అత్య‌ధికంగా సెర్చ్ చేసిన ప్రాంతాల లిస్ట్‌ను గూగుల్ విడుద‌ల చేసింది. అందులో భార‌త్‌లోని ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. అవెంటో ఒక‌సారి చూద్దాం.. ఎక్కువ‌మంది ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించే జాబితాలో ఎప్పుడూ బీచ్‌లు, గుహ‌లు, ప్ర‌కృతి అందాలైన జ‌ల‌పాతాలు, చారిత్ర‌క ప్ర‌దేశాల‌తో పాటు ప‌ర్యాట‌కుల మ‌న‌సు దోచే ప్రాంతాలెన్నో ఉన్నాయి. గూగుల్ విడుద‌ల చేసిన జాబితాలో ఈ ప్ర‌దేశాలే ఎక్కువ‌గా ఉన్నాయి.

goa beaches

గోవా

ఇయర్ ఇన్ సెర్చ్ 2023' విడుద‌ల చేసిన నివేదిక ప్రకారం. భారతీయులు ఎక్కువ‌గా గూగుల్ సెర్చ్ చేసిన ట్రెండింగ్ టూరిస్ట్ ప్లేస్‌గా వియ‌త్నం మొద‌ట‌గా నిలిచింది. ఇక‌, రెండో స్థానంలో భార‌త్‌లోని గోవా నిలిచింది. భార‌త్‌లోని గోవా బీచ్‌ల‌కు చెందింది. ప్ర‌త్యేకంగా ఇక్క‌డి బీచ్‌ల‌ను చూసేందుకు చాలామంది జ‌నం ఎగ‌బ‌డుతుంటారు. ఈ ప్ర‌దేశానికి ఎక్కువ‌మంది యూత్ వ‌స్తుంటారు. ఇక్కడి బీచ్‌లు, కట్టడాలు, పచ్చదనం, అందమైన సూర్యోదయ, సూర్యాస్తమయాలు చూడటానికి ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు బారులు తీరుతుంటారు. అలాగే ఇక్కడ ప్ర‌సిద్ధిచెందిన అగ్వాడ కోటను కూడా త‌ప్ప‌కుండా సంద‌ర్శించాల్సిందే. ఈ కోట 1612 లో డచ్ వాళ్ళ నుండి రక్షణ కోసం నిర్మించిన‌ది.

kashmir dal lake

కాశ్మీర్

గోవాతో పాటు మ‌రో భార‌తీయ ప‌ర్యాట‌క ప్ర‌దేశం కూడా ఈ జాబితాలో ఉంది. అదే కాశ్మీర్‌. కాశ్మీర్‌ను భూత‌ల స్వ‌ర్గం అని పిలుస్తారు. ఇక్కడి ఉద్యానవనాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ఇంకా ఇక్కడ సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలున్నాయి. అందులో శ్రీనగర్, గుల్ మార్గ్, పహల్‌గావ్ కాశ్మీర్‌లో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు. శ్రీనగర్ నుండి పహల్ గావ్ 110 కిలోమీటర్లు ఉంటుంది. సాఫ్రాన్ టౌన్ పాపోర్, మార్ట్ లాండ్ టెంపుల్, సన్ టెంపుల్ వంటివి ఇక్క‌డ‌ సందర్శనీయ స్థలాలుగా పేరుగాంచాయి. ప్ర‌కృతి ప్రేమికుల‌ను, అలాగే ల‌వ్‌బ‌ర్డ్స్‌కు ఈ ప్రాంతాలు ఎంత‌గానో న‌చ్చుతాయి. ఈ ప్ర‌దేశం షూటింగ్‌ల‌కు కూడా ప్ర‌సిద్ధిచెందింది. చాలా సినిమాల్లో కాశ్మీర్ అందాల‌ను వర్ణిస్తూ పాటలు కూడా వచ్చాయి. ఇక్క‌డి శ్రీనగర్, దాల్ సరస్సు అందాలకు ప‌ర్యాట‌కులు మంత్ర ముగ్ధుల‌వ్వాల్సిందే..

coorg buddhist monastry

కూర్గ్

ఇయర్ ఇన్ సెర్చ్ 2023' విడుద‌ల చేసిన జాబితాలో భార‌త్‌లోని కూర్గ్ ప్రాంతం కూడా ఉంది. ఈ ప్ర‌దేశం ఎక్కువ‌గా హానిమూన్ ప్లేసెస్‌కు ప్ర‌సిద్ధిచెందింది. ఈ ప్రాంతానికి ఎక్కువ‌గా కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌లు వ‌స్తుంటారు. ఇక్క‌డి విశాలమైన కాఫీ తోటలు, పచ్చని అరణ్యాలు, పొగమంచుతో నిండిన కొండలు, లోయలు ప‌ర్యాట‌కుల‌ను మ‌న‌సుల‌ను దోచేస్తాయి. కూర్గ్‌ను కొడగు అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్రాంతం కర్నాటక రాష్ట్రంలో ఉన్న అతి చిన్న ప్రాంతం. అయినా ఈ ప్ర‌దేశం ఎంతో అందంగా ఉంటుంది. కూర్గ్‌ జలపాతాలకు నిలయం అని చెప్పుకోవ‌చ్చు. ఇక్క‌డ అబ్బే జలపాతం, ఇరుప్పు జలపాతం, బ్రహ్మగిరి కొండలు, నాగర్ హోల్ నేషనల్ పార్క్, ఓంకారేశ్వర దేవాలయం వంటి టూరిస్టు స్పాట్స్ చాలా ఉన్నాయి.

అండమాన్ అండ్ నికోబార్

వీటితో పాటు భార‌త్‌లోని కేంద్ర పాలిత ప్రాంతమైన అండ‌మాన్ అండ్ నికోబార్ దీవులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దీవులను చూసేందుకు ఎక్కువ‌గా క‌పుల్స్ వ‌స్తుంటారు. ఇక్క‌డ ప‌ర్యాట‌కులు సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. అందులో పోర్ట్ బ్లెయిర్‌లో సెల్యులార్ జైలు, మహాత్మాగాంధీ మెనైన్ నేషనల్ పార్క్, అండమాన్ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, వండూర్ బీచ్, ఫారెస్ట్ మ్యూజియం వంటివి చూడాల్సిన ప్రాంతాలు.

More News

    Read more about: year in search 2023 list
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+