Search
  • Follow NativePlanet
Share
» »ముంబైలోని ఈ ప్రాంతాలు ప‌్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌కి ఎంతో ఉత్త‌మం..

ముంబైలోని ఈ ప్రాంతాలు ప‌్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌కి ఎంతో ఉత్త‌మం..

ఒక‌ప్పుడు పెళ్లిళ్లంటే ఎంతో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా, ఆచార వ్య‌వ‌హారాల‌తో జ‌రిగేవి. అప్ప‌ట్లో ఐదు రోజుల పెళ్లిళ్లు జ‌రిగేవి. ఒక‌రిని ఒక‌రు చూసుకోకుండా పెళ్లిపీట‌ల మీద చూసుకునేవారు. కానీ, ఇప్ప‌డు పెళ్లిళ్లు అలా లేవు. వాటికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా పెళ్లికి ముందే ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లు వ‌ధువ‌రూలు ఇద్ద‌రు పెళ్లికి ముందే ఫోటోలు దిగ‌డం లాంటివి. హ‌ల్దీ ఫంక్ష‌న్‌, మెహందీ ఫంక్ష‌న్ అని ఇప్పుడు చాలా ర‌కాలుగా వ‌చ్చాయి. ఈ పెళ్లి అనే ఘ‌ట్టాన్ని ఎంతో అందమైను గుర్తుగా ఉంచుకోవాలని చాలామంది పెళ్లికి ముందు ప‌్రీ వెడ్డింగ్ షూట్‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

అయితే, మ‌న‌దేశంలో ప‌్రీ వెడ్డింగ్ షూట్‌లు చేసుకునేందుకు చాలామంచి ప్ర‌దేశాలున్నాయి. అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో ఫ్రి వెడ్డింగ్ చేసుకునేందుకు కూడా అనువైన ప్ర‌దేశాలున్నాయి. ముంబై న‌గ‌రం అంద‌ర‌కి క‌ల‌ల ప్ర‌పంచం. ఇక్క‌డ అంద‌మైన ప్ర‌దేశాల‌కు, లోకేష‌న్ల‌కు కొద‌వేలేదు. కాబ‌ట్టి కొత్త‌గా పెళ్లిచేసుకోవాల‌నుకునేవారు త‌మ ప‌్రీ వెడ్డింగ్ షూట్ కోసం ముంబైలోని ఈ లోకేష‌న్లు బెస్ట్ ప్లేసెస్ గా చెప్పొచ్చు. రండి ఆ ప్రాంతాలెంటో చూద్దాం.

hanginggardens1

హాంగింగ్ గార్డెన్స్

ముంబైలో ప్రసిద్ధ ప్ర‌దేశాల‌లో హాంగింగ్ గార్డెన్స్ ఒక‌టి. ఇది ప‌్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌కు ఎంతో అనువైన ప్ర‌దేశం. సుంద‌ర‌మైన ప్రకృతి దృశ్యాలు ఈ ప్రాంతం సొంతం. ఈ హాంగింగ్ గార్డెన్ మలబార్ హిల్ పైభాగంలో ఉంటుంది. ముంబయి టూరిజంలో ఆకర్షణీయమైన ఉద్యానవనంగా ఇది పేరుగాంచింది. ఈ ఉద్యానవ‌నాన్ని 1881లో ఉల్హాస్ ఘపోకర్ ప్రధాన బొంబాయి రిజర్వాయర్ లైన్ మీదుగా నిర్మించాడు. ఈ ఉద్యానవనం కమలా నెహ్రూ పార్కుకు ఎదురుగా ఉంటుంది. ఇది తోట ప్రాంగణంలో నిర్మించిన భారీ షూ లేదా బూట్ హౌస్ కారణంగా పిల్ల‌ల్లో ఎంతో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పార్క్ అందమైన చెట్లు, మొక్కలు పూలతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతం విహ‌రయాత్ర‌ల‌కు కూడా ప్ర‌సిద్ధి చెందింది. కొత్త‌గా పెళ్ల‌యిన‌వారికి, పెళ్లి చేసుకునేవారికి కూడా ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ద‌నే చెప్పుకోవాలి.

sanjaygandhinationalpark

సంజయ్ గాంధీ నేషనల్ పార్క్

ముంబైలో ప్రీ వెడ్డింగ్ షూట్‌కు ప్ర‌సిద్ధిచెందిన మ‌రో ప్రాంతం సంజ‌య్ గాంధీ నేష‌న‌ల్ పార్క్‌. ముంబైలోని ప్రశాంతమైన ప్రదేశాల కోసం చూస్తున్న జంటల కోసం ఎంతో అనువైన‌ది. ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌ను 1969లో ప్రారంభించారు. ఈ పార్క్‌ను కృష్ణగిరి ఉప్వాన్" లేదా "బోరివలి నేషనల్ పార్క్‌గా పిలుస్తారు. ఈ జాతీయ ఉద్యానవనం దాదాపు 104 చద‌రపు కిలోమీట‌ర్ల‌ విస్తీర్ణంలో ఉంటుంది. ఇది పశ్చిమ రైల్వేలోని బోరివలి రైల్వే స్టేషన్ నుండి కీలోమీట‌ర్ల దూరంలో ఉంది. ప‌చ్చ‌ద‌న‌పు బ్యాక్‌డ్రాప్ ఫోటోషూట్‌లకు సరైన ప్ర‌దేశం ఇది. ఈ పార్క్ ఎంతో అందంగా ఉంటుంది.

juhubeach

జూహూ బీచ్..

జూహు బీచ్ ముంబైలోని అత్యుత్తమ బీచ్‌లలో ఒక‌టి ప్ర‌సిద్ధిగాంచింది. ఈ ప్రాంతం ప‌్రీ వెడ్డింగ్ షూట్‌ల‌కు ఎంతో అనువైన‌ది. ఇక్క‌డికి వ‌చ్చిన జంట‌లు అద్భుతమైన‌, అందమైన సన్ రైజ్, సన్ సెట్ స‌మయ‌మంలో మీ కెమెరాల‌కు ప‌ని చెప్పొచ్చు. పెళ్లి కావాల్సిన వారు, కొత్త జంటలు ఈ బీచ్‌లో స‌ర‌దాగా గ‌డపొచ్చు. అందమైన ఫోటోలు దిగేందుకు ఈ ప్రాంతం ఎంతో ఉత్త‌మం.

మెరైన్ డ్రైవ్

ముంబ‌యిలో ప్ర‌సిద్ధిచెందిన మ‌రో ప్రాంతం మెరైన్ డ్రైవ్‌. ఈ ప్రాంతాన్ని 'ది క్వీన్స్ నెక్లెస్' అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం ప‌్రీ వెడ్డింగ్ షూట్‌కు ఎంతో అనువైన‌ది. ఈ లోకేష‌న్‌లో అంద‌మైన ఫోటోల‌కు ఫోజులివ్వొచ్చు. ముంబ‌యిలోని అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ లొకేషన్‌లలో ఈ ప్రాంతం ఒక‌టిగా నిలిచింది.

గేట్‌వే ఆఫ్ ఇండియా

గేట్‌వే ఆఫ్ ఇండియా పేరు విన‌ని వారుండ‌రు. ఈ ప్ర‌దేశం మ‌ధ్య‌యుగ వాస్తుశిల్పానికి అంద‌మైన ప్రాతినిధ్యం వ‌హిస్తుంది.

ముంబైలోని ఈ స్మారక చిహ్నం ముంబైలో ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌కి అద్భుతమైన లొకేషన్ అని చెప్పుకోవ‌చ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+