Search
  • Follow NativePlanet
Share
» »పార్వతీ దేవి నాట్యంలో ఓడిపోయన ప్రదేశం ఇదే?

పార్వతీ దేవి నాట్యంలో ఓడిపోయన ప్రదేశం ఇదే?

తిళ్లై కాళీ దేవాలయానికి సంబంధించిన కథనం

శివపార్వతుల్లో ఎవరు గొప్పవారన్న వాదనకు సంబంధించిన కథనం మీకందరికి తెలిసిందే. శివ పార్వతి నత్య కార్యక్రమంలో పార్వతి తన ఓటమిని ఒప్పుకొని నెలసిన క్షేత్రమే తిళ్లైకాళి దేవస్థానం. అటువంటి క్షేత్రం యొక్క వివరాలన్నీ మీ కోసం...

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

తిళ్లై కాళి దేవాలయం తమిళనాడులోని చిదంబరం శివారులో ఉంది. శివపార్వతుల మధ్య ఎవరు గొప్పవారాన్న వాగ్వాదం జరిగినది, వారి మధ్య నాట్య పోటీ జరిగింది, పార్వతీ దేవి ఓడిపోయినది ఇదే ప్రాంతంలో.

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

శివ పార్వతుల మధ్య వాదన తీర్చడానికి బ్రహ్మ, విష్ణువుతో పాటు సమస్త దేవతలు ఈ ప్రాంతానికి వస్తారు. వారందరి ముందు శివ పార్వతులు నాట్యం చేస్తారు.

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

ఆ సమయంలో శివుడు ఓర్థువ తాండవాన్ని ప్రదర్శిస్తారు. అంటే తన శిరస్సు పై ఒక కాలును ఉంచుతాడు. ఓర్థువ తాండం నాట్యంలో ఒక భంగిమ. సామన్యంగా మహిళలు ఈ భంగిమను ప్రదర్శించడానికి సంకోచపడుతారు.

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

అందువల్లే పార్వతీ దేవి తన ఓటమిని ఒప్పుకొన్నట్లు చెబుతారు. తిళ్లైకాళి ఉగ్ర దేవి. అమ్మవారి కోపాన్ని బ్రహ్మ వేదం పఠించడం వల్ల తగ్గించి ఆమెను శాంతపరిచాడని చెబుతారు.

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

ఈ దేవాలయంలోని తిళ్లై అమ్మన్ లేదా తిళ్లై కాళి నాలుగు ముఖాలను కలిగి ఉంటుందని చెబుతారు. ఈ దేవాలయంలో అమ్మవారిని ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సందర్శించుకోవచ్చు.

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

అదే విధంగా సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ భక్తులు అమ్మవారిని సందర్శించుకోవచ్చు. మాఘ నక్షత్రంలో పుట్టిన వారు ఇక్కడి అమ్మవారికి అభిషేకం చేస్తారు.

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

అదే విధంగా తమ కోర్కెలు తీరిన తర్వాత భక్తులు అమ్మవారికి తెల్లని వస్త్రాలను సమర్పించడంతో పాటు కుంకుమార్చన చేస్తారు. ఇక్కడ నిత్యం అమ్మవారికి పూజలు అభిషేకాలు జరుపుతారు.

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

అదే విధంగా ప్రతి ఆదివారంతో పాటు రాహుకాలం, అమావస్య, పౌర్ణిమ తదితర రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చిదంబరానికి దగ్గర్లో అంటే చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

తిళ్లై కాళి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

అదే విధంగా తిరుచి, మధురై, చెన్నై ఈ క్షేత్రానికి దగ్గరగా ఉన్న రైల్వేస్టేషన్లు. బస్సు ద్వారా ఈ క్షేత్రాన్ని సందర్శించుకోవాలంటే చెన్నై లేదా మధురై కు వచ్చి అక్కడి నుంచి ట్యాక్సీ ద్వారా ఈ క్షేత్రాన్ని సందర్శించుకోవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+