Search
  • Follow NativePlanet
Share
» »ముంబైకు మొదటిసారి వెలుతున్నారా?

ముంబైకు మొదటిసారి వెలుతున్నారా?

ముంబైను మొదటిసారి సందర్శిస్తున్నవారికి అవసరమైన సూచనలు ఇవే.

భారతీయ చరిత్రకు సంస్కతికి ముంబై ప్రత్యక్ష నిదర్శనం. అంతేకాకుండా పర్యాటక కేంద్రం కూడా. ఈ ముంబైతో పాటు ముంబై చుట్టు పక్కల అనేక చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా మొదటి సారి వెళ్లేవారికి అక్కడ ఏమి చేయాలి? ఏమి చేయాలన్న సందేహం రావచ్చు. వారి సందేహాలను తీర్చే కథనం ఇది. మరెందుకు ఆలస్యం ఒకసారి ఇటువైపు ఒక లుక్ వేయండి.

ఎలిఫెంటా గుహలు

ఎలిఫెంటా గుహలు

P.C: You Tube

ఎలిఫెంటా గుహలు, ముంబై నగరానికి తూర్పున 10 కిలోమీటర్ల దూరంలో ఎలిఫెంటా దీవిలో ఉన్నాయి. ఈ దీవి అరేబియా సముద్రంలో ఉంది. ఇది భారతదేశంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్ల ఒకటి. గుహలు రెండు సమూహాలుగా విభజించబడ్డాయి. ఈ గుహల సందర్శన భారతీయ సంస్కృతి మరియు చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. అదే విధంగా ఈ ద్వీపంలో ఒక గంట పాటు పడవ రైడ్ అందమైన అనుభవం.

గేట్ వే ఆఫ్ ఇండియా

గేట్ వే ఆఫ్ ఇండియా

P.C: You Tube

ముంబైలో చూడదగిన అతి ముఖ్యమైన కట్టడాల్లో గేట్ వే ఆఫ్ ఇండియా ఒకటి. ఇది కింగ్ జార్జ్ V మరియు క్వీన్ మేరీలు భారత దేశాన్ని సందర్శించన జ్జానపకార్థం ఈ కట్టడాన్ని నిర్మించారు. ఈ కట్టడం మొత్తం అరుదైన పసుపు రంగు బసాల్డ్ రాతిని వినియోగించి నిర్మించారు. ఈ కట్టడం వాస్తుశైలి మనలను ఇట్టే ఆకర్షిస్తుంది. ఇక్కడి నుంచి ముంబై నౌకాశ్రయాన్ని చూడటానికి చిన్న చిన్న పడవలు అందుబాటులో ఉంటాయి.

ముంబై బీచ్‌లు

ముంబై బీచ్‌లు

P.C: You Tube

ముంబై బీచ్‌లకు కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. ముంబైలో చౌపట్టి బీచ్, జుహు బీచ్‌లు చాలా ఫేమస్. ఈ రెండు బీచ్లు నగరం యొక్క ఏ మూలలో నుండి సులువుగా అందుబాటులో ఉంటాయి. క్యాబ్స్, ఆటోలు వంటి స్థానిక రవాణా సంస్థలు అందుబాటులో ఉన్నాయి, మరియు స్థానిక రైల్వే స్టేషన్ కూడా సమీపంలో ఉంది. సన్‌బాత్, ఈతకు ఈ బీచ్‌లు అంత అనుకూలం కావు. అయితే సూర్యోదయం, సూర్యాస్తమయాలు చాలా అందంగా ఉంటాయి. ఈ బీచ్‌లో దొరికే స్థానిక తినుబండారాలు కూడా చాలా రుచిగా కూడా ఉంటాయి.

ఫిల్మ్ సిటీ

ఫిల్మ్ సిటీ

P.C: You Tube

గోరేగావ్ ఈస్ట్ వద్ద ఉన్న సంజయ్ గాంధీ నేషనల్ పార్కు సమీపంలో ముంబైలోని ఫిలిం సిటీ ఉంది. ఇది బాలీవుడ్ కేంద్రం. భారతదేశంలోని ప్రసిద్ధ చలన చిత్ర పరిశ్రమ. ఈ స్టూడియో కాంప్లెక్స్ విస్తారమైనది.

సినిమా షూటింగ్ ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా రికార్డింగ్ గదులు, తోటలు, సరస్సులు, థియేటర్లు ఎన్నో ఉన్నాయి. ఇది 1911 లో నిర్మించబడింది.

ఇది భారతదేశంలో ఉత్తమ చలనచిత్ర స్టూడియోలలో ఒకటి. ఇది గోరేగావ్ రైల్వే స్టేషన్ నుండి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతే కాకుండా ముంబైలోని ఎక్కడి నుంచి అయినా రోడ్డు ద్వారా ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు.

టౌన్ హాల్ మరియు మహాలక్ష్మీ రేస్కోర్స్ సమీపంలో ఉన్న మరో రెండు పర్యాటక ప్రాంతాలు.

నైట్ ‌లైఫ్‌ను ఎంజాయ్ చేయండి

నైట్ ‌లైఫ్‌ను ఎంజాయ్ చేయండి

P.C: You Tube

ముంబైకు ‘నెవర్ స్లీప్ సిటీ' అని పేరు. అంటే ఇక్కడ రాత్రి పూట జరిగే పార్టీలు చాలా మనోరంజకంగా ఉంటాయి. ముఖ్యంగా పబ్‌లు, మ్యూజిక్‌ను ఎక్కువగా ఇష్టపడేవారు ఈ ముంబై నైట్‌లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వెలితే మీకు బాలివుడ్ స్టార్లు కూడా కనబడవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+