Search
  • Follow NativePlanet
Share
» »ఈ వారంత‌పు సెలవుల సంద‌ర్శ‌న‌కు హిమాచ‌ల్‌లోని ఈ ప్ర‌దేశాలు ఉత్త‌మం..

ఈ వారంత‌పు సెలవుల సంద‌ర్శ‌న‌కు హిమాచ‌ల్‌లోని ఈ ప్ర‌దేశాలు ఉత్త‌మం..

ఈ వారంత‌పు సెలవుల సంద‌ర్శ‌న‌కు హిమాచ‌ల్‌లోని ఈ ప్ర‌దేశాలు ఉత్త‌మం..

ఈ వారంతంలో ద‌స‌రా సెలవులు రాబోతున్నాయి. ఈ వీకెండ్‌కు స‌రాదాగా ఎక్క‌డికైనా వెళ్లాల‌ని అనుకుంటే మాత్రం హిమాచల్‌లోని వ్యాలీకి ప్లాన్ చేసుకోవచ్చు. సైన్జ్ వ్యాలీ కులు మనాలి నుండి సుమారు 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. సుదూర ప్రాంతాలకు విస్తరించి ఉన్న పచ్చిక బయళ్ళు సైన్జ్ లోయలోని ప్రత్యేకతలుగా చెప్పుకోవ‌చ్చు. ఇక్క‌డి అందాల‌ను వీక్షించేందుకు ప్ర‌తిఏటా ప‌ర్యాట‌కులు త‌ర‌లి వ‌స్తుంటారు. ఈ లోయ ఎంతో ప్ర‌శాంత‌మైన, అందమైన, సుందరమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. హిమాచల్‌లో సంద‌ర్శించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్న‌ప్ప‌టికి. దేని ప్ర‌త్యేక‌త దానికే ఉంటుంది.

ఇక్క‌డి ప్ర‌దేశాల‌ను రెండుమూడు రోజుల సెల‌వుల్లో వీక్షించొచ్చు. కులు మనాలి నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నసైన్జ్ వ్యాలీ కూడా అటువంటి ప్రదేశమే. ఈ ప్రాంతం అన్ని వైపుల నుండి ఎత్తైన, పచ్చని పర్వతాలతో చుట్టుముట్టబడి ఉంది. ఈ ప్రదేశం అందంగా ఉండటమే కాకుండా, న‌గ‌ర హాడావుడికి దూరంగా కూడా ఉంటుంది. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో కాసేపు ఇక్క‌డ సేద‌తీరొచ్చు. సైన్జ్ వ్యాలీ ప‌ర్యాట‌కుల‌ను ప్రకృతికి దగ్గరయ్యేలా చేస్తుంది. మ‌రెందుకాల‌స్యం ఈ సెల‌వుల్లో మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టేయండి మ‌రి...

pundarikrishilake

షాంఘర్

హిమాచ‌ల్‌లోని సైన్జ్ వ్యాలీలో చాలా అందమైన గ్రామాలు ఉన్నాయి. వాటిలో ఒకటి షాంఘర్. ఈ ప్రాంతంలోనే పాండవులు కొంత‌కాలం గడిపార‌ని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో ఒక స్థానిక దేవ‌తామూర్తి ఆల‌యం కూడా ఉంది. ఆ ఆల‌యం పేరు షాంగ్చుల్ మహాదేవ్ ఆలయం. ఈ ప్రదేశం ట్రెక్కింగ్ ప్రియులకు ఎంతో ఉత్తమమైనది అని చెప్పుకోవ‌చ్చు. ప‌ర్యాట‌కులు ఇక్కడ అందమైన గడ్డి మైదానాలను కూడా చూడొచ్చు.

sainzvalley

పుండరీక్ రిషి సరస్సు

ఈ ప్ర‌దేశంలో ఒక సరస్సు కూడా ఉంది. దీనిని పుండరిక్ రిషి సరస్సు అని కూడా పిలుస్తారు. ఈ సరస్సు ఇక్కడి ప్రజలకు చాలా ప్రత్యేకమైన ప్రదేశం. ఈ సరస్సు ఏర్పడటానికి స్థానిక ప్ర‌జ‌ల్లో అనేక కథలు ఉన్నాయి. ప‌ర్యాట‌కులు ఈ సరస్సు ఒడ్డున కూర్చొని ఈ ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో రిలాక్స్ అవ్వొచ్చు. చుట్టూ ఉన్న అందాలను మీ కెమెరాల‌లో బంధించవచ్చు.

kulumanali

ట్రెక్కింగ్‌..

సైన్జ్ వ్యాలీ ట్రెక్కింగ్‌కు ఎంతో ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం. ఇక్క‌డి దట్టమైన అడవుల్లో ట్రెక్కింగ్ చేయడం ప‌ర్యాట‌కులకు ఒక విభిన్నమైన అనుభూతినిస్తుంది. ఇక్కడ ఉత్తమ ట్రాక్ హిమాలయన్ నేషనల్ పార్క్ ట్రాక్ కూడా ఉంది. ఇది సుమారు 1,170 చదరపు కిలోమీట‌ర్ల మేర వ్యాపించి ఉంది. ఈ జాతీయ ఉద్యానవనంలో 830 కంటే ఎక్కువ వృక్ష జాతులు ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఈ పార్క్ సముద్ర మట్టానికి సుమారు 5,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

చేరుకోవ‌డం ఎలా...

కారు మార్గం ద్వారా ఇక్క‌డికి రావాల‌నుకుంటే మాత్రం ఢిల్లీ నుండి సుమారు 480 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. అందుకు ముందుగా ఛండీగ‌డ్ మీదుగా సిమ్లా, కులు చేరుకోవ‌చ్చు. కులు నుండి సైన్జ్ వ్యాలీకి సుమారు 50 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. ఇక‌, బ‌స్సుమార్గం ద్వారా వెళ్లాల‌నుకునేవారు ఢిల్లీ, చండీగఢ్, హర్యానా వంటి అనేక ఇతర నగరాల నుండి మనాలికి బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుండి సైన్జ్‌వాలీకి టాక్సీలు లభిస్తాయి. విమానం ద్వారా అయితే, కులు-మనాలి సమీప విమానాశ్రయం. అక్క‌డి నుండి సైన్జ్ వ్యాలీకి చేరుకునేందుకు టాక్సీలు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+