Search
  • Follow NativePlanet
Share
» »పురాణ ఇతిహాసాల స‌మ్మేళ‌నం.. క‌డ‌ప‌లోని ఈ ఆల‌యాలు..

పురాణ ఇతిహాసాల స‌మ్మేళ‌నం.. క‌డ‌ప‌లోని ఈ ఆల‌యాలు..

పురాణ ఇతిహాసాల స‌మ్మేళ‌నం.. క‌డ‌ప‌లోని ఈ ఆల‌యాలు..

ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత మనోహరమైన చారిత్రాత్మక నగరాలలో కడప ఒక‌టి. ఇది పెన్నానది ఒడ్డు నుండి 8 కిలోమీటర్ల దూరంలో పాల్కొండ, నల్లమల కొండల సరిహద్దులో ఉంది. ఇది ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ విహారించే ప్రయాణికులకు నిజమైన స్వర్గధామం అనే చెప్పుకోవ‌చ్చు. కడపలో మసీదులు, చర్చిలు, చరిత్రపూర్వ దేవాలయాలు వంటి చారిత్రక అవశేషాలు చాలానే ఉన్నాయి. అలాగే ఇక్కడి ఉత్కంఠభరితమైన ప్రకృతి అందాలు ప‌ర్యాట‌కుల‌ను పరవశింపజేస్తాయి. ఇంకా, ఇక్క‌డ పురాణ ఇతిహాసాలతో కూడిన ఆల‌యాలు చాలానే ఉన్నాయి. రండి, ఇక్క‌డి పురాత‌న ఆల‌యాల‌ను ఒక్క‌సారి చూసొద్దాం.

బ్రహ్మంగారి మఠం ఆలయం

క‌డప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. క్రీస్తుశకం పదిహేడవ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మిక సంపన్నుడు, కాలజ్ఞాన తత్వవేత్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయన ఈ జిల్లాలోని కందిమల్లాయపల్లెలో జీవసమాధి అయ్యారు. ఆ ప్రదేశంలో ఒక ఆలయాన్ని భక్తులు నిర్మించారు. ఆయ‌న పేరుతో ఒక మఠం కూడా ఏర్పాటు చేశారు. వీరబ్రహ్మేంద్రస్వామి పేరుతో ఉన్న ఆ మఠం కాలక్రమేణా ఆ గ్రామం పేరు బ్రహ్మంగారి మఠంగా మారింది. ఇక్క‌డికి తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ భజన మందిరం, పోలేరమ్మ గుడి, ఈశ్వరీదేవి మఠం, కక్కయ్యమఠం, సుమారు 15 కిలోమీట‌ర్ల దూరంలో ఉండే సిద్ధయ్య మఠం చూడదగిన ప్రదేశాలు.

1

ఒంటిమిట్ట కొదండరామ దేవాలయం

కడప నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోదండ రామస్వామి దేవాలయం ఒంటిమిట్టలో ప్రధాన ఆకర్షణ. రాముడు, లక్ష్మణుడు, సీత మూడు చిత్రాలతో కూడిన శిల ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ. కడప సందర్శించే వారు సుప్రసిద్ధ శ్రీ కోదండరామ స్వామి దేవాలయం ఉన్న ఒంటిమిట్టను సందర్శించడం మానరు. ఆలయంలోని ముగ్గురు హిందూ దేవుళ్ల విగ్రహాలు ఒకే రాతిపై చెక్కబడ్డాయి. ఈ ఆలయంలో హిందూ మతంలోని రెండు ప్రసిద్ధ ఇతిహాసాలు రామాయణం మరియు మహాభారతం నుండి కొన్ని సంఘటనలను కళారూపాలలో ప్రదర్శిస్తారు. ఈ ఆలయాన్ని ప్రసిద్ధ ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ వర్ణించాడు. ఇది మొత్తం భారతదేశంలోని గొప్ప పగోడాలలో ఒకటిగా పేరుగాంచింది.

2

అల్లాడుపల్లె వీరభద్ర దేవాలయం

17వ శతాబ్దానికి చెందిన కుముద్వాతి నది ఒడ్డున వీరభద్ర దేవాలయం నిర్మించబడింది. ఈ ఆలయంలోని ప్రధాన ద్వారం కేవలం 5 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది. ఊయల రూపంలో ఉన్న చిన్న మండపంతో పాటు, ఈ ఆలయం నిర్మాణపరంగా అందంగా ఉంటుంది. ఈ స్తంభాలపై వీరభద్రుడు, వీరబ్రహ్మం బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. జిల్లాకు చెందిన ప్రముఖ గురువు పోతులూరు వీరభహ్మం ఈ ఆలయంలో అనేక పూజలు నిర్వహించినట్లు ఇక్క‌డి వారు చెబుతారు.

3

గండి వీరాంజనేయ స్వామి ఆలయం

హిరణ్యఘట్టం అని కూడా పిలువబడే వీరాంజనేయ స్వామి దేవాలయం పాపాగ్ని నది ఒడ్డున ఉంది. పురాణాల ప్రకారం, రావణుడితో యుద్ధం తర్వాత రాముడు ఇక్కడే ఉండిపోయాడని, భగవంతుడు తన ప్రసిద్ధ భక్తుడైన హనుమంతుని బొమ్మను గీసాడని చెబుతారు. ఇక్కడ ప్రార్థనలు చేయడం వల్ల ఎలాంటి మానసిక రుగ్మతలైనా పరిష్కారమవుతాయని స్థానికుల నమ్మకం. హనుమంతుని పాదాల వద్ద ఉద్గవి ఆచార్యుల చిత్రం చూడొచ్చు. విశిష్టత ఏమిటంటే ఇక్కడ విగ్రహం చిటికెన వేలు లేకుండా ఉంటుంది. విగ్రహం నుండి రక్తం ప్రవహించడంతో రాముడు విగ్రహాన్ని చెక్కడం ఆపివేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.

More News

    Read more about: kadapa andhra pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+