Search
  • Follow NativePlanet
Share
» »దేశంలోని ఈ నదులు అందమైన ప్ర‌కృతి దృశ్యాల‌ను అందిస్తాయి

దేశంలోని ఈ నదులు అందమైన ప్ర‌కృతి దృశ్యాల‌ను అందిస్తాయి

దేశంలోని ఈ నదులు అందమైన ప్ర‌కృతి దృశ్యాల‌ను అందిస్తాయి

దేశంలోని ప్ర‌ముఖ జీవ‌నదుల‌ను క‌నులారా ఆస్వాదించే ప్ర‌యాణాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. మీరు కూడా వేసవి సెలవులలో జ‌ర్నీ ప్లాన్ చేస్తుంటే, ఈ అందమైన నదులను త‌ప్ప‌కుండా చూడండి. ఇక్క‌డి న‌దీ తీర‌పు అందం మిమ్మల్ని మంత్రముగ్దులను చేస్తాయి. దేశంలోని ఈ అగ్ర నదుల గురించి తెలుసుకుందాం.

మ‌న దేశంలో అడుగడుగునా పర్యాటక ప్రదేశాలు ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తాయి. ప‌చ్చ‌ద‌నం ప‌ర‌చిన పర్వతాలు, నదులు, జలపాతాలతో ప్ర‌కృతి సృష్టించిన అద్భుత దృశ్యాలు క‌నువిందు చేస్తాయి. ఈ రోజు మనం జీవ న‌దుల విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడ మీరు ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఇక అస్స‌లు ఆల‌స్యం చేయొద్దు బ్యాగ్‌లను ప్యాక్ చేసి, మీ వేసవి సెలవులకు సిద్ధంగా ఉండండి.

riverganga1

గంగానది

మ‌న దేశంలోనే అత్యంత ప‌విత్ర‌మైన న‌దిగా ప్ర‌సిద్ధి పొందింది గంగా నది. ఇది హిమాలయాల నుండి భూమికి దిగుతుంది. ఈ విధంగా, గంగ దేశంలోని అనేక రాష్ట్రాల గుండా వెళుతుంది. కానీ మీరు దాని నిజమైన అందంతో ముఖాముఖిగా చూడాలనుకుంటే, వేసవి సెలవుల్లో రిషికేశ్, హరిద్వార్ లేదా బనారస్‌లో అడుగుపెట్టాల్సి ఉంటుంది. నీటిలో చేసే సాహ‌స క్రీడ‌ల‌కు ఈ ప్రాంతాన్ని కేరాఫ్ అడ్ర‌స్‌గా చెబుతారు. ఉవ్వెత్తున ఎగ‌సిప‌డే నీటి అల‌ల తాకిడి వేగాన్ని మ‌రెక్క‌డా చూడ‌లేం. మండు వేస‌విలో కూడా వ‌ణుకు పుట్టించే స్వ‌చ్చ‌మైన నీటి అందాల‌ను చూసేందుకు గంగా న‌దిని ఇక్క‌డ చూడాల్సిందే.

brahmaputra1

బ్రహ్మపుత్ర నది

బ్రహ్మపుత్ర నది తనలో ఒక భిన్నమైన అందాన్ని నింపుకొని ప‌రుగులు తీస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఈ నది ఒడ్డున మీరు అనేక ర‌కాల ఉత్తేజకరమైన దృశ్యాలను చూడవచ్చు. గ‌ల‌గ‌లా ప్ర‌వ‌హించే ఈ నీటి స‌వ్వ‌డులు సప్త వ‌ర్ణాల‌నూ క‌లిగి ఉంద‌ని అంటారు. ఎక్కువ శాతం ఈ నది నీరు ఎరుపు, నీలం మరియు కొన్నిసార్లు గోధుమ రంగులో కనిపిస్తుంది. కుటుంబ స‌మేతంగా ఆహ్లాదంగా గ‌డిపేందుకు ఈ న‌దీ తీరానికి ఎక్కువ మంది సంద‌ర్శ‌కులు వ‌స్తూ ఉంటారు. ఇది హిమాలయాలకు ఉత్తరాన టిబెట్‌లోని పురంగ్ జిల్లాలో ఉన్న మానసరోవర్ సరస్సు సమీపంలో ఉంది. ప్ర‌ముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ఈ ప్రాంతం పేరుగాంచ‌డం వల్ల ఈ సీజ‌న్‌లో సంద‌ర్శ‌కుల తాకిడి ఎక్కువ‌గా ఉంటుంది.

jalem1

జీలం నది

జీలం నది దృశ్యం చూప‌రుల‌ కళ్లకు కనువిందు చేస్తుంది. ఇక్కడకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. జీలం నది అందాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడ హౌస్‌బోట్‌లో విహ‌రిస్తూ ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదించ‌వ‌చ్చు. కాశ్మీర్‌ను సందర్శించాలనుకుంటే, ఖచ్చితంగా జీలం నదిని సందర్శించండి. అలాగే, మీరు మీ వేసవి సెలవులను చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకుంటే, సింధు నది దృశ్యాన్ని చూడటానికి ఖచ్చితంగా వెళ్లండి. ఇది భారత్‌, పాకిస్తాన్ మరియు చైనా గుండా వెళుతూ, మూడు దేశాలను తాకుతుంది. అయితే, మీరు ఈ నది అందాలను చూడాలనుకుంటే, జూన్ నుండి అక్టోబర్ మధ్య వెళ్ళవచ్చు. ఇది ఆసియాలోని పొడవైన నదులలో ఒకటి. ఈ నది జమ్మూ కాశ్మీర్‌లోని లేహ్ జిల్లా గుండా ప్రవహిస్తుంది.

More News

Read more about: river ganga brahmaputra river
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+